Brahmamudi, October 10th episode: కూతురు కనిపించపోయే సరికి విజృంభించిన కనకం.. అత్తారింటిని కడిగిపారేసింది!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య కోసం కంగారు పడుతూంటారు కృష్ణ మూర్తి, కనకం. కృష్ణ మూర్తి చెప్పిన విధంగా కావ్య స్నేహితులకు ఫోన్ చేస్తుంది కనకం. వాళ్లకు ఎవరికి ఫోన్ చేసి అడిగినా లేదు, రాలేదని చెబుతూనే ఉంటారు. దీంతో కనకం మరింత బాధ పడుతుంది. ఇక కళ్యాణ్.. రాహుల్ కి కాల్ చేసి వదిన కనిపించిందా అని అడుగుతాడు. లేద కళ్యాణ్ వెతుకుతూనే ఉన్నా.. ఎక్కడా కనిపించలేదని కూల్ డ్రింక్ తాగుతూ సమాధానం చెప్తాడు రాహుల్. ఎలాగైనా వదినని..

Brahmamudi, October 10th episode: కూతురు కనిపించపోయే సరికి విజృంభించిన కనకం.. అత్తారింటిని కడిగిపారేసింది!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Oct 10, 2023 | 10:13 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య కోసం కంగారు పడుతూంటారు కృష్ణ మూర్తి, కనకం. కృష్ణ మూర్తి చెప్పిన విధంగా కావ్య స్నేహితులకు ఫోన్ చేస్తుంది కనకం. వాళ్లకు ఎవరికి ఫోన్ చేసి అడిగినా లేదు, రాలేదని చెబుతూనే ఉంటారు. దీంతో కనకం మరింత బాధ పడుతుంది. ఇక కళ్యాణ్.. రాహుల్ కి కాల్ చేసి వదిన కనిపించిందా అని అడుగుతాడు. లేద కళ్యాణ్ వెతుకుతూనే ఉన్నా.. ఎక్కడా కనిపించలేదని కూల్ డ్రింక్ తాగుతూ సమాధానం చెప్తాడు రాహుల్. ఎలాగైనా వదినని కనిపెట్టాలని కళ్యాణ్ చెప్పగా.. సరే అని అంటాడు రాహుల్. ఇక రాజ్, సుభాష్, ప్రకాష్ లు అందరూ కలిసి కావ్య కోసం వెతుకుతూ ఉంటారు. అయితే కావ్య మాత్రం దగ్గరలో ఉన్న శివాలయంలోకి వచ్చి కూర్చుని బాధ పడుతూ ఉంటుంది. జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీరుమున్నీరవుతుంది. ఈలోపే తెల్లారుతుంది. రాహుల్, కళ్యాణ్ లు ఇంటికి వస్తారు.. కావ్య కనిపించిందా అని అడగ్గా.. లేదు మొత్తం వెతికాం ఎక్కడా కనిపించలేదని చెప్తారు. ఆ తర్వాతే సుభాష్, ప్రకాష్ లు కూడా నిరాశగా వస్తారు. ఏరా సుభాష్ కావ్య గురించి ఏమైనా ఆచూకి తెలిసిందా.. అని ఇందిరా దేవి అడగ్గా.. లేదమ్మా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇందిరా దేవి, సీతా రామయ్య కంగారు పడతారు. అప్పుడే రాజ్ కూడా వస్తాడు.

అపర్ణని నిలదీసిన కనకం..

రాజ్ ఏమన్నా తెలిసిందా అని అందరూ అడుగుతారు. లేదు మమ్మీ.. అన్ని చోట్లా వెతికాను అని రాజ్ అంటాడు. ఏరా నువ్వేమన్నా పగ తీర్చుకునే పనేమన్నా చేస్తావా అని రుద్రాణి.. రాహుల్ ని అడగ్గా.. నాకు ఏం తెలీదు మమ్మీ అని రాహుల్ అంటాడు. ఇక ఈలోగా కనకం, కృష్ణ మూర్తులు ఎంట్రీ ఇస్తారు. వదిన గారూ కావ్య కనిపించడం లేదంట ఏమైందీ.. ఎందుకు.. ఎక్కడికి వెళ్లింది అని కనకం.. అపర్ణను అడుగుతుంది. తెలీదు అని అపర్ణ సమాధానం చెప్తుంది. తెలీదా.. ఏమైందో తెలీదా.. ఎక్కడికి వెళ్లిందో తెలీదా అని కనకం సీరియస్ గా అడుగుతుంది. ఏమీ అనకపోతే.. ఏమీ జరగకపోతే.. ఎవరికీ చెప్పకుండా మీ ఇంటి కోడలు గడప దాటి వెళ్లిపోతుందా? అని కృష్ణ మూర్తి కూడా అడుగుతాడు. నిజమే కానీ ఏమీ జరగలేదు.. ఎవరితోనూ గొడవ జరగలేదు.. రాత్రి నుంచి మాత్రం కనిపించడం లేదని అపర్ణ సమాధానం చెప్తుంది.

ఇవి కూడా చదవండి

స్వప్నని పట్టుకుని చెడా మడా వాయించేసిన కనకం..

ఇంట్లో ఇంత జరుగుతున్నా.. స్వప్న మాత్రం నిద్ర పోతూ ఉంటుంది. తనని చూసిన కనకం.. ఏమే నిద్ర మొఖం దానా.. నీ చెల్లెలు కనపించకుండా పోయింది తెలుసా అని కనకం అడుగుతుంది. తెలుసమ్మా అని స్వప్న అంటుంది. తెలిస్తే ఏమాత్రం కంగారు పడకుండా నిద్ర పోతావే.. నిద్ర.. నువ్వు అసలు మనిషి పుట్టుకనే పుట్టావా అని చెడా మడా వాయించేస్తుంది కనకం. ఇక నేరుగా రాజ్ దగ్గరికి వెళ్తుంది కనకం.. బాబూ నా కూతురు కావ్య కనిపించడం లేదు.. ఎటు వెళ్లిందో తెలీదంటున్నారు. ఈ ఇంటి కోడిలిగా నా కూతురు పట్టు చీరల్లో.. నగలతో నిండుగా తిరుగుతూ ఉంటే ఎంతో మురిసిపోయాను. నిజం చెప్పు బాబూ నా కూతుర్ని ఏం చేశావ్? అని కనకం అడిగితే.. అంత కసాయి మనుషులు ఎవరూ లేరిక్కడ అని అపర్ణ జవాబు ఇస్తుంది.

అప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తేనే వెళ్లలేదు.. ఇప్పుడు ఎందుకు వెళ్లింది:

ఆనాడు నా కూతుర్ని ఇంటి నుంచి వెళ్ల గొడితే.. చీకట్లో, వర్షంలో అలా మొండిగా అలా నిలబడిందే తప్ప ఇంటి గడప దాటలేదు. ఎంత కష్టం వచ్చినా అత్తింటి గడప దాటలేదు. తండ్రి మాట జవదాట లేదు. ఇప్పుడెందుకు ఈ ఇంటితో సంబంధం తెంచుకుని.. ఎరితో చెప్పకుండా.. అర్థాంతరంగా అర్థరాత్రి గడప దాటి వెళ్లిపోతుంది. నాకు సమాధానం కావాలి.. మీకు ఇష్టం లేకపోతే.. మీ అబ్బాయికి ఇష్టం లేకపోతే.. నా కూతుర్ని పంపించేయండి తీసుకెళ్లిపోతా.. నా కూతురు నాకు ప్రాణాలతో కావాలి.. అంటూ కనకం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. నెక్ట్స్ కృష్ణ మూర్తి కూడా సుభాష్ ని నిలదీస్తాడు. అప్పుడు నా కూతుర్ని బయటకు గెంటేస్తే.. మా ఇంటికి తీసుకెళ్తుంటే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ నన్ను మందలించారు. కావ్యకు నేనే తండ్రి అంటూ చెప్పారు. ఇప్పుడు మరి నా కూతురు ఎక్కడ ఉందండి అంటూ బాధ పడతాడు. మీరు ధైర్యంగా ఉండండి.. కావ్యను తీసుకొస్తాం అంటూ సుభాష్ నచ్చజెప్పుతాడు. మీ అంతట మీరే వెళ్ల గొట్టినా వెళ్లిపోయేది కాదు నా కూతురు.. ఏమైంది.. ఎక్కడుంది అంటూ కనకం విజృంభిస్తుంది.

ఆపండి మీ డ్రామాలు.. కనకం, కృష్ణ మూర్తిలకు రుద్రాణి వార్నింగ్:

చాలు ఆపండి అంటూ రుద్రాణి గట్టిగా అరుస్తుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను.. ఏంటి మీ భార్య భర్తల ఓవరాక్షన్.. భార్యభర్తలిద్దరూ ఎవరేం దులపాలి.. ఎవరేం కడిగిపారేయాలని పేజీలకొద్దీ పాత కోపాన్నంతా రాసుకొచ్చారా.. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ ఇంట్లో అందరూ ఉన్నాం. ఎవరికీ ఎవరం చెప్పకుండా ఎక్కడికీ వెళ్లరు. కానీ నీ కూతురు వెళ్లింది. అడగలేదు చెప్పలేదు.. మా ఇంట్లో లేదు.. మీ ఇంటికి రాలేదు. ఇప్పుడు మీకెంత తెలుసో.. మాకూ అంతే తెలుసు.. మీరెంత బాధ పడుతున్నారో.. ఈ ఇంట్లో వాళ్లు కూడా అంతే బాధ పడుతున్నారు. మీరు అడిగిన ఇన్ని ప్రశ్నలకు జవాబు ఒక్కటే.. మాకేం తెలీదు. వెళ్లండి.. వెళ్లి కేసు పెట్టండి.. మీ కూతురు కనబడటం లేదని కేసు పెడతారో.. లేక అత్తామామ, మొగుడులు కలిసి మాయం చేశారో కేసు పెడతారో పెట్టుకోండి. ఇక మీ డ్రామాలు కట్టి పెట్టండి అని రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది.

ఇలాంటి అప నిందలు వేయకూడదమ్మా.. కనకాన్ని సముదాయించిన ఇందిరా దేవి:

అప్పుడే రుద్రాణి అని గట్టిగా అరుస్తాడు సీతా రామయ్య. వాళ్లు న్యాయం అడగడం లేదు కూతుర్ని అడుగుతున్నారు. కన్న ప్రేమతో, ఆక్రోశంతో నిలదీస్తున్నారు. మన దగ్గర జవాబు లేదని చెప్పగలం కానీ.. జవాబుదారీ లేదని చెప్పలేం అని అంటాడు సీతా రామయ్య. కనకం నాకు తెలుసమ్మ.. కన్న కూతురు కనిపించకపోతే.. ఆ తల్లి మనస్సు ఎంత తల్లిడిల్లి పోతుందో.. ఆ తండ్రి మనసు ఎంత తల్లడిల్లి పోతుందో నాకు తెలుసమ్మా అని అంటుంది ఇందిరా దేవి. కానీ ఇంటి కోడిలికి చిన్న అపకారం కూడా తల పెట్టని దుగ్గిరాల వంశం మాది. మీకు అధికారం ఉంటే.. మేము మమకారం పెంచుకున్నాం.. ఇలాంటి అప నిందలు వేయడం భావ్యం కాదు.. ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఏదో పెద్ద కారణం ఉంటే తప్ప ఇంట్లో నుంచి వెళ్లిపోదు. ఆ కారణం ఏంటో తెలుసుకుని మళ్లీ కావ్యను వెనక్కి రప్పించే ప్రయత్నంలోనే మేము ఉన్నాం అంటూ సర్ది చెప్తుంది ఇందిరా దేవి.