Bigg Boss Telugu 9: ఆ ఇద్దరూ మళ్లీ సేఫ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. ఎలిమినేషన్ తనేనా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఆదివారం దివ్య నిఖితా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 13వ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియకు సంబంధించి నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ వారం కూడా ఏకంగా ఆరుగురు డేంజర్ జోన్ లో నిలిచారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాల్టీ షో ఇప్పటికే 13 వారానికి చేరుకుంది. అంటే మరో రెండు వారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుందన్న మాట. దీంతో టాప్- 5 కంటెస్టెంట్స్ ఎవరు? గ్రాండ్ ఫినాలేకి ఎవరు వెళతారు? బిగ్ బాస్ కప్పు ఎవరు కొడతారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఆరుగురితో గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ కూడా హోరా హోరీగా సాగాయి. ఈసారి షుగర్‌తో చేసిన సీసాని తల మీద కొట్టి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ మధ్య గట్టిగానే వార్ నడిచింది. ముందుగా ఇమ్మానుయేల్ రీతూ-డీమాన్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. అలానే భరణి.. సంజన, డీమాన్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. అలానే రీతూ ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం ఆరుగురు లిస్ట్‌లో చేరారు.
కాగా ముందు భరణి ముందు నామినేషన్స్‌లో లేడు. అయితే కళ్యాణ్‌కి ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్‌లో లేని మరొకరిని స్వాప్ చేసే పవర్ బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కళ్యాణ్.. ఇమ్మానుయేల్‌ని సేఫ్ చేసి ఆ ప్లేస్‌లో భరణిని నామినేషన్స్‌లో చేర్చినట్లు తెలిసింది. అలా ఇమ్మూ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. భరణి అడ్డంగా బుక్ అయ్యాడని తెలుస్తోంది. ఇక కెప్టెన్ గా ఉన్న కల్యాణ్ కూడా ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయినట్టే. వీరిద్దరు కాకుంండా తనూజ, భరణి, డిమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ్టి రాత్రి ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ రానుంది.
డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి..
ఇక ఈ వారం నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే రీతూ చౌదరి, సుమన్ శెట్టి డేంజర్ జోన్‌లో నిలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. రీతూకు బయటి నుంచి ఫ్యాన్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది.. కాబట్టి మరీ ముఖ్యంగా సుమన్ శెట్టి తన ఆట తీరును మెరుగుపర్చుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








