Brahmamudi, April 18th episode: కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పార్టీ తర్వాత కావ్య, రాజ్‌లు ఇద్దరూ కలిసి కారులో ఇంటికి వస్తూ ఉంటారు. చాలా బాగా ప్లాన్ చేసి.. వెన్నెల ఎవరో తెలుసుకోవడానికి పాపం బాగా కష్ట పడ్డావ్ కదా అని రాజ్ కోపంగా అంటాడు. నేనేం ప్లాన్ చేశాను అని కావ్య అంటుది. ఏమీ తెలియనట్టు నటించకు.. మా మధ్యనే తిరుగుతూ వెన్నెల వస్తే అసలు నిజం రాబడదామని ట్రై చేశావని నాకు తెలుసు. నువ్వూ, శ్వేత మాట్లాడుకోవడం నేను విన్నాను అని రాజ్ అంటాడు. దీంతో కావ్య రివర్స్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పార్టీ తర్వాత కావ్య, రాజ్‌లు ఇద్దరూ కలిసి కారులో ఇంటికి వస్తూ ఉంటారు. చాలా బాగా ప్లాన్ చేసి.. వెన్నెల ఎవరో తెలుసుకోవడానికి పాపం బాగా కష్ట పడ్డావ్ కదా అని రాజ్ కోపంగా అంటాడు. నేనేం ప్లాన్ చేశాను అని కావ్య అంటుది. ఏమీ తెలియనట్టు నటించకు.. మా మధ్యనే తిరుగుతూ వెన్నెల వస్తే అసలు నిజం రాబడదామని ట్రై చేశావని నాకు తెలుసు. నువ్వూ, శ్వేత మాట్లాడుకోవడం నేను విన్నాను అని రాజ్ అంటాడు. దీంతో కావ్య రివర్స్ అవుతుంది. అవును ఇప్పుడేంటి? వెన్నెల కోసమే ఈ పార్టీ అరేంజ్ చేశాం. అసలు నా కంటే గొప్పగా, తెలివిగా మీరేం ప్లాన్ చేయలేదా? చనిపోయిన వెన్నెల పేరు చెప్పి బతికి రాదని, నాకు దొరకదనే కదా వెన్నెల పేరు చెప్పారు. ఇప్పటికైనా ఆ నిజం చెప్పండి. ఇప్పుడు ఈ కథ మళ్లీ మొదటికే చేరిందని అని కావ్య అంటుంది. నేను చెప్పను.. నువ్వు ఎన్ని సార్లు అడిగినా.. వాడు నా బిడ్డే.. ఈ ఇంటి వారసుడే అని రాజ్ అంటాడు.
రాహుల్ దొంగ నాటకాలు..
ఆ తర్వాత.. కళ్యాణ్ బయట కూర్చుని ఫైల్స్ చూస్తూ ఉంటాడు. ఇదంతా రుద్రాణి, రాహుల్‌లు గమనిస్తారు. కళ్యాణ్‌పై కుట్ర స్టార్ట్ చేస్తారు. రాహుల్ వచ్చి కళ్యాణ్.. నిన్ను రాజ్ ప్లేసులో కూర్చోమంటే భయ పడ్డావ్. కానీ ఇలా వర్క్ చేస్తే రాజ్‌ని మించిపోతావ్‌రా. ఇంతకీ నేను చెప్పిన కాంట్రాక్ట్ గురించి ఏం ఆలోచించావ్ అని రాహుల్ అడుతాడు. మర్చిపోయానురా దాని గురించి మాట్లాడదామంటే అన్నయ్య కూడా ఇంట్లో లేడు అని అంటాడు కళ్యాణ్. ఇంకా ప్రతీదీ రాజ్‌ని అడిగితే నువ్వెప్పుడురా సొంత నిర్ణయాలు తీసుకునేది.. ఇదిగో ఈ ఫైల్ చూడు అని రాహుల్ అంటాడు. సరే ఇప్పుడే చూస్తాను అని కళ్యాణ్ అంటాడు.
పాపం అనామిక గోల..
సరిగ్గా అప్పుడే కళ్యాణ్ ఫైల్ చూస్తూ ఉంటాడు. అప్పుడే అనామిక వచ్చి.. కళ్యాణ్ మా అమ్మావాళ్లు కాల్ చేశారు. మా ఇంటికి రమ్మన్నారు అని చెబుతుంది. ఏంటి ఏ ఇంటికి.. మీ ఇంటికి అయితే నువ్వు వెళ్లు అని కళ్యాణ్ అడుగుతాడు. అదే మా అమ్మావాళ్ల ఇంటికి సరేనా.. ఇద్దర్నీ భోజనానికి రమ్మంది అని అనామిక అంటే.. నాకు కుదరదని కళ్యాణ్ చెప్తాడు. పెళ్లైన దగ్గర్నుంచి మనం ఇద్దరం ఎప్పుడూ వెళ్లలేదు అని అనామిక అంటే.. మనిద్దర్నీ కలిసి రమ్మని మీ వాళ్లు చెప్పలేదని కళ్యాణ్ అంటే.. ఇప్పుడు చెప్పారు కదా.. లంచ్ టైమ్ కి వెళ్లేసి వచ్చేద్దాం అని అనామిక అంటుంది. కాదు రానని కళ్యాణ్ అంటే.. రాత్రికి రాత్రి కోట్లు సంపాదించేవాడిలా బాగానే చెప్తున్నావ్ అని అనామిక నోరు జారుతుంది. షటప్ అనామిక.. నేను ఎక్కడికీ రాను. నన్ను తక్కువ చేసి మాట్లడితే మర్యాదగా ఉండదు. గెట్ లాస్ట్ అని అంటాడు కళ్యాణ్. ఆ తర్వాత ఫైల్ కూడా పక్కన పడేస్తాడు.
కావ్య ఇంటికి రాలేదని పెద్దావిడ టెన్షన్..
పార్టీలో ఏం జరిగిందోనని ఇంట్లో ఇందిరా దేవి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ వచ్చి పైకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కావ్య వస్తుంది. ఏం జరిగిందని ఎంతో ఆరాటంగా అడుగుతుంది పెద్దావిడ. మీ మనవడు మనకు అందమైన అబద్ధం చెప్పాడు. ఆ వెన్నెల అనేది అసలు లేదు. ఎప్పుడో చనిపోయిందని కావ్య అంటే.. మరి ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పాడు? అని పెద్దావిడ అంటుంది. ఏమో అమ్మమ్మ గారూ.. తెలుసుకోవాలి అని అంటుంది కావ్య. పోనీలే.. వాడు రాజ్ కొడుకే కాదని తేలింది. అదే చాలు అని పెద్దావిడ అంటే.. లేదు అమ్మమ్మా.. ఆ బాబు ఎవరు? ఎందుకు ఆయన కొడుకు అని చెప్పాడో తెలుసుకోవాలని కావ్య అంటుంది.
కళ్యాణ్‌కు రాజ్ ఓదార్పు..
ఈ సీన్ కట్ చేస్తే.. తెల్లవారుతుంది. కళ్యాణ్ ఫైల్ గురించి చెక్ చూస్తూ ఉంటాడు. అదంతా రాహుల్ పైనుంచి చూస్తాడు. వీడు మరీ సిన్సియార్టీగా పని చేస్తున్నాడు. ఎంత కష్ట పడ్డా ఏం లాభం. నేను ఉన్నానుగా చెడగొట్టడానికి. ఇప్పుడైనా ఫైల్ మీద సైన్ చేయించాలి అని రాహుల్ అనుకుంటాడు. అప్పుడే రాజ్ కిందకు దిగి.. కళ్యాణ్ ను చూస్తూ మొత్తం పనంతా నీ మీద పడేశాను. మిమ్మల్ని ఎప్పుడూ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకున్నా. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నాకు కావాల్సింది నీ ఓదార్పు కాదన్నయ్యా.. నీ మీద పడ్డ నిందలన్నీ తొలగిపోయి.. మళ్లీ కంపెనీ బాధ్యతలు స్వీకరించాలి. అప్పుడు నేను నిజంగా సంతోష పడతాను అని కళ్యాణ్ అంటాడు. అది విని రాజ్ సైలెంట్‌గా వెళ్లిపోతాడు.
కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..
ఆ తర్వాత కావ్య కిందకు దిగుతుంది. ఏంటి వదినా ఇంత ఉదయం రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అని కళ్యాణ్ అడుగుతాడు. గుడికి అని కావ్య చెప్తుంది. మళ్లీ కావ్యను పిలిచి.. మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన కంపెనీకి ఓ డీల్ వచ్చింది. అది చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. అంతకు ముందు కూడా మన కంపెనీతో పని చేశారు. ఇప్పుడు వాళ్లు అబ్రాడ్ నుంచి గోల్డ్ తెప్పిస్తున్నారట అని కల్యాణ్ అంటే.. శకుంతలా గ్రూప్ వాళ్లా అని కావ్య అంటుంది. అంత కరెక్ట్‌గా ఎలా చెప్పారు? అని కళ్యాణ్ అడుగుతాడు. దీంతో రాహుల పైనుంచి టెన్సన్ పడుతూ ఉంటాడు. వెంటనే కిందకు వెళ్లి మ్యానేజ్ చేస్తాడు. కళ్యాణ్ ఎంత పెద్ద తప్పు జరిగిందో తెలుసా? కొంచెం ఉంటే ప్రమాదంలో పడిపోయేవాళ్లం. నిన్న ఓ కంపెనీ ప్రపోజల్ తీసుకొచ్చాను కదా. ఆ కంపెనీ పెద్ద ఫ్రాడ్ అంట.. ఇప్పటికే చాలా మందిని మోసం చేశారంట. సారీ కళ్యాణ్.. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయిందని చెప్తాడు రాహుల్. నువ్వు ఇప్పుడు బాగా మారిపోయావ్ రాహుల్ అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్‌తో జాగ్రత్తగా ఉండమని కళ్యాణ్‌కి చెప్తుంది కావ్య.
ఫెయిల్ అయిన రాహుల్ ప్లాన్..
నెక్ట్స్ రుద్రాణి.. రాహుల్‌ని తీసుకొచ్చి ఏమైందని అడుగుతుంది. ఎక్కడా? మన ప్లాన్‌కి ఆ రాజ్, కావ్యలు అడ్డం వచ్చారు. చివరికి ఆ కళ్యాణ్ గాడు.. కావ్యకు ఆ డీల్ గురించి చెప్పాడు. కొంచెం ఉంటే తెలిసి పోయేది. తెలివితో వెళ్లి మ్యానేజ్ చేశాను అని చెప్తాడు. పోనీలే తర్వాత టైమ్ చూసి దెబ్బ కొట్టొచ్చు అని రుద్రాణి అంటే.. అప్పుడే స్వప్న వస్తుంది. నిన్న ఏం జరిగింది? అని స్వప్న అడుగుతుంది. నిన్న నువ్వు బాగా డ్యాన్స్ చేశావ్ అని రాహుల్ అంటే.. ఏమో నాకు సరిగ్గా తెలీదు. దీంతో రాహుల్ పొగుడుతూ ఓ సెటైర్ వేస్తే.. స్వప్న పొంగిపోతుంది. ఈ సీన్ కట్ చేస్తే.. బాబు పాలు తాగకుండా ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది ఎందుకు పాలు తాగడం లేదని.. డాక్టర్‌కు ఫోన్ చేసి చెప్తాడు రాజ్. దీంతో రాజ్ చెప్పినట్టు చేస్తాడు. అయినా బాబు ఏడుపు ఆపడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.