Actor Vivek Mashru: ‘సీఐడీ’ సిరీస్ వివేక్ ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్.. ఎలా మారిపోయారో చూశారా ?..

|

Jun 23, 2023 | 5:33 PM

ఇక ఇందులో నటించిన జోసెఫ్, అభిజిత్ పాత్రలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇక ఇందులో ఇన్స్పెక్టర్ వివేక్ సైతం ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ పాత్రలో నటించింది వివేక్ మశ్రూ. ఇప్పుడు ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చేస్తున్నారట. @Samosaholic అనే ట్విట్టర్ ఖాతాలో వివేక్ మష్రూ ఫోటోను చేస్తూ.. మీకు ఆయన తెలిస్తే మీ బాల్యం అద్భుతంగా ఉన్నట్లు అంటూ ట్వీట్ చేశారు.

Actor Vivek Mashru: సీఐడీ సిరీస్ వివేక్ ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్.. ఎలా మారిపోయారో చూశారా ?..
Cid Vivek
Follow us on

సీఐడీ.. ఒకప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను కట్టిపడేసిన సీరియల్. హిందీలో తెరకెక్కించిన ఈ సిరీస్‏లోకి తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. చిన్న పిల్లలే కాదు.. పెద్దవారు సైతం ఈ సిరీస్ కు ఒకప్పుడు అడిక్ట్ అయ్యారు. ఇక ఇందులో నటించిన జోసెఫ్, అభిజిత్ పాత్రలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇక ఇందులో ఇన్స్పెక్టర్ వివేక్ సైతం ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ పాత్రలో నటించింది వివేక్ మశ్రూ. ఇప్పుడు ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చేస్తున్నారట. @Samosaholic అనే ట్విట్టర్ ఖాతాలో వివేక్ మష్రూ ఫోటోను చేస్తూ.. మీకు ఆయన తెలిస్తే మీ బాల్యం అద్భుతంగా ఉన్నట్లు అంటూ ట్వీట్ చేశారు.

ఇక ట్వీట్ కు మష్రూ స్పందిస్తూ..నేను చేసిన చిన్న పాత్రకు మీరు నాపై చూపే ప్రేమ, దయ, ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు. ఇక ఆయన ట్వీట్ కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. వివేక్ మష్రూ ప్రస్తుతం ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటూ కామెంట్ చేయడం ఆశ్చర్యపరిచింది. బెంగుళూరులోని సీఎంఆర్ యూనివర్సిటీలో కామన్ కోర్ కరికులం విభాగానికి మష్రూ డైరెక్టర్ గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

2002లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన వివేక్ ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో వర్క్ చేశారట. ఇండస్ వ్యాలీ స్కూల్స్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కేవలం వివేక్ మాత్రమే కాదు.. డాక్టర్ తారిక పాత్రలో నటించిన నటి సైతం నటన వృత్తిలో లేరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.