
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హోరా హోరీగా నడుస్తోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు తొమ్మిదో వారానికి చేరుకుంది. ఈ తొమ్మిది వారాల్లో చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అలాగే మరికొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. కంటెస్టెంట్ల ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, టాస్క్‌లతో ఉత్కంఠభరితంగా సాగుతోన్న బి గ్ బాస్ హౌస్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సడెన్ గా హౌస్ లోకి ఇద్దరు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రాగానే మేం ఎస్సైలం అని కంటెస్టెంట్స్ కు చెప్పారు. ఇప్పటివరకు హౌస్ లో ఎవరెవరు ఏమం దొంగతనం చేశారో అవన్నీ బయటకు తీయాలని హౌస్ మేట్స్ కు ఆర్డర్ వేశారు. హౌస్ లో ఉన్న ఇద్దరు డాన్ లను పట్టుకోవడానికే మేం ఇక్కడకు వచ్చామంటూ చెబుతారు. అదేంటి బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు రావడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 46వ రోజుకు సంబంధించి ఎపిసోడ్ ప్రోమోని
రిలీజ్ చేశారు. ఇందులో ఇద్దరు పోలీసులు హౌస్‌లోకి వచ్చినట్లుగా చూపించారు. అయితే ఆ పోలీసులు మరెవరో కాదు.. ఇంతకు ముందు సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన అమర్ దీప్ చౌదరి, అంబటి అర్జున్.
బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన అమర్ దీప్, అంబటి హౌస్‌లో జరిగిన దొంగతనాల గురించి ఆరా తీశారు. అన్ని గదులను క్షుణ్ణంగా సెర్చ్ చేశారు. ఈ క్రమంలో వంట గదిలో ఉండాల్సిన సామాగ్రి అంతా బెడ్ రూమ్‌లోనే ఉందేంటి? అని అమర్ దీప్ ఆశ్చర్యపోతూ ఒక్కొక్కటి బయటకు తీశాడు. ఎగ్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్.. ఇలా చాలానే అమర్ దీప్ చేతికి దొరికాయి. అయితే అందులో కొన్నింటినీ అతనే జేబులో పెట్టుకున్నాడు. మరి పోలీసులకు సంజన, మాధురీ దొరికారా? ఒకవేళ దొరికితే వాళ్లను ఏం చేశారు? అసలు అమర్ దీప్, అంబటి అర్జున్ హౌస్ లో ఎంత సేపు ఉన్నారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఇవాళ్టి (అక్టోబర్ 23) ఎపిసోడ్ చూడాల్సిందే.
House loki police lu vaccharoch, Ekkadi dongalu akkade gupchup 👁🚨
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/HclOZ3oTUh
— Starmaa (@StarMaa) October 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.