ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ప్రకాశానికి సుభాష్ సర్ది చెబుతూ ఉంటాడు. వాళ్లు తప్పుగా నిర్ణయాలు తీసుకోరనే నమ్మకం ఉంది. అందుకే కదా నాన్న గారు వాళ్లిద్దరికీ బాధ్యతలు అప్పగించారని సుభాష్ అంటే.. నాన్న గారి నమ్మకాన్ని నిలబెట్టడంలో తప్పు లేదు అన్నయ్యా.. కానీ ఇంట్లో వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం మాత్రం తప్పే అన్నయ్యా. ఈ రోజు కావ్య చేసిన పని వల్ల నా భార్య నా మాట వింటుందా? నా కొడుక్కి అన్యాయం చేస్తున్నారని నిలదీస్తే.. నేను ఏం సమాధానం చెప్పగలను అంటూ ప్రకాశం అడుగుతాడు. నేనేంటో నీకు బాగా తెలుసు. కావ్య ఎందుకు ఇలా చేస్తుందో నేను తెలుసుకుంటాను. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. నాకు కొంచెం టైమ్ ఇవ్వమని సుభాష్ అంటే.. కాలం గడిచే కొద్దీ ఈ గొడవలు మరింత పెరుగుతాయి. మనుషుల మధ్య కూడా పెరుగుతుంది.. ఒక్కసారి నువ్వే ఆలోచించు అన్నయ్యా అంటూ బాధ పడుతూ వెళ్తాడు ప్రకాశం.
ఇక ప్రకాశం ఇంట్లోకి వెళ్తుంగా కావ్య ఎదురు పడుతుంది. నన్ను క్షమించండి. నలుగురిలో నేను అలా మాట్లాడటం తప్పే. ఏదో ఆఫీస్ టెన్షన్‌లో అలా మాట్లాడాను. మనస్ఫూర్తిగా అడుగుతున్న నన్ను క్షమించండి మావయ్య గారు అంటూ కావ్య అడిగితే.. నిన్ను క్షమించడానికి నేను ఎవర్ని? అని ప్రకాశం అంటాడు. నన్ను అర్థం చేసుకోండి.. నిజంగానే మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశామని కావ్య అంటే.. అందుకని అవసరం లేదని మొహం మీదనే చెప్పేస్తావా.. అని ప్రకాశం అడుగుతాడు. అలా చెప్పడం నా ఉద్దేశం కాదని కావ్య అంటే.. పెద్దా చిన్నా లేకుండా నన్ను నలుగురిలో అవమానించి.. ఇప్పుడు సారీ ఎలా అడుగుతున్నావ్ కావ్యా అని ప్రకాశం అంటాడు. మనం తీసుకున్న కాంట్రాక్ట్ విషయంలో ఎక్కువ ఖర్చు అవడం వల్ల ఆ గోల్డ్ వద్దని అన్నాను అంతే అని కావ్య అంటే.. అన్నీ మనకు అనుకున్నట్టుగా జరగవు కావ్యా.. ఒక్కసారి నమ్మకం కోల్పోతే.. మళ్లీ అస్సలు నమ్మరు. ఖచ్చితంగా కొంటారు కదా అని అడిగారు. కానీ మీరు నా మాట కాదరన్న నమ్మకంతో ఆయనకు మాట ఇచ్చాను. కానీ నువ్వు నా మాటని గాలి మాటతో తీసి పారేశాను. నలుగురిలో దారుణంగా అవమానించావని ప్రకాశం అంటాడు.
కావ్య సారీ చెప్పినా.. ప్రకాశం దణ్ణం పెట్టి వెళ్లిపోమ్మని అంటాడు. ప్రకాశం వెళ్లిపోయాక.. సూపర్.. నీ తెలివి తేటలు వేరే లెవల్. అందర్నీ చెప్పుతో కొట్టినట్టు మాట్లాడి.. ఇప్పుడు గాయానికి వెన్న పూస్తున్నావా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకు అత్తయ్యా ఇలా మారిపోతున్నారు.. ఇప్పుడు నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నారు? ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలే అని కబుర్లు చెప్పి.. ఇప్పుడు ఆస్తులు రాగానే నీ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నావు. నాకూ నా మొగుడికి విలువ లేకుండా చేసిన నిన్ను శత్రువులా కాకుండా ఇంకెలా చూడమంటావు? అని ధాన్యలక్ష్మి తిట్టి వెళ్లిపోతుంది. ఇదంతా రాజ్ పై నుంచి చూస్తాడు. దీంతో కావ్య గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను తీసుకున్న నిర్ణయాల వల్ల అందరూ బాధ పడుతున్నారంటూ బాధ పడుతుంది. అసలు ఇదంతా మొదలు పెట్టింది ఎవరు? అందుకే తాతయ్య మాట ఇచ్చిన విషయం చెప్పేద్దామని రాజ్ అంటే.. వద్దు. తాతయ్య, అమ్మగార్ల కోసం నేను ఎన్ని మాటలు భరించడానికి సిద్ధంగా ఉన్నానని కావ్య అంటుంది.
మరోవైపు ఇంట్లో జరిగిన దానికి రుద్రాణి, రాహుల్ ఎంతో సంతోష పడతారు. కావ్య, రాజ్‌లను మరింత అవమానించడానికి మరో ప్లాన్ వేస్తారు. ఇప్పుడు మరి ఏం ప్లాన్ వేస్తున్నావు. ఇంట్లో తినడానికే డబ్బు లేదు అంటే ఫంక్షన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని రాహుల్ అడిగితే.. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. రేపు జరగబోయే నాటకం చూడు.. అప్పుడు నీ మమ్మీ ఏంటో నీకు అర్థం అవుతుందని రుద్రాణి అంటుంది. ఇక తెల్లవారుతుంది. అందరూ హాలులో కూర్చొని ఉంటారు. పనిమనిషి వచ్చి రుద్రాణిని ఏం టిఫిన్ చేయాలని అడుగుతుంది. దీంతో రుద్రాణి, ఇంట్లో వాళ్లు షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే.. నేను రుద్రాణిని. ఇంట్లో పడి తినేదాన్ని.. నన్ను అడుగుతావేంటి? శ్రీమతి కావ్య దేవి గారిని అడుగు అని చెబుతుంది. కావ్య మేడమ్ మిమ్మల్నే అడగమన్నారు. ఇవాళ్టి నుంచి ఎవరెవరికి ఏం కావాలో అన్నీ చేయమని కావ్య మేడమే చెప్పారని పనిమనిషి అంటే.. ఇంట్లో వాళ్లు ఆశ్చర్య పడతారు.
ఎందుకు ఇలాంటి మార్పు? అని రుద్రాణి అడుగుతుంది. అప్పుడే కావ్య వచ్చి.. ఎందుకు అంత వెటకారంగా మాట్లాడుతున్నారు? నేను తీసుకున్న నిర్ణయాల వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని నా భర్త నాకు గడ్డి పెట్టారు. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని కావ్య అంటే.. అప్పుడే పంతులు గారు ఇంటికి వస్తాడు. పంతుల్ని ఇప్పుడు ఎందుకు? పిలిచారని ఇందిరా దేవి అడుగుతుంది. నేనే.. వేరే పెళ్లి చేసుకుందామని రుద్రాణి అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. లేకపోతే ఏంటి? నా కోడలి స్వప్న సీమంతం కోసమని రుద్రాణి అంటుంది. అది విని స్వప్న షాక్ అవుతుంది. మీరు అన్నది నిజమేనా? మీరు ఇంత బాధ్యత ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? కోడల్ని మనిషిగానే చూడరు. కానీ కోడలికి సీమంతం జరిపించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందని? స్వప్న అంటుంది. రుద్రాణి నువ్వు బాగానే ఉన్నావా? నీ ఒంట్లో బాగానే ఉందా? అని ప్రకాశం వెటకారంగా అడుగుతాడు. నా కోడలు అంటే నాకు ఇష్టం లేదు. కానీ నేను అత్తగా సీమంతం జరిపించాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె కడుపులో నా వారసుడు పెరుగుతున్నాడు కాబట్టి అని రుద్రాణి అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిపోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..