Brahmamudi, January 1st episode: హారతి గురించి రచ్చ.. కావ్యకి అండగా నిలిచిన రాజ్.. ఏం జరగనుందో!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. కనకం, కృష్ణమూర్తి, అప్పూలు కళ్యాణ్ పెళ్లి నుంచి వెళ్లిపోతారు. పుట్టింటి వాళ్లు అలా వెళ్లిపోవడంతో కావ్య పడుతుంది. మమ్మల్ని వదిలేయ్.. మా దరిద్రం నీకు అంట కూడదు. ఇక నుంచి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి కృష్ణ మూర్తి ఫ్యామిలీ వెళ్లి పోతారు. వెళ్లండి మళ్లీ రాకండి అని ధాన్యలక్ష్మి ఘాటుగా విమర్శిస్తుంది. ఇప్పటివరకూ మా పక్కనే ఉంటూ మమ్మల్ని నమ్మించి.. అవకాశం దొరికితే పెళ్లి ఆపించి.. మీ కూతుర్ని ఇచ్చి చేయాలని చాలు.. మీ అందరి అసలు స్వరూపం బయట పడింది. ఇక మిమ్మల్ని మా ఇంట్లో ఎవరూ బంధువులుగా ఎప్పటికీ పిలవరు. ఒక వేళ సంస్కారం కాదని పిలిచినా..

Brahmamudi, January 1st episode: హారతి గురించి రచ్చ.. కావ్యకి అండగా నిలిచిన రాజ్.. ఏం జరగనుందో!
Brahmamudi

Updated on: Jan 01, 2024 | 11:23 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. కనకం, కృష్ణమూర్తి, అప్పూలు కళ్యాణ్ పెళ్లి నుంచి వెళ్లిపోతారు. పుట్టింటి వాళ్లు అలా వెళ్లిపోవడంతో కావ్య పడుతుంది. మమ్మల్ని వదిలేయ్.. మా దరిద్రం నీకు అంట కూడదు. ఇక నుంచి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి కృష్ణ మూర్తి ఫ్యామిలీ వెళ్లి పోతారు. వెళ్లండి మళ్లీ రాకండి అని ధాన్యలక్ష్మి ఘాటుగా విమర్శిస్తుంది. ఇప్పటివరకూ మా పక్కనే ఉంటూ మమ్మల్ని నమ్మించి.. అవకాశం దొరికితే పెళ్లి ఆపించి.. మీ కూతుర్ని ఇచ్చి చేయాలని చాలు.. మీ అందరి అసలు స్వరూపం బయట పడింది. ఇక మిమ్మల్ని మా ఇంట్లో ఎవరూ బంధువులుగా ఎప్పటికీ పిలవరు. ఒక వేళ సంస్కారం కాదని పిలిచినా.. మీరెవరూ మా గడప తొక్కడానికి వీల్లేదని ధాన్య లక్ష్మి.. అంటుంది. చిన్న అత్తయ్యా అని కావ్య అంటుంటే.. ఆ పిలుపుతో పిలిచే అర్హత నీకు లేదు. మా అక్క నాకు చెబుతూనే ఉండేది. కానీ నేనే అర్థం చేసుకోకుండా.. మిమ్మల్ని దగ్గరకు చేర్చుకున్నా. అది నా తప్పే. మీ ఇంట్లో అందరూ అవకాశవాదులే. అవకాశం బట్టి ఆశల్ని నిజం చేసుకోవాలి అనుకునే వాళ్లే. మళ్ల నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టాలని ఎదురు చూస్తే చాలా దారుణంగా ఎదురు దెబ్బ తింటారు జాగ్రత్త.. అని ధాన్య లక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అవమానంతో అక్కడి నుంచి క‌ృష్ణ మూర్తి ఫ్యామిలీ వెళ్లిపోతారు.

కావ్య హారతి ఇస్తే ఒప్పుకోం: అనామిక పేరెంట్స్

ఆ తర్వాత పెళ్లైన నూతన దంపతులకు హారతి తీసుకురమ్మని కావ్యకు చెబుతుంది ఇందిరా దేవి. ఆగండి.. ఎవరితో ఎవరికి హారతి ఇప్పిస్తున్నారు. ఈ పెళ్లి ఆగిపోయేలా చేసి.. తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని కుట్ర చేసింది కావ్య. అలాంటి తనతో నా కూతురికి హారతి ఇప్పిస్తారా.. అన్యాయం చేయాలనుకున్న మనిషితో ఎలా హారతి ఇప్పిస్తారు. దుగ్గిరాల కుటుంబానికి గొప్ప గొప్ప కోడల్ని తెచ్చుకున్నారు అనుకున్నాం. కానీ మీ కోడళ్ల కుటుంబం ఎలాంటిదో కళ్లారా చూశాం. ఆ కుటుంబం వచ్చిన కావ్య.. నా కూతురికి ఎలా మనస్ఫూర్తిగా హారతి ఇస్తుందని అనామిక పేరెంట్స్ శైలు, సుబ్రమణ్యం అంటారు.

కావ్య హారతి ఇస్తే ఇంట్లోకి రాను: అనామిక

ఆ తర్వాత కళ్యాణ్ సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నా.. అనామిక కూడా ఒప్పుకోదు. కావ్య ఎలాంటిదో ఈ పెళ్లిలోనే అర్థం చేసుకున్నా. తన మంచిది అన్నట్టు నమ్మించి మోసం చేయాలనుకుంది. తన చెల్లెలి కోసం నా జీవితం నాశనం చేయాలని చూసింది. కొత్తగా పెళ్లైన దంపతులకు మంచి మనసుతో హారతి ఇచ్చేవాళ్లు ఎదురు రావాలని అనామిక నోరు పారేసుకుంటుంది. అదేంటమ్మా.. ఆ గొడవ అక్కడే వదిలేయకుండా.. పుట్టింటి సారె మోసుకొచ్చినట్టు అది కూడా మోసుకొచ్చావా.. కావ్య మనసులోకి తొంగి చూసినట్టు మాట్లాడతావేంటి? అని పెద్దావిడ అంటే.. అనామిక ఫ్యామిలీకి రుద్రాణి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత అపర్ణ, ధాన్య లక్ష్మిలు కూడా అనామికకే సపోర్ట్‌గా మాట్లాడతారు. నాకు ఈ కావ్య చేతుల మీదుగా హారతి తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మీరు హారతి ఇవ్వండి లోపలికి వస్తాం. లేదంటే నాకు హారతే అవసరం లేదని అనామిక అంటే.. కళ్యాణ్ అస్సలు ఒప్పుకోడు. వదిన వల్లే నేనూ అనామిక కలిశాం. ఇది నేను నమ్ముతున్నా.. కాబట్టి వదిన హారతి ఇస్తేనే నేను లోపలికి వస్తానని చెప్పేస్తాడు కళ్యాణ్. అదే నీ నిర్ణయం అయితే.. నేను అసలు లోపలికే రాను. ఇటు నుంచి ఇటే నా పుట్టింటికి వెళ్లి పోతాను అని అనామిక అంటుంది.

ఇవి కూడా చదవండి

కావ్యకు సపోర్ట్‌గా నిలిచిన రాజ్..

కవి గారూ అలా మాట్లాడకండి.. హారతి ఎవరు ఇస్తే ఏంటి? అంతా మీకు శుభమే జరగాలని కావ్య అంటుంది. విన్నారు కదా.. ఇదీ కావ్య సంస్కారం. ఇంట్లో ఇంత మంది తప్పు పట్టినా.. తను మీ కూతురు మంచే కోరుకుంటుంది. నాకు తెలుసు.. కళ్యాణ్, అనామికల పెళ్లి జరగాలని ఎంత కోరుకుందో. ఆమె సంకల్పం వల్లే ఈ రోజు మీ కూతురు మా ఇంటి కోడలిగా అడుగు పెడుతుంది. అది మీరూ మీ అమ్మాయి గుర్తిస్తే మంచిది సుబ్రమణ్యం గారూ.. అని రాజ్.. అనామిక తండ్రికి సేటుకు ఇవ్వాల్సిన అప్పు గురించి గుర్తుకువచ్చి.. అనామిక ఇప్పుడు నువ్వేం గొడవ చేయకు.. తను మనకు డబ్బు సహాయం చేస్తానని చెప్తాడు. ఇప్పుడు తన భార్యను తప్పు పడితే.. కోపంతో ఆ డబ్బు ఇవ్వక పోవచ్చు అని చెప్తాడు. అమ్మా నా భార్య, నా కూతురు నీ గురించి తెలుసుకోలేక పోయాం. నీ చేతితోనే హారతి ఇచ్చి.. ఈ జంటను లోపలికి తీసుకెళ్లు అని సుబ్రమణ్యం అంటాడు.

అనామిక అండ్ పేరేంట్స్ కుట్ర..

దీంతో కావ్య.. కళ్యాణ్ – అనామికలకు హారతి ఇస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ – అనామికలు లోపలికి వస్తారు. ఆ తర్వాత అనామికను సపరేట్‌గా తీసుకొచ్చినా.. శైలు, సుబ్రమణ్యం.. ఏంటి డైరెక్ట్‌గా కావ్యపై వార్ స్టార్ట్‌ చేశావేంటి? అని అంటారు. లేకపోతే ఏంటి మామ్.. ఆ కావ్యను చూస్తుంటే ఒళ్లు మండి పోతుంది. అప్పటికీ చాలా పద్దతిగా మాట్లాడాను. కళ్యాణ్ కూడా ఆ కావ్యకే సపోర్ట్ చేయాలని చూశాడు. ఆ విషయం అస్సలు నచ్చడం లేదని అంటుంది. అదే చెప్తున్నా ముందు నీ మొగుడిని నీ కంట్రోల్‌లోకి తెచ్చుకో. అప్పుడు ఈ ఇంట్లో నువ్వు ఏం చెప్పినా నడుస్తుంది. అవకాశం దొరికినప్పుడు కావ్య గురించి బయట పెట్టు అని శైలు, సుబ్రమణ్యం చప్తారు. ఆ తర్వాత అందరూ హాలులో కూర్చుని కార్యం గురించి ముహుర్తం పెట్టిద్దాం అని మాట్లాడుకుంటారు. ఇక కావాలనే రుద్రాణి పదే పదే అప్పూ విషయం తీసుకొచ్చి.. గొడవ పెట్టాలని చూస్తుంది.