Bigg Boss5 Telugu: రియాల్టీ షోలన్నింటిలో బిగ్ బాస్ షో వేరయా.. అంటారు చూసినవారందరూ..! నచ్చినా…నచ్చిక పోయినా.. తిట్టుకుంటూనో.. నవ్వుకుంటూనో… చూస్తుంటారు మరి కొందరు. ఇలా ఆల్మోస్ట్ అందర్నీ మడతేసి.. హోల్ అండ్ సోల్‌గా ఎంటర్‌టైన్మెంట్ చేసే ఈ షో ఎందుకంత పాపులరో తెలుసా..? ఎందుకంటే పక్కంటి పంచాయతీ మనకిష్టం కనుక..! చూస్తే ఆ మజానే వేరనే ఫీల్ మనకొస్తుంది కనుక..! అవును బుల్లి తెరపై బిగ్ బాస్ సందడి అతి తొందర్లో మళ్లీ షురూ కాబోతోంది. ఈ సారి కొత్త లోగోతో.. సరికొత్త థీమ్‌తో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్దంగా ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో ఇంట్లోనే ఉన్న జనాలను సీజన్ 4 ఎలాగైతే ఎంటర్‌టైన్ చేసిందో… కరోనా సెకండ్ వేవ్ నుంచి బయట పయటపడుతున్న జనాలకు ఈ సారి కాస్త ఎగ్జైట్ మెంట్ అండ్ ఎంటర్‌టైన్ మెంట్‌ను సీజన్ 5 ఇవ్వబోతోంది. థర్డ్ వేవ్ ముప్పుకు అతి దగ్గరగా ఉన్న తెలుగు ప్రేక్షకులను.. సాయంత్రాలు బయటికి వెళ్లనివ్వకుండా.. టీవీకే అతుక్కుపోయేలా.. చేయబోతోంది. క్రేజీ కంటెస్టెంట్లను మన కోసం రంగంలోకి దించబోతోంది. ఫారిన్లో పుట్టుకొచ్చిన ఈ రియాలిటీ షో.. అక్కడ విపరీతంగా పాపులర్ అయి నేరుగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేసింది. టెలీకాస్ట్ అయిన మొదటి సీజనే అమేజింగ్ రెస్పాన్స్ సాధించడంతో… అక్కడ నుంచి ఈ కాన్సెఫ్ట్ సౌత్ఇండియన్ ఇండస్ట్రీల్లోకి ప్రవేశించి.. ప్రవేశించడమే కాదు.. తెలుగు, తమిళ్, కన్నడ్ , మలయాళ బాషల్లో బుల్లితెరపై మంచి టీఆర్పీ రేటింగ్లు సాధిస్తూ… సీజన్ల మీద సీజన్లుగా సాగుతోంది.
ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లు రాగా… ఫస్ట్ సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించారు. ఈ సీజన్‌లో హీరో శివబాలాజీ విన్నర్ కాగా.. క్యారెక్టర ఆర్టిస్ట్ ఆదర్శ్ రన్నర్ గా నిలిచారు. ఇక సెకండ్ సీజన్‌ను నాచురల్ స్టార్ నాని ముందుడి నడిపించగా… ఈ సీజన్లో కౌశల్ మంద రన్నర్‌గా … సింగర్ గీతామాధురి రన్నర్ గా నిలిచారు. మూడో సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయగా.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్‌లో విన్నర్‌గా నిలిచారు.. యాంకర్ శ్రీముఖి రన్నర్ గా నిలిచారు. కరోనా ఫస్ట్ వేవ్ తరువాత మొదలైన బిగ్ బాస్ 4వ సీజన్‌కు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక ఈ సీజన్‌లో అభిజిత్ విన్నర్ కాగా.. అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచారు. ఇలా ఫస్ట్ సీజన్ నుంచి ఫోర్త్ సీజన్ వరకు సాగిన ఈ రియాల్టీ షో తాజాగా సీజన్5ని అతి తొందర్లో స్టార్ట్ చేయబోతోంది. రెండు సీజన్‌లను తనదైన స్టైల్లో రన్ చేస్తూ… బుల్లి తెర బిగ్ బాస్ గా మారిపోయిన నాగార్జునే.. 5వ సీజన్‌కు కూడా హోస్టింగ్ చేస్తున్నారు. బోర్ డమ్ కి చెప్పేయ్ గుడ్ బై… వచ్చేసింది మీ బిగ్ బాస్…” అంటూ ఫిఫ్త్ సీజన్ ప్రమోషన్ గ్రాండ్ గా మొదలైంది. గతంలో రెండుసార్లు హోస్ట్ గా చేసిన నాగార్జునకే హ్యాట్రిక్ ఛాన్స్ ఇచ్చారన్నది కొత్త ప్రోమో ద్వారా నిర్వాహకులు చెప్పాలనుకున్న కీలక సారాంశం. లాక్ డౌన్ తో థియేటర్లు లేక వినోదం కోసం మొహం వాచిన ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఈ ప్రోమో స్పెషల్ గా టార్గెట్ చేసింది. అయితే ఇప్పటికే సీజన్ 5 బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు పేర్లు అనేకమందివి వినిపిస్తున్నాయి. ఈసారి సీజన్ లో సందడి చేయడానికి యాంకర్ రవి, లోబో, సినిమా హీరోయిన్ ఇషా చావ్లా, నవ్య స్వామి, యూట్యూబ్ నిఖిల్, డాన్సర్ ఆనీ మాస్టర్, టిక్ టాక్ దుర్గారావు, జబర్దస్త్ వర్షిని, సీరియల్ ఆర్టిస్ట్ విజే సన్నీలు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క రఘు మాస్టర్, సురేఖావాణి, సిరి హనుమంత్, యూట్యూబ్ ఫేమ్ షన్ముఖ్ జశ్వంత్ రాబోతున్నిరనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ సీజన్ 5 లో సందడి చేసే కంటెస్టెంట్ల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.