Tollywood: ఈ టాలీవుడ్ నటుడిని గుర్తు పట్టారా? 90కు పైగా రేప్ సీన్లతో హిస్టరీ క్రియేట్.. లేడీస్ దడ్చుకున్నారు

ఈ దివంగత నటుడు తన 50 ఏళ్ల సినిమా కెరీర్ లో 1200కు పైగా సినిమాల్లో నటించాడు. అందులో ఏకంగా 94 రేప్ సీన్లలో నటించి హిస్టరీ క్రియేట్ చేశాడు. కేవలం సినిమాల్లోనే కాదు బయట ఈ నటుడిని చూసినా మహిళలు దడ్చుకునేవారు.

Tollywood: ఈ టాలీవుడ్ నటుడిని గుర్తు పట్టారా? 90కు పైగా రేప్ సీన్లతో హిస్టరీ క్రియేట్.. లేడీస్ దడ్చుకున్నారు
Tollywood Actor

Updated on: May 08, 2025 | 11:14 AM

 

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయన టాలీవుడ్ ప్రముఖ నటుడు. ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ఆయన చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. స్నేహితులతో కలిసి వాటిని వివిధ వేదికల్లో ప్రదర్శించేవారు. దీంతో చదువు సరిగా ఒంటబట్టలేదు. బాగా హైట్ ఉండడంతో నాటకాల్లో ఎక్కువ కథానాయకుడి పాత్రలనే పోషించారు. వందలాది నాటకాల్లో నటించి మెప్పించిన ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత సహాయక నటుడిగా మెప్పించారు. ఆ తర్వాత కాల క్రమేణా ఆయన ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటించారు. మరీ ముఖ్యంగా రేప్ సీన్లలో. ప్పట్లో సినిమాల్లో రేప్ సీన్ ఉంటే ఈ నటుడినే పిలిచేవారట. అలా టాలీవుడ్‌లో 90వ దశకంలో ఎక్కువ రేప్‌ సీన్‌లలో నటించింది ఈ యాక్టరే. అ అలా ఆయన 90కు పైగా రేప్ సీన్లలో నటించి హిస్టరీ క్రియేట్ చేశారు. దీని ప్రభావంతో నిజ జీవితంలో ఆయనను చూసి ఆడవాళ్లు భయ పడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రేప్ సీన్లతో టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన ఆ నటుడు మరెవరో కాదు దివంగత చలపతి రావు. గురువారం (మే 08) ఆయన జయంతి. ఈ సందర్భంగా సినీ అభిమానులు, నెటిజన్లు చలపతిరావును స్మరించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

చలపతిరావు విలన్ గా భయపెట్టడమే కాదు హాస్యనటుడిగా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించారు. నాగార్జున నిన్నే పెళ్లాడతా, ఎన్టీఆర్ ఆది, బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి తదితర సినిమాల్లో చలపతి రావు పోషించిన పాత్రలు ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి.

Chalapathi Rao

తన 50 ఏళ్ల సినిమా కెరీర్ లో 1200కు పైగా సినిమాల్లో నటించారు చలపతి రావు. ఆయన 2022 డిసెంబర్ 25న ఈ లోకం విడచి వెళ్లిపోయారు. ప్రస్తుతం చలపతిరావు సినిమా వారసత్వాన్ని ఆయన కుమారుడు రవి బాబు కొనసాగిస్తున్నాడు. నటుడిగా, డైరెక్టర్ గా సత్తా చాటుతున్నాడు.

చలపతి రావు సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతోన్న రవి బాబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.