Brahmamudi, September 13th episode: ఈ రోజు ఎపిసోడ్ బలేగా ఉంది.. రాజ్ తిప్పలు మామూలుగా లేవు కదా! నవ్వులే నవ్వులు..!!

|

Sep 13, 2023 | 12:50 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రూమ్ లో అనామికతో మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్. ఈలోపు బెడ్ మీద పిల్లో దగ్గర అనామిక ఫొటో ఉంటుంది. అది అనామిక చూడకుండా దాచేస్తాడు కళ్యాణ్. అదేంటి? నేను చూడకూడదా? అని అడుగుతుంది అనామిక. అలాంటిదేమీ లేదు.. చూడాల్సిన టైమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా అంటూ చెప్తాడు కళ్యాణ్. ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపు అనామిక వెళ్దాం పదండి.. నేను వెళ్లా మీకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి అని..

Brahmamudi, September 13th episode: ఈ రోజు ఎపిసోడ్ బలేగా ఉంది.. రాజ్ తిప్పలు మామూలుగా లేవు కదా! నవ్వులే నవ్వులు..!!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రూమ్ లో అనామికతో మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్. ఈలోపు బెడ్ మీద పిల్లో దగ్గర అనామిక ఫొటో ఉంటుంది. అది అనామిక చూడకుండా దాచేస్తాడు కళ్యాణ్. అదేంటి? నేను చూడకూడదా? అని అడుగుతుంది అనామిక. అలాంటిదేమీ లేదు.. చూడాల్సిన టైమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా అంటూ చెప్తాడు కళ్యాణ్. ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపు అనామిక వెళ్దాం పదండి.. నేను వెళ్లా మీకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి అని అంటుంది. ఆ.. అదీ నిజమేనండి.. ఎగ్జామ్ పేపరే రాయాలి.. వీళ్లు అడిగిన ప్రశ్నలు అలా ఉంటాయి.. అని సమాధానం ఇస్తాడు కళ్యాణ్. ఇక కళ్యాణ్, అనామికలు మాట్లాడుకుంటూ కిందకు వస్తారు.

పట్టించుకోని కావ్య.. స్వీట్ లో ఉప్పు వేసిన రాజ్:

ఈ లోపు కావ్యని కూల్ చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తాడు రాజ్. అయినా కావ్య పట్టించుకోదు. నాకేం చెప్పకండి.. మీరు మారరని నాకు అర్థమైంది. నా పని నన్ను చేసుకోనివ్వండి అని అంటుంది కావ్య. లేదు నేను సహాయం చేస్తాను.. అంటూ స్వీట్ లో పంచదార బదులు ఉప్పు కలుపుతాడు. ఇది చూడని కావ్య.. ఇంటికి వచ్చిన అనామిక కోసం ఒక కప్పులో స్వీట్ వేసి తీసుకెళ్లి ఇస్తుంది. ఈలోపు డబ్బా మీద షుగర్ కి బదులు సాల్ట్ అని రాసి ఉన్న డబ్బాను చూసి రాజ్ షాక్ అవుతాడు. వెంటనే అనామికకు స్వీట్ ఇవ్వకుండా అడ్డుకుంటాడు. దీంతో అందరూ రాజ్ విచిత్ర ప్రవర్తన చూసి ఏమైందిరా? ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటూ అడుగుతారు. ఏమీ లేదు అయినా ఈ కాలం లేడీస్ స్వీట్ తినదు ఏమో అంటూ అంటాడు. దీనికి అనామిక నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం.. ఇవ్వండి పర్వాలేదు అని అంటుంది.

ఇవి కూడా చదవండి

అనామికకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన కావ్య:

తను డైట్ లో ఉందనుకుంట.. ఇది శాంపిల్ గా తింటే పింపుల్స్ వస్తాయి అంటూ ఏదో చెప్తాడు రాజ్. దీంతో అనామిక అమ్మో పింపుల్సా అయితే నాకు వద్దు.. నేను వెళ్తాను అంటుంది. దీంతో కావ్య.. బొట్టు పెట్టి అనామికకు చీర, గాజులు పెట్టి పంపిస్తుంది. దీంతో అనామిక సంతోషపడుతుంది. ఆ తర్వాత అనామికను కారు దాకా డ్రాప్ చేసి వస్తాడు కళ్యాణ్. దీంతో ఇంట్లోని వారంతా కళ్యాణ్ ను ఆట పట్టిస్తారు. ఏంటి సంగతీ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కళ్యాణ్ అదేమీ లేదు.. తను నా అభిమాని మాత్రమే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ లోపు భాగ్య లక్మ్షి మిగిలిన స్వీట్ తీసుకురా అంటూ కావ్యకి చెబుతుంది. దీంతో ఒక్కసారిగా వద్దూ అంటూ రాజ్ అరుస్తాడు. దీంతో అందరూ ఏమైందిరా అంటూ అడుగుతారు. ఏమీ లేదని చెప్తాడు రాజ్.

స్వీట్ తిని షాక్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ:

ఆ నెక్ట్స్ కావ్య అందరికీ స్వీట్ తీసుకొచ్చి ఇస్తుంది.. ఇది తిన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏమైంది అని అడుగుతుంది కావ్య. ఉప్పు ఎక్కువైంది అంటూ ఒక్కసారే చెప్తారు. దీంతో కావ్య అయితే ఆ విషయం మీ మనవడిని అడగండి.. నాకేం సబంధం లేదని అంటుంది. హే నాకేం తెలియదు అని అంటాడు రాజ్. స్వీట్ లో ఉప్పు కలిపింది ఆయనే కాబట్టి.. వచ్చిన ఆ అమ్మాయికి ఇవ్వలేదు అని చెప్తుంది కావ్య. అవును కరెక్టే కదా అని అంటాడు సీతారామయ్య. అయినీ నీకు కిచెన్ లో పని ఏంట్రా అంటాడు సీతారామయ్య.

ఇక ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ కి దెబ్బ తగిలినందుకు బాధ పడుతూ ఉంటుంది అప్పు. ఇంతలో అప్పూ ఒక ఫ్రెండ్ కాల్ చేసి.. సినిమాకి పోదామా? అని అడుగుతాడు. ఏ నేను ఇప్పుడు రానురా బై అని చెప్తుంది. దీంతో నువ్వు మారిపోయావ్ అప్పు.. ఎప్పుడూ ఆ కళ్యాణ్ తోనే తిరుగుతున్నావ్.. మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు అంటాడు. ఏ నీ ముఖం రా.. నేను మారడం లేంటి? అంటూ ఫోన్ కట్ చేస్తుంది.

అప్పూలో మార్పు.. కళ్యాణ్ కోసమేనా?

ఆ నెక్ట్స్ కనకం వచ్చి.. ఏంటి ఎప్పుడూ రచ్చ చేస్తూ ఉండే నువ్వు ఇలా సైలెంట్ గా ఉన్నావేంటి? నీలో ఈ మార్పు ఏంటే? అని అడుగుతుంది. దీనికి అప్పూకి కోపం వస్తుంది. అందరూ గదే లొల్లి.. నాలో ఏం మార్పు కనిపిస్తుంది. నేను మంచిగానే ఉన్నా అంటూ కోపం పడి బయటకు వచ్చి కుర్చుంటుంది. ఇప్పుడు దాన్ని నేను ఏం అన్నాను.. అరుస్తుంది అని కనకం అంటుంది. వదిలేయ్ అంటాడు కృష్ణమూర్తి. ఇక భోజనం పూర్తి కాగానే.. నేను ఆ విగ్రహాల దగ్గర కాపలాగా ఉంటా అని చెప్తూ.. మెట్ల మీద కూర్చున్న అప్పూని ఏంటమ్మా మంచులో కూర్చున్నావ్.. లోపలికి వెళ్లు అంటాడు. కాసేపు ఉండి పోతాలే నాన్న అంటుంది అప్పు.

ఇక అప్పు దిగాలుగా చందమామ వైపు చూస్తూ కూర్చుంటుంది. అక్కడే ఉన్న అన్నపూర్ణ.. అప్పు దగ్గరికి వచ్చి.. ఏంటి? ఈ వయసులో వెన్నెలను చూస్తూ కూర్చున్నావ్ అంటే.. జీవితం గురించి అయినా అయి ఉండాలి? జీవిత భాగ స్వామి గురించి అయినా ఉండాలి అని అంటుంది. అంత లేదు.. నాలో అంత మార్పు ఏం వచ్చింది? పెద్దమ్మ అని అడుగుతుంది అప్పు. నన్ను కాదు నీ మనసును అడుగు అంటుంది అన్నపూర్ణ. ఆపవే తల్లి అంటూ అక్కడి నుంచి వెళ్తుంది అప్పు.

ఆ నెక్ట్స్ రాజ్ పై నుంచి దిగి కావ్య ఎక్కడ ఉందా? అని వెతుకుతాడు. అక్కడే ఉన్న భాగ్య లక్ష్మి.. కావ్య మావయ్య తగ్గరకు వెళ్లింది అని చెబుతుంది. దీంతో రాజ్ కంగారు పడుతూ.. నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావ్ అంటాడు. ఇక సీతారామయ్యకు ఇచ్చే ట్యాబ్లెట్ల విషయంలో ఇద్దరూ గొడవ పడతారు. దీంతో సీతారామయ్య నేను వేసుకుంటాలే కానీ.. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్లండి అంటాడు. దీంతో కావ్య, రాజ్ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లి పోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.