Brahmamudi, February 15th episode: కావ్యకోసం ఇందిరాదేవి మాస్టర్ ప్లాన్.. అత్తకి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన స్వప్న!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌తో విడిపోవాలి అని కావ్య అనుకుంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన పెద్దావిడ..కావ్యకు నచ్చ చెప్పాలి అనుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ స్నేహితురాలి కథ అని చెబుతున్నప్పుడే.. ఆ కథ నీదని నాకు అర్థమైంది. అందుకే నేను నీ సమస్యకు సూచించాను. ఎంత మంది దంపతులు సుఖంగా ఉన్నారు? ఎంత మంది సంతోషంగా ఉన్నారు? ఇంటింటి కిటికీ తీస్తే.. సర్దుకుపోయే వారు కొందరు.. పోట్లాడుకునే వారు కొందరు. కానీ వాళ్లంతా తప్పుకోవాలి..

Brahmamudi, February 15th episode: కావ్యకోసం ఇందిరాదేవి మాస్టర్ ప్లాన్.. అత్తకి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన స్వప్న!
Brahmamudi

Updated on: Feb 15, 2024 | 11:57 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌తో విడిపోవాలి అని కావ్య అనుకుంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన పెద్దావిడ..కావ్యకు నచ్చ చెప్పాలి అనుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ స్నేహితురాలి కథ అని చెబుతున్నప్పుడే.. ఆ కథ నీదని నాకు అర్థమైంది. అందుకే నేను నీ సమస్యకు సూచించాను. ఎంత మంది దంపతులు సుఖంగా ఉన్నారు? ఎంత మంది సంతోషంగా ఉన్నారు? ఇంటింటి కిటికీ తీస్తే.. సర్దుకుపోయే వారు కొందరు.. పోట్లాడుకునే వారు కొందరు. కానీ వాళ్లంతా తప్పుకోవాలి అనుకోవడం లేదు కదా అని ఇందిరా దేవి అంటుంది. మీకు తెలీడం లేదు అమ్మమ్మగారూ ఆయనకు నేను అవసరం లేదు. నా మీద ప్రేమ లేదు. ఆయన నాతో కలిసి ఉంటానని ఏనాడూ అనుకోలేదని కావ్య అంటుంది.

అసలు నా మీద ప్రేమే లేదు అమ్మమ్మ.. కుమిలిపోతున్న కావ్య..

ఇలా కూడా కలిసి ఉండే భార్య భర్తలు చాలా మంది ఉన్నారని అంటున్నాను. అలాగని నీ మనసు చంపుకుని, నీ ఉనికిని, అస్థిత్వాన్ని చంపుకుని బానిసలాగా పడుండమని చెప్పడం నా ఉద్దేశం కాదని నేను చెప్పడం లేదని పెద్దావిడ అంటుంది. ఇది కూడా కలిసి ఉండటమేనా అమ్మమ్మ అని కావ్య అంటుంది. ఎప్పుడైనా నీ మీద చేయి చేసుకున్నాడా.. నీకు అవమానం జరిగితే ఇంట్లో వాళ్లను మందలించలేదా.. నీ పుట్టింటికి కష్టం వస్తే ఆదుకోలేదా.. అంటే ఇంకా వాడిలో మంచితనం ఉందని అర్థం కదా అని ఇందిరా దేవి అంటుంది. మంచితనం వేరు.. ప్రేమ వేరు అమ్మమ్మ.. అసలు నా మీద ప్రేమే లేదని కావ్య అంటుంది.

నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నారు..

ఎందుకు లేదు.. నువ్వు ఇక్కడికి వంటరిగా వచ్చావా.. నీ దారిన నిన్ను వదిలేసే వాడైతే.. వాడి దారిన వాడే వెళ్లిపోయేవాడు కదా.. మాట కటువు అయినంత మాత్రాన.. మనసు కఠినంగా ఉండాలని నియమం లేదమ్మా. వాడు నీ కోసం భోజనం కలిపి తీసుకు రావడం నేను చూశాను. నువ్వు తినకుండా ఉన్నావని.. తినే అన్నం వదిలేసి నీ దగ్గరకు వచ్చాడని పెద్దావిడ అంటుంది. ఆయన దేవుడే అమ్మమ్మ.. కానీ నాకు ఎందుకు ఈ శాపం ఇచ్చారు. నన్ను వదిలించుకోవడానికి దారి లేక.. ఇంకో అమ్మాయిని అడ్డం పెట్టుకున్నారని కావ్య అంటుంది. కానీ ఆ అమ్మాయితో ఎలాంటి తప్పుడు సంబంధం పెట్టుకోలేదు కదా.. పరాయి స్త్రీని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాడని పెద్దావిడ అంటుంది.

ఇవి కూడా చదవండి

నువ్వు లేకపోతే.. వాడు పిచ్చివాడు అయిపోతాడు: ఇందిరా దేవి

కానీ నేను ఎందుకు వద్దు? అందం లేదా.. చదువు లేదా.. ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలీదా.. ఏం తప్పు చేశాను? దుగ్గిరాల కోడలిగా ఉండటం తప్పా.. అందుకే తప్పుకుందాం అనుకుంటున్నా. నన్ను దూరం చేసుకుని మనశ్శాంతిగా ఉంటారేమో అని కావ్య అంటుంది. ఉండలేడు.. నువ్వు బాధ పడితేనే.. ఆకలితో ఉంటేనే భరించలేని వాడు.. నువ్వు దూరం అయితే మనశ్శాంతిగా ఉండడు.. పిచ్చివాడు అయిపోతాడు నువ్వు లేకపోతే.. వాడు అదిగుర్తించడం లేదని పెద్దావిడ చెప్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పమని కృష్ణ మూర్తి అడుగుతాడు.

ముల్లుని ముల్లుతోనే తీయాలి: ఇందిరా దేవి

వాడి మనసులో బలవంతంగా నొక్కి పెట్టిన ప్రేమను బయటకు తీసుకొచ్చేంత వరకూ సహనంతో ఉండాలి. నీ మీద వాడికి ప్రేమ ఉంది. కానీ ఇగో అడ్డం వస్తుంది. అది వెలికి తీయాలి అని పెద్దావిడ చెప్తుంది. కానీ అదెలాగో నాకు అర్థం కావడం లేదని కావ్య అంటుంది. ముల్లును ముల్లుతోనే తీయాలి. వాడు ఓ అమ్మాయిని అడ్డం పెట్టుకుని నిన్ను వదులుకోవాలి అనుకున్నట్టే.. నువ్వు కూడా ఓ అబ్బాయిని అడ్డం పెట్టుకుని దూరమైపోతున్నట్టు నటించాలి అని చెప్తుంది పెద్దావిడ. అది విన్న అప్పు, కృష్ణ మూర్తి, కనకంలు షాక్ అవుతారు. పెద్దావిడ ప్లాన్‌కి కృష్ణమూర్తి సరే అంటాడు.

శీలంపై మచ్చ పడుతుంది: కనకం

ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. అబ్బాయి కాబట్టి అమ్మాయితో తిరిగినా చెల్లుబాటు అవుతుంది. కానీ మన అమ్మాయికి ఇలాంటిది ఎలా కుదురుతుంది? అనవసరంగా అపార్థాలు, అనుమానాలు పెరుగుతాయి. అప్పుడు దాని శీలంపైనే మచ్చ పడుతుంది. అప్పుడు దాని జీవితం నాశనం అవుతుంది అని కనకం అంటుంది. మన పిల్ల తప్పు చేయనంత వరకూ ఈ మార్గంలో వెళ్లడమే మంచిదని అనిపిస్తుందని పెద్దావిడ అంటుంది. కానీ కావ్య ఒప్పుకోదు. దీంతో పాటు, సాధువు కథ చెప్పి.. ఇందిరా దేవి ఒప్పిస్తుంది. ఆయన ప్రేమ కోసం ఏం చేయడానికైనా నేను రెడీ అని కావ్య అంటుంది. కానీ అలా నటించడానికి ఓ అబ్బాయి కావాలి కదా అని కనకం అంటే.. మా చెల్లెల్లి అబ్బాయి ఉన్నాడు కదా.. వాడిని రేపే వస్తున్నాడు. వాడిని అడుగుదాం అని కృష్ణ మూర్తి అంటాడు. ఇలా మొత్తానికి అందరూ కలిసి.. రాజ్ కోసం పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తారు.

కావ్యపై విరుచుకు పడ్డ ధాన్య లక్ష్మి, రుద్రాణి:

ఇక కావ్య, పెద్దావిడ కలిసి దుగ్గిరాల ఇంటికి వెళ్తారు. అప్పటికే కావ్య కోసం ఇంట్లోని వాళ్లందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కావ్య ఇంటికి రాగానే.. ధాన్య లక్ష్మి, రుద్రాణిలు విరుచుకు పడతారు. ఏంటీ రాగానే ఈ పనికిమాలిన పంచాయతీ.. మీ కోడలు పెట్టిన గడ్డి సరిపోవడం లేదా.. అని కావ్య ఫైర్ అవుతుంది. షటప్ అంటుంది రుద్రాణి. అది నువ్వు చేస్తే బాగుంటుంది. అసలు ఏం జరిగిందని కావ్య రాగానే విరుచుకు పడుతున్నారు అని ఇందిరా దేవి అడుగుతుంది. ఉదయం అక్క కావ్యకు లాకర్ తాళాలు ఇచ్చిందా.. అందులో నుంచి రెండు లక్షలు కావ్య తీసుకుని వెళ్లింది. వచ్చేటప్పుడు వెళ్లి వాళ్ల పుట్టింటికి ఇచ్చి వచ్చిందని ధాన్య లక్ష్మి అంటుంది. కావాలంటే వదినను అడుగు అని రుద్రాణి అంటుంది.

కావ్యకు సపోర్ట్‌గా అత్త అపర్ణ..

ఏంటి అపర్ణా నిజమా అని ఇందిరా దేవి అడుగుతుంది. వాళ్ల పుట్టింటి సంగతి నాకు తెలీదు.. లాకర్‌లో రెండు లక్షలు కనిపించడం లేదని అపర్ణ అంటే.. అత్తయ్య గారూ మీరు కూడా నన్ను అని కావ్య అడగబోతుండగా.. నేను అంత గడ్డి తినడం లేదు. అయినా నీకు అవసరం ఉంటే నన్ను అడగొచ్చుగా.. ఇలా అందరి చేత మాటలు పడటం అవసరమా అని అపర్ణ అంటుంది. అసలు కావ్య చెప్పేది ఎవరూ వినిపించుకోరు. అప్పుడే ఆపండి అని స్పప్న ఎంట్రీ ఇస్తుంది. ఏంటే పిచ్చిదానా.. నువ్వు ఇలా అణిగి మణిగి ఉంటే అందరూ నిన్నే అంటారే. జరిగింది ఏంటో చెప్తే అందరి నోళ్లూ మూత పడతాయి కదా అని స్వప్న అంటుంది.

అనామికకు, రుద్రాణి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన స్వప్న..

అసలు మాట్లాడే ఛాన్స్ ఎవరు ఇస్తున్నారు అమ్మా.. రాగానే వంతుల వారీగా మీద పడిపోతున్నారు. నీకు తెలిస్తే చెప్పు అమ్మా అని సుభాష్ అంటాడు. అసలు కావ్యని దొంగ అని ఎవరు అన్నారు అని స్వప్న అడిగితే.. నేను కాదు ధాన్య లక్ష్మి అని రుద్రాణి చెప్తుంది. అవును నేనే అన్నాను అని ధాన్యం అంటే.. కావ్య గురించి తెలిసి అంత పెద్ద నింద ఎలా వేస్తారు అని ధాన్యలక్ష్మికి లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇస్తుంది స్వప్న. కావ్యే నాకు డబ్బు ఇచ్చిందని స్వప్న ట్విస్ట్ ఇస్తుంది. అది విన్న అందరూ షాక్ అవుతారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.