Brahmamudi, November 30th episode: కళ్యాణ్ తో అప్పూ పెళ్లి కోసం కనకం మాస్టర్ ప్లాన్.. జస్ట్ మిస్ అయిన అరుణ్!
ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో కావ్యకి కాల్ చేస్తుంది కనకం. స్వప్న కడుపుతో ఉన్న విషయం నిజమేనా అని అడుగుతుంది. అవునని కావ్య చెబుతున్నా.. కనకం వినిపించుకోకుండా.. అదేదో కొత్త డ్రామా మొదలు పెట్టినట్టుంది అని అంటుంది. కనకం మాటలకు రాజ్ పగలబడి నవ్వుతాడు. దీంతో కనకం ఫోన్ కట్ చేస్తుంది కావ్య. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో చెప్పు అని అడుగుతాడు రాజ్.. ఆస్పత్రికి అని చెప్తుంది కావ్య. ఎందుకు అని రాజ్ అడిగితే.. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ చేసుకోవడానికని కావ్య చెబుతుంది. దీంతో రాజ్ షాక్ అయి కారు ఆపేస్తాడు. ఆగండి.. తూర్పుకి పడమరకి మధ్య భూ మధ్య రేఖ ఉన్నంత కాలం..
ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో కావ్యకి కాల్ చేస్తుంది కనకం. స్వప్న కడుపుతో ఉన్న విషయం నిజమేనా అని అడుగుతుంది. అవునని కావ్య చెబుతున్నా.. కనకం వినిపించుకోకుండా.. అదేదో కొత్త డ్రామా మొదలు పెట్టినట్టుంది అని అంటుంది. కనకం మాటలకు రాజ్ పగలబడి నవ్వుతాడు. దీంతో కనకం ఫోన్ కట్ చేస్తుంది కావ్య. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో చెప్పు అని అడుగుతాడు రాజ్.. ఆస్పత్రికి అని చెప్తుంది కావ్య. ఎందుకు అని రాజ్ అడిగితే.. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ చేసుకోవడానికని కావ్య చెబుతుంది. దీంతో రాజ్ షాక్ అయి కారు ఆపేస్తాడు. ఆగండి.. తూర్పుకి పడమరకి మధ్య భూ మధ్య రేఖ ఉన్నంత కాలం.. మనకి పిల్లలు ఎలా పుడతారెండి? మీ వెర్రి తనం కానీ.. మనం వెళ్లేది ఆ అరుణ్ పని చేసే ఆస్పత్రికి అని చెప్తుంది కావ్య. హమ్మయ్య అనుకుంటాడు రాజ్. ఆ అరుణ్ గాడిని జుట్టు పట్టుకుని లాగి కొచ్చి.. తలుపును తన్నినట్టు తన్ని.. తేలుని నలిపినట్టు కాల కింద వేసి తొక్కి.. నట్టింట్లో పడేసి నాలుగు కుమ్మితే అప్పుడు నిజం చెప్తాడు వాడే.. అని కావ్య అంటే.. అమ్మో నీలో ఈ రెబల్ లక్షణాలు కూడా ఉన్నాయేంటే అని రాజ్ అంటాడ్. అవన్నీ చేయాల్సింది నేను కాదండి.. మీరు. కావాలంటే నేను మీకు డైరెక్షన్ ఇస్తాను మీరు చేయండి అని కావ్య అంటుంది. కావ్య మాటలకు ఒకింత ఆశ్చర్యానికి గురవుతాడు రాజ్.
అప్పూ పెళ్లి కోసం కనకం ప్లాన్.. అరుణ్ ఆస్పత్రికి వచ్చేసిన కావ్య:
ఇక ఈ సీన్ కట్ చేస్తే.. అన్న పూర్ణ దగ్గరికి వచ్చి స్వప్న నిజంగానే కడుపుతో ఉందంట అక్కా అని కనకం చెబుతుంది. దీనికి సంతోషిస్తుంది అన్న పూర్ణ. దీంతో కనకానికి మరో ఐడియా వస్తుంది. స్వప్న కడుపుతో వంక పెట్టుకుని ఆ ఇంట్లో తిష్ట వేసి.. అప్పూని, కళ్యాణ్ బాబుని ఒకటి చేస్తాను అని కనకం అంటే.. అన్న పూర్ణ షాక్ కి గురవుతుంది. ఈ లోపు కావ్య, రాజ్ లు అరుణ్ పని చేసే ఆస్పత్రికి వస్తారు. కానీ అప్పటికే రాహుల్.. అరుణ్ దగ్గరకు వస్తాడు. కావ్య ఇక్కడకు వస్తుందని చెప్తాడు. కావ్య ఇక్కడికి ఎందుకు వస్తుందని అరుణ్ షాక్ అవుతాడు. మరి వాళ్ల అక్క స్వప్న మీద నిందలు వేస్తే రాకుండా ఉంటుందా.. మీరు ఎక్కడ ఉన్నారో వెతుక్కుంటు మరీ వస్తుందని రాహుల్ అంటాడు. వాట్.. మీరు చెప్తేనే కదా నేను ఇది చేశాను అని అరుణ్ అంటే.. కానీ నీ వెనుక నేను ఉన్నాన్న విషయం తనకు తెలీదు కదా అని రాహుల్ చెప్తాడు.
భయపడిన అరుణ్.. కొన్ని రోజులు తప్పించుకుని తిరగాలి:
కావ్య గురించి నాకు చాలా బాగా తెలుసు. చాలా మొండి అమ్మాయి. ఎదురు పడితే నిజం చెప్పించకుండా ఉండదని అరుణ్ అంటాడు. అందుకే కదా జాగ్రత్త పడమని చెప్పడానికి వచ్చాను అని రాహుల్ చెప్తాడు. ఈ అడ్రస్ తనకు ఎలా తెలుసు అని అరుణ్ కంగారు పడతాడు. ఇప్పుడు ఈ అడ్రస్ ముఖ్యం కాదు.. ఆ కావ్యకి నువ్వు దొరకకుండా ఉండటం ముఖ్యమని చెప్తాడు. కావ్య వస్తే.. నువ్వు ఈ ఆస్పత్రిలో మానేశానని చెప్పు.. ఆమె వచ్చినా తను పట్టుకోలేదని రాహుల్ అంటాడు. ఇక కావ్య, రాజ్ లు అరుణ్ క్యాబిన్ కి వచ్చి చూస్తే ఉండడు. అప్పుడే నర్స్ వచ్చి.. అరుణ్ సర్ నిన్ననే రిజైన్ చేసి వెళ్లి పోయారు మేడమ్ అని చెప్తుంది. తన ఇంటి అడ్రస్ తెలుసా అని కావ్య అడిగితే.. తెలీదని నర్స్ చెప్తుంది. రికార్డ్స్ లో ఉంటుంది కదా.. అని కావ్య అడిగితే.. రిజైన్ చేయగానే ఆ పర్సన్ డీటైల్స్ డిలేట్ చేస్తారని చెప్తుంది. సరే అని కావ్య, రాజ్ లు బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత రాజ్ పై ఒక్కసారిగా విరుచుకు పడుతుంది కావ్య. దీంతో రాజ్ బిత్తర పోయి చూస్తాడు. మా అక్క కోసం ఎక్కడి దాకా అయినా వెళ్తాను అని అంటుంది కావ్య. సరే పదా ఇంటికి వెళ్దాం అని రాజ్ అంటాడు. ఈ లోపు కావ్య రావడంతో షాక్ కి గురవుతాడు అరుణ్. ఈలోపు రాహుల్.. ఎక్కడికీ వెళ్లకు.. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండు అని అరుణ్ కి చెప్పి వెళ్లి పోతాడు. వీళ్ల గొడవలు ఏమో కానీ.. నేను బలి అవుతున్నా.. కొన్ని రోజులు ఎక్కడికీ కనిపించకుండా వెళ్లి పోతాను అని అరుణ్ అనుకుంటాడు.
కళ్యాణ్ పై అనామిక ఫైర్.. ఎప్పుడూ మీ ఫ్రెండ్ జపమేనా..
ఆ తర్వాత అనామిక దగ్గరకు వస్తాడు కళ్యాణ్. ఏంటి సర్ అప్పుడే వచ్చేసారు. ఇంకా కాసేపు మీ ఫ్రెండ్ దగ్గరే ఉండి వస్తారనుకున్నా అని అనామిక అంటుంది. ఇంకా కోపం తగ్గలేదా అని కళ్యాణ్ అడిగితే.. కోపం కాదు బాధ.. నీ ఫ్రెండ్ తో ఎలాగైనా ఉండు అది నీ ఇష్టం. కానీ నేను పక్కనే ఉన్నప్పుడు నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటాను కదా.. అందులో తప్పు ఏమైనా ఉందా అని అనామిక అడిగితే.. తప్పు ఉందని ఎవరు అన్నారు? మరి నువ్వు చేసింది ఏంటి? బయటకు తీసుకెళ్తాను అని చెప్పి.. అప్పూ కోసం నన్ను రోడ్డు మీద నిలబెడ్డావ్.. గంట సేపు పిచ్చి దానిలా కారులో కూర్చుని ఉన్నాను అని అనామిక అంటుంది. అర్థం చేసుకో అనామిక.. పాపం అప్పూని అలా చూస్తే నీకు బాధగా లేదా.. నువ్వు నాతోనే లైఫ్ లాంగ్ ఉంటావ్.. అని కళ్యాణ్ అంటే.. అనామిక అర్థం చేసుకోదు. మన ఫ్రెండ్ ప్రాబ్లమ్ లో ఉంటే సపోర్ట్ చేయాలి కదా అని కళ్యాణ్ అంటే.. మరి నాకెవరు చేస్తారు.. నువ్వు 24 గంటలు అప్పూ జపం చేస్తుంటే నా ప్రాబ్లమ్ ఎలా అర్థం అవుతుంది అని అనామిక అంటుంది. ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంటి అని కళ్యాణ్ అడిగితే.. మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసి ఎన్ని రోజులు అయింది.. కానీ ఇప్పటి వరకూ ముహూర్తం పెట్టుకోలేదు. మీ ఇంటికి కోడల్ని అవుతున్నా అని మా పేరెంట్స్ అందరికీ చెప్పేశారు. అప్పటి నుంచి పెళ్లి ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్లకు అని అనామిక అంటుంది. సారీ అనామిక ఈ విషయంలో నువ్వు స్ట్రెస్ తీసుకుంటున్నావ్ అని నేను తెలుసుకోలేక పోయాను. నీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నాకు చెప్పు అని కళ్యాణ్ అంటాడు.
స్వప్న తింటుంటే మామిడి కాయ లాక్కున్న రుద్రాణి..
హాలులో కూర్చుని మామిడి కాయలు తింటూ ఉంటుంది స్వప్న. పని మనిషిని పిలిచి.. తనకు డైట్ లో ఎలాంటి ఆహారం కావాలో చెప్తుంది. ఇది విన్న రుద్రాణి.. స్వప్న దగ్గరకు వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంట్లో కూర్చుని పని మనిషికి ఆర్డర్స్ వేస్తావ్.. దారి తప్పిన ఆడదానివి నువ్వు.. కానీ నేను ఈ ఇంటి ఆడ పిల్లని అని రుద్రాణి అంటుంది. అని మీకు మీరు అనుకోవడం తప్ప.. ఈ ఇంట్లో ఎవరూ ఆ హోదాలో చూడటం లేదని స్వప్న అంటుంది. అయినా మీరేంటి నా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ ఇల్లు మీదా.. ఈ ఆస్తి, ఐశ్వర్యం మీదా.. నాకు తినాలి అనిపించింది.. అడిగి చేయమన్నాను. అందుతో తప్పు ఏముంది? అని స్వప్న అంటే.. అత్తగారి అంతస్తు గురించి మాట్లాడే హక్కు నీకెవరు ఇచ్చారు? రాహుల్ ని చేసుకునేటప్పుడు కదా అవన్నీ ఆలోచించాల్సిందని ఇందిరా దేవి అంటుంది.
మళ్లీ దుగ్గిరాల ఇంట్లో మొదలైన రచ్చ..
విన్నావా ఇది మీ అందరి అలుసు తీసుకుని ఇంత తెగించి ప్రవర్తిస్తుందని రుద్రాణి అంటే.. నువ్వు మా అలుసు చూసుకుని అధికారం ప్రవర్తిస్తున్నావ్. కడుపుతో ఉన్న కోడలి తిండి విషయంలో కూడా నీ జోక్యం ఏంటి? అని పెద్దావిడ అడుగుతుంది. అమ్మమ్మ.. మీరెప్పుడు అర్థం చేసుకుంటారు. ఆ కడుపు గురించి ఎందుకు గుర్తు చేసి నన్ను చిత్రవధ ఎందుకు చేస్తున్నారు అని రాహుల్ అంటాడు. ఇక రాహుల్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది స్వప్న. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే.. ఇక నేను ఊరుకోను అని రుద్రాణి అంటే.. కేవలం మీ మాట కోసమే ఊరుకుంటున్నా.. తప్పు చేసిందని తెలిసి కూడా ఎందుకు బయటకు ఈడ్చి పడేయకుండా ఊరుకున్నారు అని రాహుల్ కూడా అంటాడు.
సాక్ష్యాలు ఉంటేనే స్వప్నని బయటకు పంపగలం: రాజ్
నువ్వు స్వప్నని బయటకు పంపాలంటే సాక్ష్యాలు కావాలి అని రాజ్ అంటే.. సాక్ష్యాలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకు రావాలి? ఇలాంటి మోసగత్తెను.. ఇలాంటి పొగరు పోతు ఆడదాన్ని ఇంట్లో పెట్టుకుని.. నా కొడుకు కుమిలిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా.. దీంతో నా కొడుకు కాపురం చేయలేడు. ఇప్పటికిప్పుడు దీని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాను అని రుద్రాణి అంటే.. ఎవరి మెడ ఎవరు పట్టుకుని గెంటేస్తారు అనేది సాక్ష్యాలు తెచ్చిన తర్వాత చూసుకుందాం. ఇలా ప్రతి రోజూ 10 మంది ముందు నా శీలం మీద మచ్చ వేస్తూ ఉంటే.. ఈ అవమానాలు పడుతూ ఉండటం నాకు కూడా ఇష్టం లేదు. రుజువు చేయండి.. ఆ తర్వాత గెంటేయండని స్వప్న అంటుంది.
దుగ్గిరాల ఇంట్లో ఫ్యామిటీ మెంబర్స్ పై కావ్య సీరియస్..
ఏవండీ ప్రతి రోజూ ఇంట్లో ఈ రచ్చ అవసరమా.. వినటానికి చాలా చిరాకుగా ఉంది. అంత ధైర్యంగా ఏ పరీక్షకైనా స్వప్న సిద్ధమని అంటోందిగా.. తను కోరినట్టు ఆ డీఎన్ఏ టెస్ట్ చేసుకుంటే ఈ చిక్కు ముడి విడి పోతుందని అపర్ణ అంటే.. ఇప్పటికిప్పుడు కుదరదని సుభాష్ అంటాడు. ఈ మాటలకు కావ్య రియాక్ట్ అవుతూ.. అసలు ఏం మాట్లాడుతున్నారు? బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి.. లేక ఆడదాని శీలం బయట పెట్టడానికా.. ఇంటి కోడలిగా ఉన్న ఒక అమ్మాయి.. శీలవతో కాదో తేల్చుకోవడానికి.. ఏదో సర్టిఫికేట్ తీసుకొస్తేనే తప్ప నమ్మలేని దౌర్భాగ్యపు స్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ జరిగింది తప్పు? ఎవరిలో ఉంది లోపం? ఆ అత్త కూడా ఓ బిడ్డకు తల్లే.. ఈ మగాడు కూడా భార్యతో కాపురం చేసే మనిషే.. వీళ్లకు బంధాలు.. బంధుత్వాలు అవసరం లేదా? పెళ్లాం పవిత్రత గురించి సర్టిఫికేట్ కావాలా? ఈ పరీక్ష నిజంగానే ఓ అగ్ని పరీక్ష అని అంటుంది కావ్య. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.