ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కనకం వాళ్ల ఇంటి నుంచి తిరిగి ఇంటికి వస్తాడు రాజ్. రండి మీ కోసమే మీ రుద్రాణి అత్త, మీ పిన్ని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇంటి ఆస్తి తన్నుకు పోవడానికి ఆ ఇంట్లో ఏం కుట్ర జరుగుతుందో.. ఆ ఇంటి పిల్లను ఈ ఇంటి కోడల్ని చేయడానికి ఎన్ని పథకాలు చేస్తున్నారో.. మీరు పూర్తిగా తెలుసుకునే వచ్చారు కదా.. అని కావ్య అంటే.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? అని ధాన్య లక్ష్మి అంటే.. నేను కరెక్టే మాట్లాడుతున్నాను అని కావ్య అంటుంది. ఏరా ఏం జరిగిందని అపర్ణ అంటే.. ఇంకా తెలీడం లేదా? వాడి మరదలే కదా అప్పూ.. పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తే.. త్రివేణీ సంగమంలా మారి ఈ సముద్రంలో కలిసి పోవచ్చు కదా.. ఏం జరిగిందో చెప్పు రాజ్ అని రుద్రాణి దెప్పి పొడుస్తుంది. మీరు ముందు చెప్పండి.. అక్కడ ఏం జరిగింది? మీ పిన్ని, ఈ రుద్రాణి గారు నా మీద పెద్ద యుద్ధమే ప్రకటించారు. వాళ్లకు సమాధానం కావాలి. కవి గారెని పెళ్లి చేసుకోవడానికి మా అప్పూ ఒప్పుకుందా? అని కావ్య అడిగితే.. లేదని రాజ్ అంటాడు.
అప్పూకి కళ్యాణ్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడొద్దని మా అత్తగారు చెప్పారు. ఆ కుటుంబంలో ఎవరికీ కళ్యాణ్‌కి అప్పూని ఇచ్చి చేయాలని లేదని రాజ్ అంటాడు. మీ కడుపు మంట చల్లారిందా? కావాలనే మీరు రెచ్చగొట్టి వదులుతారు. అలాగే అనామిక కాపురం కాల్చుకునేలా చేశారు. కోడాలి పని అయిపోయింది. ఇప్పుడు అత్త మీద పడ్డారని కావ్య అంటుంది. ఆ తర్వాత ధాన్య లక్ష్మికి గడ్డి పెడతారు అపర్ణ, పెద్దావిడ. నాన్నమ్మా.. ఈ విషయం పక్కన పెడితే.. జరిగే దానిలో కావ్యకి కానీ, వాళ్ల కుటుంబం కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని గుర్తుకు చేస్తూ.. నా భార్యని, ఆమె కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడితే.. ఇకపై ఊరుకునేది లేదు. ఎవరు క్షమాభిక్ష పెట్టమని అడిగినా.. పట్టించుకోనని రాజ్ అంటాడు. ఇక ధాన్య లక్ష్మి, రుద్రాణి ఇద్దరూ కలిసి పైకి వెళ్లిపోతారు.
ఈ సీన్ కట్ చేస్తే.. బంటీ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంట్రా ఏమైందని అడుగుతుంది అప్పూ. కళ్యాణ్‌కి యాక్సిడెంట్ అయ్యిందంట.. రక్తం చాలా పోయిందట.. ఆస్పత్రికి తీసుకెళ్లారంట.. ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ బంటీ చెప్తాడు. దీంతో అప్పూ షాక్ అవుతుంది. అప్పూ కంగారుగా వెళ్తుంటే.. ఎక్కడికి అని కృష్టమూర్తి అడుగుతాడు. కళ్యాణ్‌కి యాక్సిడెంట్ జరిగిందట.. సీరియస్‌గా ఉందంట నేను వెళ్లి వస్తాను అని చెప్తుంది. ఏమీ చెప్పకుండా కృష్ణమూర్తి ఆలోచిస్తాడు. ఇప్పుడున్న పరిస్థితులు వేరని కృష్ణమూర్తి అంటాడు. లేదు నాన్నా.. ఒక్కసారి దూరం నుంచి చూసి వస్తాను అని అప్పూ చెప్పి వెళ్తుంది. అది చూసిన కనకం.. ఎక్కడికి? అని అడుగుతుంది. ఎవరో ఫ్రెండ్‌కి ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట. వచ్చేస్తుందిలే అని కృష్ణమూర్తి కోపంగా చెప్తాడు.
అప్పూ పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి వస్తుంది. అక్కడే ఉన్న రాజ్.. ఆగు ఎందుకు వచ్చావ్? ఎవరి కోసం వచ్చావ్? అని అడుగుతాడు. కవికి యాక్సిడెంట్ అయ్యిందంట కదా.. చూడటానికి వచ్చాను. చూసి వెళ్తాను అని అంటుంది అప్పూ. నా తమ్ముడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాడిని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదని అంటాడు రాజ్. లేదు బావా ఒక్కసారి చూసి వెళ్లిపోతాను అని అప్పూ అంటుంది. నీకెం దుకు? నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటున్నావ్? కదా.. నీకెందుకు వెళ్లి నీ పెళ్లి సంగతి చూసుకో. మీ ఇంటికి వస్తే మీ అమ్మ ఏం మాట్లాడింది? నువ్వు ఏం మాట్లాడావ్. నన్ను వెళ్లిపొమ్మని మీ అమ్మ నా కాళ్లు కూడా పట్టుకోబోయింది కదా. నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ.. పరాయి వ్యక్తిని చూడాలి అనుకోవడం కరెక్ట్ కాదని రాజ్ అంటాడు. నేను వాడిని చూసే వెళ్తానని అప్పూ అంటే.. నువ్వు వాడిని చూడటానికి వీల్లేదు. నీ మనసులో వాడు లేనప్పుడు.. నువ్వు వాడిని చూడటానికి వీల్లేదని రాజ్ అంటాడు. కళ్యాణ్ అక్కడే ఉండి అంతా వెంటాడు.
ఆ మాటలకు అప్పూ.. కవి నా మనసులోనే ఉన్నాడు.. అప్పుడూ ఇప్పుడూ నా మనసులోనే ఉన్నాడని చెబుతుంది. వాడు నా ప్రాణం కంటే ఎక్కువ. చచ్చేదాకా వాడు నా మనసులో నుంచి పోడు అని చెబుతుంది అప్పూ. అప్పూ మాటలకు కళ్యాణ్ సంతోషంగా ఉంటాడు. సరే బావా వాడిని ఒక్కసారి చూడనీ అని అప్పూ అంటే.. అవసరం లేదు. వాడికి అసలు యాక్సిడెంట్ అనేదే జరగలేదని రాజ్ చెప్తాడు. నిజమా బావా.. అని అప్పూ ఎంతో సంతోష పడుతుంది. ఇంత ప్రేమ ఉన్నా.. మరో పెళ్లి చేసుకోవాడిని ఎందుకు సిద్ధ పడ్డావని రాజ్ అంటే.. ప్రేమించిన వాళ్లందరికీ పెళ్లి చేసుకునే అవకాశం రాదు. నా వల్ల వాడు కూడా ఇబ్బంది పడ్డాడు. నా బతుకు బజారున పడింది. ఇంత జరిగిన తర్వాత మీ వాడిని నేను పెళ్లి చేసుకుంటే.. మీ ఇంట్లో వాళ్లు నన్ను బతకనివ్వరు. నా అక్కలకు కూడా మనశ్శాంతి ఉండనివ్వరు. ఇప్పుడు నిజం చెప్పాను అని నా పెళ్లిని చెడగొట్టొద్దు బావా.. అని అప్పూ అని వెళ్లిపోతుంది.
అప్పూ వెళ్లి పోగానే కళ్యాణ్ బయటకు వస్తాడు. చూశావు కదా అప్పూ మనసులో మాట బయట పడింది. నీపై ఇంత ప్రేమ ఉందని తెలిసి కూడా ఏం చేస్తున్నావ్ రా.. నీకు కావాల్సింది చేయి.. నీ వెనుక నేను ఉన్నానని రాజ్ అంటాడు. కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. మరోవైపు కళ్యాణ్‌ని తీసుకుని రాజ్ బయటకు ఎందుకు వెళ్లాడు? అని ధాన్య లక్ష్మి కళావతిని నిలదీస్తుంది. అప్పుడే రాజ్, కళ్యాణ్‌లు ఇంటికి వస్తారు. రండి.. మీరు ఎక్కడికి వెళ్లారు? మీ పిన్ని నన్ను నిలదీస్తుందని చెబుతుంది కావ్య. చెప్పురా.. నువ్వు ఆ అప్పూని కలవడానికే వెళ్లావు కదా అని ధాన్య లక్ష్మి అంటే.. నేను చెబుతాను అని కనకం పెళ్లి కార్డులు పట్టుకుని వస్తుంది.
ఎవరూ ఎవర్నీ కలవడానికి రాలేదు. కళ్యాణ్ అప్పూని కలవడానికి మా ఇంటికి రాలేదని కనకం చెబుతుంది. క్షమించండి అమ్మా.. పెద్దలు మీరు ఉండగా.. ఈవిడకు కార్డు ఇవ్వక తప్పడం లేదు. ధాన్య లక్ష్మికి పెళ్లి కార్డు ఇస్తూ.. నా కూతురు అపూర్వ.. అప్పూ పెళ్లి. చిరంజీవి శ్రీరామ్‌తో.. ముహూర్తం ఎప్పుడు అనేది పెళ్లి పత్రికలో రాసి ఉంది. మాకు మీ అంత ఆస్తి లేదు కాబట్టి.. నిరాడంబరంగా గుడిలో చేస్తున్నాం. మీరందరూ ఈ పెళ్లికి వచ్చి.. ఎలాంటి నిందలు వేయకుండా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా అని చెబుతుంది కనకం. ధాన్య లక్ష్మి ఏమీ మాట్లాడకుండా నిలబడి చూస్తుంది. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.