
‘అలేఖ్య చిట్టి పికిల్స్’ అంటూ పచ్చళ్ల బిజినెస్ తో బాగా ఫేమస్ అయ్యింది రమ్య మోక్ష. కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాలంటూ ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరలయ్యాయి. ఈ కారణంతోనే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది రమ్య మోక్ష. ఆ తర్వాత అదే క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి అడుగు పెట్టింది. ఈ బ్యూటీ మొదట హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు చాలా రోజుల పాటు ఉంటుందని భావించారు. కానీ అదేమీ జరగలేదు. తన నోటి దురుసుతో అనవసరంగా నెగెటివిటీని మూటగట్టుకుంది. ముఖ్యంగా హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ అయిన తనూజను టార్గెట్ చేసి ట్రోలింగ్ కు గురైంది. దీంతో నామినేషన్లలో నిలిచిన ఆమెకు ఓటింగ్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. తక్కువ ఓట్లు పడడంతో రెండు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కాగా హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేస్తోంది రమ్య. తాజాగా మరో సంచలన వీడియోను రిలీజ్ చేసింది పచ్చళ్ల పాప. ఇందులోనూ తనూజనే టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది రమ్య. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తనూజ ఒక గొడవను 24 గంటల పాటు సాగదీస్తుంది. ఎందుకంటే అరగంట సేపు మాట్లాడితే కేవలం ఫుటేజ్ రాదు కాబట్టి 24 గంటలు మాట్లాడితే ఎక్కువ ఫుటేజ్ వస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆమె ఆ ఏవిషయాన్నైనా రాద్దాంతం చేస్తుంది. నేను ఇప్పటికీ కూడా ఇదే మాట మీద ఉన్నాను. ఆవిడ బాగా నటిస్తుంది. తన ఒరిజినాలిటీ ఇంకా బయటకు రావడం లేదు. ఆడియన్స్ ఓటింగ్ వలన నేను బయటకు వచ్చేసాను అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. కేవలం తనూజ గురించి మాట్లాడినందుకే నాపై కక్ష గట్టారు. హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చేశారు. నేను ఆడియన్స్ ఓటింగ్ స్ ప్రకారం చూస్తే మూడు లేదా నాలుగో ప్లేస్ లో ఉన్నాను. నేను ఆవిడకు ఎదురు తిరిగాను, హౌస్ లో ఉంటే ఆవిడకు ఇంకా నెగెటివ్ గా మాట్లాడుతానని బిగ్ బాస్ హౌస్ నుంచి నన్ను బయటకు పంపించేశారు’ అని రమ్యమోక్ష తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తనూజ ఫ్యాన్స్ ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లు రమ్య తీరుందని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.