AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Mehaboob: చిక్కుల్లో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలు ఏమైందంటే?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో మెహ బూబ్ దిల్ సే ఒకడు. అంతకు ముందు పలు మ్యూజిక్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాక మరింత పాపులర్ అయ్యాడు. విజేతగా నిలవకున్నా తన ఆట తీరు, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు

Bigg Boss Mehaboob: చిక్కుల్లో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలు ఏమైందంటే?
Bigg Boss Mehaboob
Basha Shek
|

Updated on: Jul 31, 2024 | 7:23 PM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో మెహ బూబ్ దిల్ సే ఒకడు. అంతకు ముందు పలు మ్యూజిక్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాక మరింత పాపులర్ అయ్యాడు. విజేతగా నిలవకున్నా తన ఆట తీరు, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు. హౌజ్ నుంచి బయటకు వచ్చాక నటుడిగా కూడా మారాడు. పలు టీవీ షోలు, డ్యాన్స్ రియాల్టీ షోల్లోనూ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదిలా ఉంటే సోమవారం (జులై29) మెహబూబ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అనాథ ఆశ్రమంలో కేక్‌ కట్‌ చేశాడీ సోషల్ మీడియా సెన్సేషన్. అంతేకాదు అక్కడున్న పిల్లలందరికీ ఒక పూట మంచి భోజనం అందించి గొప్ప మనసును చాటుకున్నాడు. వారందరితో సరదాగ గడిపి ఫోటోలు కూడా దిగాడు. ఇక్కడి వరకు బాగానే ఉందీ కానీ.. తన పుట్టిన రోజు సంద్భంగా తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు మెహబూబ్. ఇప్పుడు ఇదే అతనిని చిక్కుల్లో పడేసింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన మెహబూబ్ బర్త్ డే పార్టీలో పలువురు సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులు హాజరయ్యారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు.. దీంతో మెహబూబ్‌తో పాటు రిసార్ట్‌ యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలతో పాటు చాలా మంది యువతీ యువకులు పాల్గొన్నారు. అయితే రిసార్ట్‌లలోకి అనుమతి లేకుండా మద్యం తెచ్చుకుని సేవించడం నేరం అని ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మెహ బూబ్ బర్త్ డే పార్టీలో 11 లీటర్ల మద్యంతో పాటు 7 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. అయితే ఈ పార్టీలో కొందరు మాత్రమే మద్యం సేవించారని పోలీసులు తెలిపారు. అలాగే వారి వద్ద ఎలాంటి డ్రగ్స్ పదార్థాలు లేవని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మెహబూబ్ ఇచ్చింది రేవ్ పార్టీ అని సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ అంశం గురించి మెహబూబ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ బర్త్‌ డే పార్టీలో శ్వేతా నాయుడు, గీతు రాయల్, శ్రీ సత్య, విరూపాక్ష సేం రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అనాథాశ్రమంలో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!