AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paluke Bangaramayana: మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు నిఖిల్.. ఆకట్టుకుని అంచనా పెంచేసిన ‘పలుకే బంగారమాయెనా’ ప్రోమో..

భిన్నమైన కథా నేపధ్యం ఉన్న సీరియల్స్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో  దూసుకుపోతోంది స్టార్ మా. దాదాపు టాప్ 5 సీరియల్స్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ అని చెప్పవచ్చు. కార్తీక దీపం సీరియల్ ప్లేస్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మ ముడి టాప్ రేటింగ్ తో దూసుకుని పోతోంది. నాగ పంచమి, కృష్ణా ముకుందా మురారి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ వంటి సీరియల్స్ తో ప్రేక్షకులను […]

Paluke Bangaramayana: మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు నిఖిల్.. ఆకట్టుకుని అంచనా పెంచేసిన 'పలుకే బంగారమాయెనా' ప్రోమో..
Paluke Bangaramayana
Surya Kala
|

Updated on: Jun 05, 2023 | 8:40 AM

Share

భిన్నమైన కథా నేపధ్యం ఉన్న సీరియల్స్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో  దూసుకుపోతోంది స్టార్ మా. దాదాపు టాప్ 5 సీరియల్స్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ అని చెప్పవచ్చు. కార్తీక దీపం సీరియల్ ప్లేస్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మ ముడి టాప్ రేటింగ్ తో దూసుకుని పోతోంది. నాగ పంచమి, కృష్ణా ముకుందా మురారి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ వంటి సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తోన్న స్టార్ మా లో త్వరలో సరికొత్త సీరియల్ ప్రసారం కానుంది. ఈ సీరియల్ పేరు పలుకే బంగారమాయెనా.. అంటూ సాంప్రదాయ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  రామదాసు రాసిన గీతంలోని తొలి పదాలనే టైటిల్ గా తెరకెక్కిస్తున్న ఈ కొత్త సీరియల్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.

ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నత్తితో బాధపడే హీరోయిన్.. పోలీసు అధికారిగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ప్రేమ్ గా ఆకట్టుకున్న నిఖిల్ నాయర్ మళ్ళీ ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

నత్తితో బాధపడుతున్న హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. తల్లికి ఎదో చెప్పబోతున్న హీరోయిన్ నత్తితో ఇబ్బంది పడుతుంటే.. అమ్మతో పాటు నాన్న.. ఇంట్లో ఫ్యామిలీ సభ్యులు అందరూ చిన్న చూపు చూస్తూ ఉంటారు. మాట్లాడొద్దు అంటూ ఉంటారు.

అయితే పానీ పూరి తింటున్న సమయంలో.. హీరో నిఖిల్ తన పై ఆఫీసర్ తో వార్నింగ్ తీసుకుని దొంగ ను పట్టుకోవడానికి హీరోయిన్ ఉన్న వైపు వస్తాడు. ఒక దొంగ ఇటు వెళ్లాడు నువ్వు చూశావా..  మాట్లాడు అంటూ హీరోయిన్ ని అడుగు తాడు.. మొదటి సారి నను మాట్లాడమనే మనిషి ఎదురు పడ్డాడు. అంటూ హీరోయిన్ ఆలోచిస్తుంది..

పెదవి దాటని మాటకు ఒక సరికొత్త ఆశ బాసట కాబోతుందా..  అనే వాయిస్ తో ప్రోమో ముగుస్తుంది. ఈ పలుకే బంగారమాయెనా సీరియల్ ఎప్పటి నుంచి ప్రసారం కానున్నది ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పటికే అమ్మని ప్రేమించే కొడుకుగా.. ప్రేమ్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్న నిఖిల్ నాయర్ మళ్ళీ ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలో ప్రసారం కానున్న ఈ కొత్త సీరియల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని ప్రోమో చూస్తే తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్