Bigg Boss Telugu: సిరి-శ్రీహాన్‌ల కొడుకు గురించి బయట ప్రచారం అంతా తప్పే.. ఇదిగో అసలు క్లారిటీ
బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో ప్రజంట్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకువస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్‌గా సాగుతున్నాయి. తాజాగా శ్రీహాన్ కోసం సిరి లోపలికి వచ్చింది.
శ్రీహాన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి సిరి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో ఓ బాబు సైతం లోపలికి వచ్చాడు. ఆ చిన్నోడు సిరిని మమ్మీ అంటున్నాడు. శ్రీహాన్‌ను డాడీ అని పిలిచాడు. ఆ బుడతడ్ని ఎత్తుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు శ్రీహాన్. ఆ బుడ్డోడు అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందర్నీ ఇమిటేట్ చేస్తూ సూపర్ ఫన్ అందించాడు. ఆడుతూ పాడుతూ చాలా యాక్టివ్‌గా కనిపించాడు. బయట శ్రీహాన్, సిరిలు ఒకేచోట ఉంటున్నారు కానీ.. వారికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మరి ఈ బుడతడు ఎవరు అని చాలామందికి డౌట్ వచ్చింది. ఆ బాబు అనాథ అని.. లేదు ఆ బాబు పేరెంట్స్ పేదరికంలో ఉండటంతో సిరి ఆ చిన్నోడుని దత్తత తీసుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ రూమర్సే.
సిరి, శ్రీహాన్ దత్తత తీసుకుని పెంచుకుంటున్న ఈ చిన్నోడి పేరు చైతు. అయితే ఆ బాబు బయట వ్యక్తి కాదు. సిరి మేనమామ కొడుకు. ఈ విషయాన్ని స్వయానా సిరి తల్లి శ్రీదేవి గతంలో వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 5లో సిరి ఇంట్లో ఉన్నప్పుడు లోపలికి వెళ్లారు ఆమె తల్లి శ్రీదేవి. ఆపై బయటకు వచ్చిన ఆమె చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు ఈ చిన్నోడి ప్రస్తావన వచ్చింది. సిరి పెంచుకుంటున్న బాబు ఎవరో కాదు.. మా తమ్ముడి కొడుకే అంటూ సిరి శ్రీదేవి అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.
గతంలో బిగ్ బాస్ సీజన్ 5 ఇంట్లో ఉన్నప్పుడే.. సిరి కూడా ఈ బాబు గురించి చెప్పుకొచ్చింది. కావాలంటే ఆ సీజన్ 51వ ఎపిసోడ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తనకు ఓ బాబు ఉన్నాడని.. తనకు పుట్టకపోయినా.. కొంతకాలంగా తన దగ్గరే ఉన్నట్లు వెల్లడించింది. చైతూని తాను కనకపోయినా.. చాలా బాండింగ్ ఉందని వెల్లడించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..