AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ఇదెట్టా.. శివరాత్రి పాకిస్తాన్‌పై భారీ విజయం.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ కానుందా..?

IND vs PAK: ఈసారి టీ20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కథ కాస్త భిన్నంగా కనిపించింది. ఫలితం మాత్రం మామూలుగానే భారత్‌కు అనుకూలంగా వచ్చింది. కానీ ఈసారి విజయం మాత్రం భారీ తేడాతో దక్కడం గమనరా్హం. భారత జట్టు పాకిస్తాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో ఓడించింది.

IND vs PAK: ఇదెట్టా.. శివరాత్రి పాకిస్తాన్‌పై భారీ విజయం.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ కానుందా..?
Ind Vs Pak Mahashivratri Results
Venkata Chari
|

Updated on: Feb 16, 2026 | 8:18 AM

Share

టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన సూర్యకుమార్ సేన సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఈ ఫలితం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ, పాకిస్తాన్ జట్టు చాలా సులభంగా ఓడిపోయిన తీరు మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించింది. భారత జట్టు ఏకపక్షంగా ఆడి 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో భారత జట్టు మరోసారి ట్రోఫీని కాపాడుకునే శక్తి ఉందన్న ఆశలు బలపడ్డాయి. అయితే, ఇలాంటి విజయం ఎక్కడైనా చివరికి టైటిల్ కోల్పోయే సంకేతమా? అన్న సందేహం కూడా కొందరిలో కలుగుతోంది. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం ఫిబ్రవరి 15న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టీమ్ ఇండియా సులభంగా గెలిచింది. ఇది తొలిసారి కాదు. వరల్డ్ కప్ 2015లో కూడా ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్‌ను ఓడించింది.

అంతేకాదు, ఈ మ్యాచ్ జరిగిన రోజు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. శివ భక్తులకు, దేశ ప్రజలకు టీమ్ ఇండియా ఈ రోజున గెలుపుతో చక్కటి బహుమతి అందించింది. ఇదే సమయంలో 22 ఏళ్ల క్రితం జరిగిన మరో మ్యాచ్ జ్ఞాపకాలను కూడా ఇది గుర్తు చేసింది. 2003 ప్రపంచకప్‌లో కూడా మహాశివరాత్రి రోజునే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా విజయం సాధించింది.

అప్పట్లో చేజారిన ట్రోఫీ.. ఈసారి అయినా కుదిరేనా?

ఇవి అన్నీ కేవలం యాదృచ్ఛికమా? 2015 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియ చేతిలో ఓడిపోయింది. ఆస్ట్రేలియానే చివరకు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అంతకుముందు 2003 ప్రపంచకప్ ఫైనల్లో కూడా భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్ కోల్పోయింది.

ఈసారి కూడా ఫిబ్రవరి 15, మహాశివరాత్రి ఒకే రోజున వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఇప్పటివరకు సాధించిన అతిపెద్ద విజయంగా ఈ మ్యాచ్ నిలిచింది. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ టీమ్ ఇండియా ట్రోఫీకి దూరమవుతుందా? లేకపోతే ఈసారి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు చరిత్రను మార్చుతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం