Bigg Boss Telugu 9: అందరికంటే ఎక్కువే.. ఆరు వారాల్లో బిగ్‌బాస్ ద్వారా భరణి ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?

చాలామంది అనుకున్నదే జరిగింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఆరో వారంలో భరణి శంకర్ బయటకు వచ్చేశాడు. ఆడియెన్స్ ఓట్లు తక్కువగా పడడం, ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్రను ఉపయోగించి రాము రాథోడ్ ను సేవ్ చేయడంతో భరణి ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.

Bigg Boss Telugu 9: అందరికంటే ఎక్కువే.. ఆరు వారాల్లో బిగ్‌బాస్ ద్వారా భరణి ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?
Bigg Boss Telugu 9

Updated on: Oct 20, 2025 | 11:37 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరో వికెట్ పడింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫినాలే వరకు ఉంటాడనుకున్న భరణి శంకర్ ఆరో వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. సుమారు వారాల పాటు ఆయన హౌస్‌లో కొనసాగారు. ఆదివారం (అక్టోబర్19) జరిగిన దీపావళి ఎపిసోడ్‌లో భరణి ఎలిమినేట్ అయ్యారంటూ నాగార్జున ప్రకటించారు. ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో నిలిచారు. ఒక్కొక్కరు సేఫ్ అవుతూ చివరికి భరణి, రాము రాథోడ్ నిలిచారు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్రను ఉపయోగించి భరణిని సేవ్ చేస్తాడేమోనని చాలా మంది భావించారు. అయితే అతను అనూహ్యంగా రామూ రాథోడ్ ను సేవ్ చేశాడు. దీనికి తోడు తక్కువ ఓట్ల పడడంతో భరణి హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. అయితే తను ఎలిమినేట్ అయినందుకు ఏమాత్రం బాధపడలేదు భరణి. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి హుందాగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ నుంచి భరణి ఎంత సంపాదించారన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.

అందరి కంటే ఎక్కువ గానే పారితోషికం..

కాగా ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భరణి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. చాలా మంది కంటెస్టెంట్లతో పోల్చుకుంటే అతనికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఒక వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్‌బాస్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌస్ లో ఉన్న 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే ఆయన అందుకున్నట్లు సమాచారం. కాగా పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో నటించాడు భరణి. సహాయక నటుడిగా, విలన్ గా ఆకట్టుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా అతను పెద్దగా తెరపై కనిపించడం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు అతనికి మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ బజ్ లో శివాజీ తో భరణి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.