బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 01) సాయంత్రం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో బుల్లితెర నటీనటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు. యష్మీ గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక, నబీల్ అఫ్రీదీ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వారి రెమ్యునరేషన్ల గురించి నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా ఏ సీజన్ లో అయినా వారాల చొప్పున పారితోషకం చెల్లిస్తారు. బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి ఎప్పుడూ వారాల ప్రకారమే కంటెస్టెంట్స్ కు రెమ్యునరేషన్ చెల్లిస్తారు. కాగా గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి పెద్దగా పాపులర్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్ లో అంతో ఇంతో స్టార్ యాంకర్ విష్ణుప్రియనే మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్. అందుకే ఈ సీజన్ లో ఆమెకే అత్యధిక పారితోషకం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
విష్ణుప్రియకు వారానికి సుమారు 4 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ హీరో ఆదిత్య ఓంకు చెల్లిస్తున్నారని టాక్. అతనికి వారానికి రూ.3 లక్షలు పారితోషకం ఇస్తున్నారట. ఇక అతి తక్కువగా సీరియల్ నటుడు పృథ్వీరాజ్, సోనియా ఆకుల, బేజవాడ బేబక్కలకు ఒక్కొక్కరికి సుమారు రూ.1. 50 లక్షలు ఇస్తున్నారట.
#BiggBossTelugu8 Contestants Per Week Remuneration pic.twitter.com/Qk7CNU5Dkt
— Ugendher Goud Prince (@UgendherPrince) September 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.