AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Municipal Election Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ప్రస్తుత ట్రెండ్స్ ఇవే..

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరా హోరి పొరు కొనసాగుతోంది.. పలు ప్రాంతాల్లో బీజేపీ కూడా ముందంజలో కొనసాగుతోంది.. అయితే.. మొదటి ఫలితం రానే వచ్చింది. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బోణి కొట్టింది.

Telangana Municipal Election Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ప్రస్తుత ట్రెండ్స్ ఇవే..
Telangana Municipal Elections Results
Shaik Madar Saheb
|

Updated on: Feb 13, 2026 | 11:04 AM

Share

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ కూడా పలు మున్సిపాలిటీ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో గట్టి పోటీ ఇస్తోంది. పలు ప్రాంతాల్లో బీజేపీ కూడా ముందంజలో కొనసాగుతోంది..

అయితే.. మొదటి ఫలితం రానే వచ్చింది. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బోణి కొట్టింది. గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.. 14 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపొందగా.. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ ముందంజలో ఉన్నాయి..

నల్లగొండలో కాంగ్రెస్ హవా..

నందికొండ, హాలియా, చండూరు మునిసిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.

116 మున్సిపాలిటీలు – 2581 వార్డులు..

కాంగ్రెస్ – 145

బీఆర్ఎస్ -71

బీజేపీ – 17

ఇతరులు – 15

7 కార్పొరేషన్లు –  414 వార్డులు

కాంగ్రెస్ – 2

బీఆర్ఎస్ – 0

బీజేపీ – 0

ఇతరులు – 0

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026

తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్ 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు లైవ్ టీవీ