Brahmamudi, September 3rd Episode: రుద్రాణికి అదిరిపోయే ఝలక్ ఇచ్చిన కావ్య.. పగపట్టేసిందిగా..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పోలీసులతో వెళ్లేందుకు రాజ్ సిద్ధమవుతాడు. రాజ్ వెళ్లేందుకు అపర్ణ ఒప్పుకోదు. ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు నేరం చేయలేదని అంటుంది. సారీ మేడమ్ ఏది ఉన్నా మీరు కోర్టులోనే చూసుకోమని పోలీస్ చెప్తాడు. సరే మా లీగల్ అడ్వైజర్‌ని పిలుస్తాం. ఆయనతో మాట్లాడమని సుభాష్ అంటే.. సారీ సార్ ఇది నాన్ బెయిలబుల్ కేసు. కాబట్టి కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని పోలీసు అంటాడు. సరే దీనికి నేనే బాధ్యుడిని..

Brahmamudi, September 3rd Episode: రుద్రాణికి అదిరిపోయే ఝలక్ ఇచ్చిన కావ్య.. పగపట్టేసిందిగా..
BrahmamudiImage Credit source: Disney Hot star
Follow us

|

Updated on: Sep 03, 2024 | 1:06 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పోలీసులతో వెళ్లేందుకు రాజ్ సిద్ధమవుతాడు. రాజ్ వెళ్లేందుకు అపర్ణ ఒప్పుకోదు. ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు నేరం చేయలేదని అంటుంది. సారీ మేడమ్ ఏది ఉన్నా మీరు కోర్టులోనే చూసుకోమని పోలీస్ చెప్తాడు. సరే మా లీగల్ అడ్వైజర్‌ని పిలుస్తాం. ఆయనతో మాట్లాడమని సుభాష్ అంటే.. సారీ సార్ ఇది నాన్ బెయిలబుల్ కేసు. కాబట్టి కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని పోలీసు అంటాడు. సరే దీనికి నేనే బాధ్యుడిని. నన్నే తీసుకెళ్లండి. నేను నేరం చేయలేదు. అది కోర్టులో రుజువు అవుతుందని రాజ్ అంటాడు. ఇక కావాలనే రుద్రాణి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఎస్‌ఐ గారు మీరు తొందర పడి ఒక నిర్దోషిని తీసుకెళ్తున్నారు. నాకు రాహుల్ మీదనే అనుమానంగా ఉందని స్వప్న అంటుంది. ఇక రాజ్ వెళ్తుంటే.. అప్పుడే కావ్య ఫైల్ పట్టుకుని వస్తుంది. నా భర్త ఈ నేరం చేయలేదు.. కంపెనీ పేరు మీద నకిలీ ఎగ్రిమెంట్.. ఆ దొంగ బంగారాన్ని ఎవరు తరలిస్తున్నారో.. ఈ ఫైల్ చూస్తే మీకే అర్థం అవుతుందని కావ్య అంటుంది.

రాహుల్‌కి ఒక్కటిచ్చిన అపర్ణ.. రుద్రాణికి వార్నింగ్..

ఇక ఫైల్‌ని పరిశీలించిన పోలీసు.. ఇందులో మీకు ఎలాంటి సంబంధం లేదని అంటాడు. ఈ ఫ్రాడ్ చేసింది రాహుల్ అని అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. చెప్పానా ఈ ఫ్రాడ్ మొత్తం చేసింది ఈ రాహులే అని అన్నాను కదా.. వీడిని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లమని స్వప్న అంటుంది. ఇదంతా మా అబ్బాయిని కావాలని ఇరికించే ప్రయత్నంగా ఉందని రుద్రాణి అంటుంది. ఇందులో అన్ని సాక్ష్యాలూ ఉన్నాయని పోలీస్ అంటాడు. నాకు ఏం సంబంధం లేదు.. ఏ తప్పూ చేయలేదు. కావాలనే ఈ కావ్య కుట్ర చేస్తుందని రాహుల్ అంటే.. అపర్ణ ఒక్కటి ఇస్తుంది. ఈ ఇంట్లో తింటూ.. ఈ ఇంట్లో బ్రతుకుతూ ఇంత దారుణం చేస్తావా? నేరం నువ్వు చేసిందే కాక.. నా కొడుకును అరెస్ట్ చేస్తుంటే మౌనంగా ఉంటావా.. నీ లాంటి వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదని అంటుంది. అమ్మా కొడుకులకు ఇద్దరికీ గట్టి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ.

కావ్య పనికి షాక్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ..

వెళ్లగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్‌కు పంపించమని సుభాష్ అంటాడు. ఎంత మోసం చేశావురా.. నా మనవళ్లతో పాటు నిన్ను కూడా పెంచి.. చదివించి.. అంత పెద్ద స్థానంలో నిలపెడితే ఇదా నువ్వు చూపించే విశ్వాసం అని పెద్దావిడ కూడా గడ్డి పెడుతుంది. ఇక రాహుల్‌ని జైలుకు తీసుకెళ్తారు పోలీసులు. దీంతో కావ్య వైపు పగతో చూస్తూ ఉంటుంది రుద్రాణి. స్వప్న దగ్గరకు వచ్చి సారీ అడుగుతుంది కావ్య. వెర్రిదానా నువ్వెం చేస్తావే.. అలాంటి వాడిని నమ్మి పెళ్లి చేసుకోవడం నా తప్పు అని స్వప్న అంటుంది. ఈ రోజు నువ్వు చేసింది మామూలు పని కాదు. నీ భర్తని కాపాడి.. ఈ వంశ ప్రతిష్టను కాపాడవని అపర్ణ అంటుంది. ఇక ఒకరి తర్వాత మరొకరు కావ్యని ప్రశంసిస్తారు. ఇదంతా ఎలా చేశావని రాజ్ అడిగితే.. రాహుల్ ఆఫీస్‌కి వెళ్లిన రోజే నేను శ్రుతిని గమనించమని చెప్పానని కావ్య అంటుంది.

ఇవి కూడా చదవండి

కళ్యాణ్ చేసిన సాంబార్ ఉప్మా.. పారిపోయిన బంటీ..

మరోవైపు.. బంటీ ఆకలి.. ఆకలి అంటూ అరుస్తాడు. ఏంట్రా ఆ అరుపులు కాస్త ఆగలేవా? అని అప్పూ అంటే.. ఏంటక్కా ఆగేది నేను పెద్దమ్మ వాళ్ల ఇంట్లో తింటాను అంటే.. కళ్యాణ్ ఆగు నేను టిఫిన్ చేస్తున్నా అన్నాడు. ఇప్పటికి రెండు గంటలు అయ్యింది. ఇంకా చేయలేదు. ఏంటి కూచి ఇంత సేపు అయ్యింది. ఇంకా కాలేదా? అని అప్పూ అడుగుతుంది. అయిపోయింది పొట్టి.. నువ్వు కూడా కూర్చో వచ్చేస్తున్నా అని కళ్యాణ్ టిఫిన్ తీసుకొస్తాడు. ఇక కళ్యాణ్ చేసే ఉప్మా చూసి బంటి షాక్ అవుతాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. ఇది తింటే మోషన్స్ పట్టుకుంటాయి.. ఈ రోజుకు ఏదో ఒకటి సర్దుకుంటాను కానీ.. నువ్వు బయటకు వెళ్లి తినేసి ఆఫీసుకు వెళ్లమని అప్పూ అంటుంది.

కావ్యతో రాజ్ గొడవ..

ఆ తర్వాత రాజ్ ఆలోచిస్తూ ఉండగా.. కావ్య కాఫీ తీసుకొస్తుంది. అక్కడ తగలయ్యమని రాజ్ అంటాడు. దీంతో కావ్య ఫైర్ అవుతుంది. తగల పెట్టడానికి రాహుల్ చేసి పని కాదు. నేను చేసిన కాఫీ అని కావ్య అంటుంది. మళ్లీ రాహుల్ గురించి ఎందుకు తీసుకొచ్చావ్. ఏ తప్పూ చేయని మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తుంటే.. చూస్తూ ఊరుకోవాలా అని కావ్య అంటే.. ఏదన్నా ఉంటే మాతో చెప్పాలని రాజ్ అంటాడు. అప్పుడు చెప్తే మీరేం చేశారు? కంపెనీకి వెళ్లి అతను తప్పు చేస్తే.. మీరు నన్ను అంటున్నారు ఏంటి? అని కావ్య నిలదీస్తుంది. కళ్యాణ్ వెళ్లిపోయేటప్పుడు ఆపి ఉంటే.. ఇదంతా జరిగేది కాదని రాజ్ అంటాడు. దీంతో టుపుక్కు జర జర డుబుక్క మే అనే కథ చెబుతుంది. అసలు కవి గారిని రమ్మనక పోవడానికి.. రాహుల్ అరెస్టుకు ఏమన్నా సంబంధం ఉందా? అని కావ్య అడుగుతుంది. కళ్యాణ్ పెళ్లి నుంచే కదా ఇదంతా మొదలైందని రాజ్ అంటాడు.

రుద్రాణి ఎమోషనల్ బ్లాక్ మెయిల్..

మీకు వంకరగా ఆలోచించడం అలవాటు అయిపోయింది. కంపెనీని చూసుకోవడం ఎవరూ లేరు కాబట్టి.. మీరు వెళ్లి మీ స్థానంలో కూర్చోండి. వెళ్లి తాతయ్య గారిని రిక్వెస్ట్ చేయమని కావ్య అంటుంది. పనికిమాలిన సలహాలు ఇవ్వకు అని రాజ్ అంటాడు. కంపెనీ పరువు పోకుండా ఉండటానికి రాహుల్‌ని అరెస్ట్ చేయించానని కావ్య అంటుంది. రాహుల్ లేకపోవడంతో ఒంటరిని అయిపోయాను. నాన్నని ఎమోషనల్ బ్లాక్ చేసి.. రాహుల్‌ని విడిపించాలని రుద్రాణి వస్తుంది. ఇక సీతా రామయ్య దగ్గరకు వెళ్లి.. రాహుల్‌ని విడిపించమని నటిస్తూ ఏడుస్తుంది రుద్రాణి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

బోరు నుంచి ఉబికి వస్తున్న నీళ్లు.. వీడియో చూడండి
బోరు నుంచి ఉబికి వస్తున్న నీళ్లు.. వీడియో చూడండి
విజయవాడ మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.! వీడియో.
విజయవాడ మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.! వీడియో.
రాజస్థాన్‌లో కుప్ప కూలిన మిగ్-29 యుద్ధ విమానం.. షాకింగ్‌ వీడియో
రాజస్థాన్‌లో కుప్ప కూలిన మిగ్-29 యుద్ధ విమానం.. షాకింగ్‌ వీడియో
హమ్మయ్యా.. ప్రకాశం బ్యారేజీ గేట్లు సేఫ్..
హమ్మయ్యా.. ప్రకాశం బ్యారేజీ గేట్లు సేఫ్..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్.!
ఒక్క పూట అయినా అన్నం దొరికితే బాగుండు.. సింగ్ నగర్ కన్నీటి వ్యధలు
ఒక్క పూట అయినా అన్నం దొరికితే బాగుండు.. సింగ్ నగర్ కన్నీటి వ్యధలు
వంటింట్లో వింతశబ్దాలు.. చూస్తే పాములు బాబోయ్‌.. పాములు.!
వంటింట్లో వింతశబ్దాలు.. చూస్తే పాములు బాబోయ్‌.. పాములు.!
గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న గ్యాస్‌ సిలిండర్‌ ధర.? పెట్రోల్‌
గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న గ్యాస్‌ సిలిండర్‌ ధర.? పెట్రోల్‌
ఆనందంగా డాన్స్‌ చేస్తూ అనంతలోకాలకు.! కుప్పకూలిన కానిస్టేబుల్‌..
ఆనందంగా డాన్స్‌ చేస్తూ అనంతలోకాలకు.! కుప్పకూలిన కానిస్టేబుల్‌..
30 నిమిషాల్లో 3 సార్లు ఫోన్‌..ఒక్కోసారి ఒక్కోలా.! కోల్‌కతా కేసు..
30 నిమిషాల్లో 3 సార్లు ఫోన్‌..ఒక్కోసారి ఒక్కోలా.! కోల్‌కతా కేసు..