Mogali Rekulu: ‘మొగలి రేకులు’ సీరియల్ నటుడు దయ మృతి.. ఇంద్రనీల్ భార్య ఎమోషనల్..

ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ అంటే ఠక్కున గుర్తొచ్చేది చక్రవాకం. మంజుల నాయుడు తెరకెక్కించే సీరియల్స్ అంటే అప్పట్లో టీవీ అడియన్స్‏కు విపరీతమైన ఇష్టముండేది. చక్రవాకం తర్వాత అదే స్తాయిలో ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకున్న మరో సీరియల్ మొగలి రేకులు. ఈ సీరియల్స్ కొన్నేళ్లపాటు అత్యధిక రేటింగ్ అందుకుని నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయాయి.

Mogali Rekulu: 'మొగలి రేకులు' సీరియల్ నటుడు దయ మృతి.. ఇంద్రనీల్ భార్య ఎమోషనల్..
Pavitranath
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 02, 2024 | 10:04 AM

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మొగలిరేకులు సీరియల్ ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్ స్టా ద్వారా తెలిపారు. అతడిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. “పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో చాలా ముఖ్యమైనవాడివి. ఈ వార్త విన్న తర్వాత మేము ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధం అయితే బాగుండని ఆశపడ్డాను.. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణయించుకులేకపోతున్నాం. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దయ చనిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ అంటే ఠక్కున గుర్తొచ్చేది చక్రవాకం. మంజుల నాయుడు తెరకెక్కించే సీరియల్స్ అంటే అప్పట్లో టీవీ అడియన్స్‏కు విపరీతమైన ఇష్టముండేది. చక్రవాకం తర్వాత అదే స్తాయిలో ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకున్న మరో సీరియల్ మొగలి రేకులు. ఈ సీరియల్స్ కొన్నేళ్లపాటు అత్యధిక రేటింగ్ అందుకుని నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయాయి. మొగలి రేకులు సీరియల్లోని పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో కనిపించిన ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. ముగ్గురు అన్నదమ్ములుగా కనిపించిన వీరిలో చిన్నవాడు దయ. ఎంతో అల్లరిగా , అమాయకంగా కనిపించే పాత్ర తనది. కానీ సీరియల్ మధ్యలో దయ చనిపోవడంతో అతడి పాత్ర ముగిసింది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ చేసిన దయ.. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్ స్టా పోస్టుపై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది ?.. దయ ఎలా చనిపోయాడు ? ఎప్పుడు జరిగింది ? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో పవిత్రనాథ్ పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే తన ఇంటికి చాలా మందిని తీసుకువచ్చేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. అలాగే తన అత్తామామలు కూడా తనను వేధించేవారని పవిత్రనాథ్ భార్య ఆరోపించింది.

View this post on Instagram

A post shared by Meghna Raami (@raamimeghna)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.