Chetana Raj Death: సినీ పరిశ్రమలో విషాదం..టీవీ నటి చేతన్ రాజ్ మృతి.. ఆ చికిత్స కోసం వెళ్తే ప్రాణాలే పోయాయి..

సోమవారం బెంగుళూరులోని నవరంగ్ సర్కిల్లోని శెట్టి కాస్మోటిక్ హాస్పిటల్లో చేరిన ఆమె కొవ్వు తగ్గేందుకు ఫ్యాట్ సర్జరీ చేయించుకుంది..

Chetana Raj Death: సినీ పరిశ్రమలో విషాదం..టీవీ నటి చేతన్ రాజ్ మృతి.. ఆ చికిత్స కోసం వెళ్తే ప్రాణాలే పోయాయి..
Chetan Raj
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 17, 2022 | 10:10 PM

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. ప్రముఖ బుల్లితెర నటి చేతన్ రాజ్ (Chetan Raj) మృతి చెందింది.. 21 ఏళ్ల చేతన్ రాజ్ కాస్మోటిక్ శస్త్రచికిత్స చేయించుకోవడం వలన చనిపోయినట్లుగా తెలుస్తోంది. సోమవారం బెంగుళూరులోని నవరంగ్ సర్కిల్లోని శెట్టి కాస్మోటిక్ హాస్పిటల్లో చేరిన ఆమె కొవ్వు తగ్గేందుకు ఫ్యాట్ సర్జరీ చేయించుకుంది.. సర్జరీ చేస్తున్న సమయంలో ఊపిరితిత్తులలో నీటి శాతం చేరడం చేతన్ రాజ్ చనిపోయినట్లుగా సమాచారం. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని చేతన్ రాజ్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల అంగీకారం లేకుండా.. అవసరమైన పరికరాలు కూడా లేకుండా తమ కూతురికి ఫ్యాట్ సర్జరీ ఎలా చేస్తారంటూ చేతన్ రాజ్ తండ్రి వరదరాజ్ ఆరోపించారు. చేతన్ పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది..

చేతన్ రాజ్ తన కుటుంబంతో కలిసి బెంగుళూరులోని అబ్బేగెరెలో నివసిస్తుండేది. చేతన్ రాజ్ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడతామని వైద్యులు తెలిపారు.. చేతన్ రాజ్ కలర్స్ కన్నడలో గీత, దొరసాని, లీనింగ్ స్టేషన్ వంటి పలు సీరియల్స్ లలో నటించారు. అలాగే హవాయి సినిమాలోనూ నటించారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమె తన తల్లిదండ్రులకు తెలియకుండా ఫ్యాట్ సర్జీరి చికిత్స చేయించుకుందని. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది.. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆమె ఊపరితిత్తుల్లోకి నీరు చేరిపోవడంతో దాదాపు నాలుగు గంటలు చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. కానీ అంతలోనే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా.. తల్లిదండ్రుల అనుమతి లేకుండా తమ కూతురికి శస్త్ర చికిత్స ఎలా చేస్తారంటూ చేతన్ రాజ్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కూతురు మరణానికి కారణమని ఫిర్యాదు చేశారు చేతన్ రాజ్ కుటుంబసభ్యులు.

టీవీ నటి చేతన్ రాజ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కింది వీడియోను చూడండి..

ఇవి కూడా చదవండి