Varsha HK: పెళ్లి పీటలెక్కనున్న తెలుగు సీరియల్ నటి.. ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న వర్ష..
ప్రముఖ బుల్లితెర నటి వర్ష హెచ్కే త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈరోజు తన ప్రియుడు కన్నడ నటుడు కౌశిక్ నాయుడితో వర్ష నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కౌశిక్ నాయుడు నెట్టింట షేర్ చేశారు. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ కన్నడ బ్యూటీ.