కృష్ణ ఇచ్చిన కన్నయ్య బొమ్మని చూసి గతం గుర్తు చేసుకుంటారు కృష్ణ, మురారీలు.. కృష్ణ ఆ గిఫ్ట్ ను తిరిగి ఇచ్చెయ్యడంతో కన్నీరు పెట్టుకుంటుంది. మరోవైపు ఆనందంలో మునిగి తేలుతూ కృష్ణ నువ్వు నాకు ఇంటి బాధ్యతను అప్పగించావు.. కానీ నాకు మాత్రం నా ప్రేమని నాకు ఇచ్చినట్లు ఉంది.. దేవుడా నేను అనుకున్నట్లే అన్నీ జరుగుతున్నాయి.. థాంక్యూ సో మచ్ అంటుంటే.. అలేఖ్య వచ్చి ముకుందా అని అంటుంటే.. రా అలేఖ్య వచ్చి కూర్చో అంటూ కూర్చోబెట్టి.. నువ్వు ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నా అంటే.. నేను వస్తానని ఎలా ఊహించవు అంటుంది అలేఖ్య..
ఇంట్లో ఏమి జరిగినా అందరికంటే నీకే కదా ముందు తెలిసేది అందుకే నీ కోసం ఎదురుచూస్తున్నా అంటుంది ముకుంద.. దీంతో అలేఖ్య మన ఇంట్లో ఏ విశేషం జరగలేదే అంటే.. ముకుంద జరిగింది అని చెప్పడంతో షాక్ తింటుంది అలేఖ్య.
ఏమిటది అంటే నా ప్రేమ ఓడిపోతుంది అన్నావు కదా.. నా ప్రేమ ఎప్పటికి ఓడిపోదు అలేఖ్య.. నా ప్రేమే గెలుస్తుంది అని ముకుంద చెప్పడంతో .. అంటే ఇప్పుడు కృష్ణ క్యాంప్ కని చెప్పి.. ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుందా అని అడుగుతుంది అలేఖ్య. నీకు అన్నీ తెలుసు అనుకుంటావు కానీ నీకు అన్నీ సగం సగం తెలుసు.. అంటే.. నేను సస్పెన్స్ తట్టుకోలేను చెప్పు అని అనగానే.. కృష్ణ క్యాంప్ కి వెళ్తుంది కానీ.. మళ్ళీ తిరిగి రాదు అంటే.. భలే ప్లాన్ వేశావు ముకుంద అంటే.. నేను ప్లాన్ వేయడం ఏమిటి.. నేను కృష్ణను బయటకు పంపించాలని అనుకోలేదు.. నాకు మురారీ కావాలి అంతే అంటుంది .. ఐ లైనర్ కావాలి అంటూ ముకుంద దగ్గర తీసుకుని వెళ్ళిపోతుంది అలేఖ్య.
సునంద కృష్ణ, మురారీల ప్రేమ గురించి ఆలోచిస్తుంది.. గౌతమ్ మాట్లాడుతూ.. ఇంత తక్కువ టైం లోనే మీ ఇంట్లో అందరితోనూ కలిసి పోతానని అనుకోలేదు నందు.. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని అంటాడు.. నందు.. ఇక్కడికి రాగానే నీ కళ్లలో మెరుపు… మీ అన్న మురారీతో మాట్లాడిన తర్వాత మాయం అయింది.. అది ఏమిటో నాకు చెప్పమని అడగడమే.. కాదు ఏమీ లేదు అంటున్న సునంద.. తో నామీద ఒట్టు అనడంతో.. నీతో చెప్పకూడదని ఏమీ లేదు.. కొన్ని రోజుల్లో కృష్ణ, మురారీలు శాశ్వతంగా విడిపోతున్నారు.. అని చెప్పడంతో.. నందు షాక్ తింటాడు.. అప్పుడు అసలు విషయం చెప్పడమే కాదు.. మా అన్నయ్యకు కృష్ణ అంటే చాలా ఇష్టం. కృష్ణ మనసులో తాను లేనని తన ప్రేమని కృష్ణ కు చెప్పలేక.. తనలో తానే కుమిలిపోతున్నాడు అంటుంది సునంద. వాడి ప్రేమ గురించి కృష్ణకు చెప్పాలని ఉంది.. అయితే ఒట్టు వేయించుకున్నాడు.. నువ్వు అయితే ఏమి చేసేవాడివి.. ఇద్దరినీ కలపడానికి వెయ్యి అబద్దాలు చెప్పామన్నారు.. ఇద్దరిని కలపడానికి మనం ప్రయత్నిద్దాం.. మన ఇద్దరినీ ఒకటి చేసిన వారు విడిపోతుంటే ఎలా చూస్తూ ఉంటాం.. రేపు కృష్ణ క్యాంప్ కు వెళ్లే లోపు ప్రేమగురించి చెప్పేద్దాం.. అనుకుంటారు.
మురారీ కృష్ణతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. నాకులా కృష్ణకు ఏమీ గుర్తుకు రావా అనుకుంటుంటే.. ఇంతలో కృష్ణ వస్తుంది.. హాయ్ కృష్ణ అంటే.. ఇదేంటి కొత్తగా అని అడగడమే.. అర్ధమయింది.. ఇప్పుడు హాయ్ చెబుతారు.. రేపు శాశ్వతంగా బాయ్ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారని అర్ధం అయింది. అదేమీ లేదు కృష్ణ అంటే.. సరే రూమ్ నుంచి ఐదు నిముషాలు బయటకు వెళ్ళండి నేను సారీ చేంజ్ చేసుకోవాలని అని మురారీని బయటకు పంపించి. రూమ్ లో తాను మురారీ కోసం కొన్న మురళీని గిఫ్ట్ ను పెడుతుంది. అందరికీ వాళ్లకు తగ్గట్టుగా గిఫ్ట్ లు ఇచ్చాను.. మీకు ఇదే సరైంది.. లాఠీ పట్టుకునే చేతుల్లో ఈ మురళీ సరైన గిఫ్ట్ అని ఇస్తున్నా.. దీనిని నేను వెళ్ళాక చూడండి.. విసిరి పడేయకండి.. ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు వస్తాకదా సార్ అనుకుంటూ.. బీరువాలో గిఫ్ట్ ని పెట్టి తలుపు తీసి రమ్మని అనుకుంటుంది. ఇదేమిటి సారీ చేంజ్ చేసుకుంటానని అంది.. అదే చీరలో ఉంది అని ఆలోచిస్తుంటే.. ఎక్కువ ఆలోచించకండి.. నేను వెళ్ళాక తెలుస్తుంది ఈ ఐదు నిముషాలు ఏమి చేశానో.. ఎక్కువ ఆలోచించకుండా నిద్రపోండి.. అని చెబుతుంది
ఇక ఇదే చివరి రోజు కదా.. రేపు ఈ టైమ్ కి నేను ఎక్కడో.. నీవు ఎక్కడో.. అని మురారీ అనుకుంటే.. కృష్ణ నిద్రరాకపోయినా .. నిద్రపోతున్నట్లు నటిస్తా.. లేదంటే అగ్రిమెంట్ మ్యారేజ్ ను పర్మినెంట్ చేయండి అని ఎక్కడ అడిగేస్తానో అని భయమేస్తుంది అని ఇద్దరూ గుడ్ నైట్ చెప్పుకుంటారు.
రేవతి స్వామి నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా.. మరి నా బిడ్డలు విడిపోవాలని ఆఙ్ఞాపించావా స్వామి.. వాళ్ళు ఏమీ పాపం చేశారయ్యా .. వాళ్ళిద్దరిని కలపడానికి నేను ప్రయత్నాలు నీకు తెలుసు.. . నీకు కోపం ఉంటె ఆ శిక్ష నాకు ఇవ్వు స్వామి..ఆనందంగా భరిస్తా.. ఆ బిడ్డల మీద నీ చల్లని దీవెన ఉంచు స్వామి.. కృష్ణ మళ్ళీ నట్టింట్లో నడిచే టట్లు చెయ్యి స్వామి అని రేవతి ప్రార్ధిస్తుంది.
కృష్ణ నిద్ర లేచి మురారీని ప్రేమ గా చూస్తూ.. ఇన్నాళ్ల జ్ఞాపకాలకు నేటితో వీడ్కోలు.. విడుదలే కోరుకుండా.. శాశ్వతంగా బంధీ అవ్వలని పదేపదే కోరుకునే గది ఈ గది .. నా జీవితం లోని ఎప్పటికీ మరచిపోలేని.. మరపు రాని మధురానుభూతులన్నీ ఈ గదిలోనే వదిలేసి వెళ్తున్నా అనుకుంటూ.. మురారీ నుదిటి మీద ప్రేమగా చేయి వేస్తుంది.. ఏసీపీ సార్.. ఇన్నాళ్ల మీ సావాసంలో సరదాలు, సంతోషాలు, కోపాలు, అలకలు అన్నీ ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. మీరు చేసిన సాయం జీవితంలో మరచిపోలేను .. అవి తీర్చుకోలేని ఋణం.. రేపటి నుంచి మిమ్మల్ని మిస్ అవుతాను.. నా మనసులో మీరున్నారు.. మీ తలరాతలో నేనున్నా.. కానీ మనసులో నేను లేను.. అనుకుంటే.. మురారీ నిద్రస్తాడు..
సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో .. కృష్ణ ఇంటి నుంచి వెళ్లిపోతుందా.. ముకుంద ప్రేమ దక్కుతుందా.. చూడాలంటే సోమవారం వరకూ ఆగాల్సిందే..
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..