బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ గా హౌస్లో అడుగుపెట్టగా ఆదివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 13 మంది మాత్రమే ఉన్నారు. కాగా ఎనిమిదో సీజన్ లో హౌస్ లోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్స్ లో కిరాక్ సీత ఒకరు. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఆమె బేబీ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందీ బోల్డ్ బ్యూటీ. కాగా బేబీ సినిమా అనంతరం కిర్రాక్ సీత పేరు ప్రముఖంగా వినిపించింది. వరుసగా ఇంటర్వ్యూలకు కూడా హాజరైంది. ఇదే సందర్భంలో తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలామందిలాగే సీతకు కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందట. ‘నా లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. అందుకే బేబీ మూవీ నాకు కనెక్ట్ అయిందేమో! ఐదేళ్ల పాటు నేను ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోలేదు. ప్రేమ కంటే పేరెంట్స్ ముఖ్యం కదా అని నేను కూడా నా ప్రేమను వదిలేశాను. ఒకరినొకరు మోసం చేసుకోవడం లాంటివి ఏమీ లేవు’
ఇక తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని కిరాక్ సీత ఓ సందర్భంలో ఓపెన్ అయ్యింది . ‘ఒక సినిమా ఆఫర్ ఉంది. రూ. 25 లక్షలు ఇస్తారు.. కాకపోతే నిర్మాతను కలవడానికి ఫామ్ హౌస్ కి వెళ్లాలి. ఫారిన్ ట్రిప్ కి కూడా వెళ్ళాలి అన్నారు. కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారన్న సందేహం కలిగింది. తర్వాత నాకు విషయం అర్థమైంది. నాకు ఆఫర్ వద్దని చెప్పేశాను’ అని సీత తన చేదు అనుభవాన్ని పంచుకుంది.
అంది కిర్రాక్ సీత.
కాగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో కిరాక్ సీత ఒకరు. టాస్కుల్లోనూ, గేమ్స్ లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. అలాగే మాటకు మాట బదులిస్తోంది. ఇదే బుల్లితెర ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.