Tunisha Sharma Death: నా కొడుకును ఆత్మహత్య చేసుకునేలా హింసిస్తున్నారు.. షీజన్ ఖాన్ తల్లి ఆవేదన..

తునీషా తల్లి వ్యాఖ్యలపై షీజన్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కొడుకు గురించి వస్తున్న వార్తలు నిరాధరమైనవని.. తునీషా మానసిక స్థితిని ఆమె తల్లి ఎప్పుడూ పట్టించుకోలేదని..కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఈరోజు తను బతికే ఉండేదని ఆరోపించారు.

Tunisha Sharma Death: నా కొడుకును ఆత్మహత్య చేసుకునేలా హింసిస్తున్నారు.. షీజన్ ఖాన్ తల్లి ఆవేదన..
Thunisha Sharma, Sheezan Kh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2023 | 8:46 AM

హిందీ సీరియల్ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఉత్తరాదిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె నటిస్తోన్న అలిబాబా దస్తాన్ ఇ కాబూల్ సీరియల్ సెట్ లోని మేకప్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది తునీషా. తన కూతురు చనిపోవడానికి కారణం ఆమె ప్రియుడు షీజన్ ఖాన్ అంటూ తునీషా తల్లి ఆరోపించడంతో.. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. తన కూతురు మానసికంగా .. శారీరకంగా ఎంతో హింసించాడని.. తనకు హిజాబ్ ధరించడం..ఉర్దూ మాట్లాడం నేర్పించాడంటూ ఆరోపించింది. దీంతో తునీషా మరణం లవ్ జిహాద్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. తాజాగా తునీషా తల్లి వ్యాఖ్యలపై షీజన్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కొడుకు గురించి వస్తున్న వార్తలు నిరాధరమైనవని.. తునీషా మానసిక స్థితిని ఆమె తల్లి ఎప్పుడూ పట్టించుకోలేదని..కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఈరోజు తను బతికే ఉండేదని ఆరోపించారు.

తునీషా హిజాబ్ ధరించడం.. దర్గాకు వెళ్లడం అంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవని.. ఒక మతాన్ని అనుసరించడం అనేది మన వ్యక్తిగత విషయమని.. ఆమెను హిజాబ్ ధరించమని మేము బలవంతం చేశామని అంటున్నారు… కానీ మేము అలాంటి విషయాలు చెప్పలేదు. తునీషా నటిస్తోన్న అలీ బాబా దస్తా ఈ కాబూల్ చిత్రీకరణలోని ఓ ఫోటో మాత్రమే అది. కేవలం సీరియల్ కోసం ఆమె హిజాబ్ ధరించింది. ఫలక్ తన కుమార్తెను దర్గాకు తీసుకెళ్లాడని తునీష తల్లి చేసిన వాదనను షీజన్ తల్లి ఖండించారు. అందుకు సాక్ష్యం ఉంటే చూపించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తునీషాను తమ కొడుకు కొట్టాడాని వనితా శర్మ చేసిన ఆరోపణలను షీజన్ తల్లి ఖండించింది. సెట్ లో తమ బిడ్డ తునీషాను చిత్రహింసలకు గురిచేస్తుంటే.. మీరు అక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారా ?.. గతంలో మీరు నాతో ఫోన్ మాట్లాడారు. మరీ అప్పుడే ఎందుకు చెప్పలేదు ? అప్పుడే ఎందుకు షీజన్ పై చర్యలు తీసుకోలేదు ?.. ముందే ఈ విషయం చెప్పి ఉంటే మేము షీజన్ ను చెంపదెబ్బ కొట్టి ఉండేవాళ్లం. తమ కూతురు ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకునేవరకు ఎందుకు ఎదురుచూస్తున్నారు ? అంటూ ప్రశ్నించింది. తునీషాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. కానీ కొడుకు ఎందుకు హింసిస్తున్నారు.. మీ కూతురు లాగే.. షీజన్ కూడా ఆత్మహత్య చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారా ? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది షీజన్ ఖాన్ తల్లి. ఇక మరోవైపు తునీషా ఆత్మహత్య కేసులో పలు విషయాలు బయటకు వస్తున్నాయి.