Bigg Boss Season 7: కళ్లు బైర్లు కమ్మే టాస్క్‌ ! ‘ఎవ్వడూ సేఫ్ కాదు.. అందరూ మొదటికే.. దిస్ ఈజ్‌ ఉల్టా పుల్టా..’

| Edited By: Basha Shek

Oct 04, 2023 | 1:28 AM

ఆఫ్టర్.. హీటెడ్ నామినేషన్స్ అండ్‌ కంటెస్టెంట్స్‌ కత్తి పోట్స్... బీబీ7 తాజా ఎపిసోడ్ అంటే.. 31st ఎపిసోడ్ .. టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ సినిమాలా సాగింది. మాంచి మాస్‌ మసాలా మూవీ ఫీల్‌ని బీబీ లవర్స్‌కు ఇచ్చింది. మెళ్లిగా ఓ రొమాంటిక్ సీన్‌తో స్టార్ట్ అయిన 30th డే ఎపిసోడ్.. ఆ తరువాత కాస్త డ్రామాతో.. మధ్యలో ఇంటర్వెల్ ట్విస్ట్‌... ప్రీ క్లైమాక్స్‌ టాస్క్‌... క్లైమాక్స్‌ రిజెల్ట్‌తో ఎండ్‌ అయి.. 'ఏం ఫీల్ ఇచ్చింది మామా' అనే జాతి రత్నం డైలాగ్ అందరి నోటి నుంచి వచ్చేలా చేసింది.

Bigg Boss Season 7: కళ్లు బైర్లు కమ్మే టాస్క్‌ ! ఎవ్వడూ సేఫ్ కాదు.. అందరూ మొదటికే.. దిస్ ఈజ్‌ ఉల్టా పుల్టా..
Bigg Boss Season 7 Telugu
Follow us on

డాక్టర్‌ గౌతమ్‌ బాబు.. ఫెమినా మిస్ ఇండియా మధ్య ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్న ఓ రొమాంటిక్ కన్వర్ జేషన్తో మొదలైన బిగ్ బాస్ తాజా ఎపిసోడ్.. ఇంకో పక్క శివాజీ తనకు కాఫీ ఇవ్వలేదనే కామెంట్స్‌తో.. కంటిన్యూ అవుతుంది. అలా కాసాపు సుబ్బు డాక్టర్ బాబు రొమాంటిక్ మాటలతో.. శివాజీ రుసరుసలతో సాగి.. ఆ తరువాత బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్‌తో ప్రీ ఇంటర్వెల్ సీన్‌ బిగిన్ అవుతుంది.

అయితే ఆ ప్రీ ఇంటర్వెల్ సీన్‌ ముందే.. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలోని ‘సిలకా’ సాంగ్‌తో నిద్ర లేచిన బిగ్ బాస్ హౌస్‌మేట్స్.. డ్యాన్స్‌ తర్వాత గార్డెన్ ఏరియాలో కసరత్తులు చేస్తూ.. జరగబోయే ఉపద్రవాన్ని ఊహించకుండా ఎంజాయ్‌ చేస్తుంటారు. కట్ చేస్తే సీన్లోకి ఎంటర్ అయిన బిగ్ బాస్.. 5 వారాలుగా ఇమ్యూనిటీ ఇస్తూ.. మిమ్మల్ని కన్ఫర్డ్మ్‌ కంటెస్టెంట్స్‌ గా మార్చిన పవరాస్త్ర వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ.. దిమ్మతిరిగే మ్యాటర్ చెబుతారు. హౌస్‌లో కన్ఫర్డ్మ్‌ సభ్యులైన శోభ, సందీప్ మాస్టర్, ప్రశాంత్ దగ్గర ఉన్న వారి వారి పవరాస్త్రను.. యాక్టివిటీ రూమ్‌లో ఉన్న ఓ బాక్స్‌లో పెట్టాలని ఆదేశిస్తాడు.

దీంతో షాక్‌లో బిత్తరపోయిన హౌస్‌ మెంబర్స్‌ .. ఆ నెక్ట్స్ ఏమవుతుందా అని ఆలోచించే లోపు.. ఈ సారి దిమ్మతిరిగే ట్విస్ట్‌ తో సీన్లోకి ఎంట్రీ ఇస్తారు బిగ్ బాస్. ఇక నుంచి హౌస్లో కన్ఫర్డ్మ్‌ సభ్యులుగా ఎన్నుకునేది బయట ఉన్న ప్రజలే అని.. ఇక నుంచి బీబీ హౌస్‌లో ఉన్న సభ్యులందరూ.. జస్ట్ కంటిస్టెంట్స్ అంటూ.. చెబుతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకవుతారు. అందులోనూ.. శోభ అందరికంటే ఎక్కువగా షాకవుతంది. ఎందుకుంటే.. అంతకు ముందు సీన్లో.. పవరాస్త్రను బిగ్ బాస్ కు ఇచ్చినా కూడా.. తాను కన్పర్డ్మ్‌ సభ్యురాలినే అని అనుకుంటుంది కనుక. ఇలా తెలుగు సినిమాలో కిక్కిచ్చే ఇంటర్వెల్లా.. ఈ ఎపిసోడ్‌లోని ఈ పాయింట్‌ను సెట్ చేశాడు బిగ్ బాస్.

ఇవి కూడా చదవండి

ఇక ఆ తరువాత హౌస్‌లో ఉన్న సభ్యులను.. ఇద్దరిద్దరిగా.. విడిపోవాలని ఆదేశిస్తాడు బిగ్ బాస్. మీ బడ్డీలుగా.. మీకు వెన్నుదన్నుగా నిలిచే వాళ్లను.. మీ.. మీ.. పెయిర్‌గా చేసుకోవాలని.. ఈ నిర్ణయం..మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది చెబుతాడు బిగ్ బాస్. దీంతో చాలా డిస్కషన్స్ మధ్య.. సుబ్బు, గౌతమ్‌ ఒక పెయిర్‌గా.. శివాజీ, ప్రశాంత్ ఒక పెయిర్‌గా.. ప్రిన్స్ యావర్, తేజ ఒక పెయిర్‌గా.. మారుతారు. అయితే అమర్, ప్రియంక.. సందీప్, శోభ పెయిర్‌ అవుదామని మొదట అనుకున్నప్పటికీ కాస్త షాకింగ్గా.. సందీప్‌, అమర్ ఒక పెయిర్‌గా.. ప్రియాంక శోభ ఒక పెయిర్గా మారుతారు.

హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ అందరూ .. పెయిర్ అయిన తర్వాత.. మళ్లీ లైన్లోకి వచ్చిన బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌ ముందు మరో టాస్క్‌ ఇస్తాడు. బిగ్ బాస్ గేమ్ చేంజ్‌ అయిందంటూనే.. ఈ సీజన్‌లో మొట్టమొదటి కెప్టెన్ టాస్క్‌కు.. సూపర్ ఇమ్మూనిటీని పొందడానికి రెడీ అవ్వాలని.. జట్లుగా టాస్క్‌లో పోరాడి విజయం సాధించాలని చెబుతాడు. అలా విజయం సాధించిన వాళ్లే కెప్టెన్ పోరులో ముందుంటారని చెబుతారు.

గెలిపించేది మీ నవ్వే.. అనే పేరుతో.. కంటెస్టెంట్స్‌కి ఈ సీజన్ మొట్టమొదటి కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చిన బిగ్ బాస్..ఈ టాస్క్లో భాగంగా.. బడ్డీ జట్ల ముందు ఉన్న స్మైలీ బోర్డ్‌లో మిస్సైన పళ్లను పెట్టాలని..ఆ మిస్‌ అయి టీత్.. యాక్టివిటీ రూంలో ఉన్న పిట్‌లో ఉంటాయని చెబుతాడు. అయితే పిట్‌లో ఉన్న టీత్‌ కోసం.. జిగురుగా ఉన్న స్లైమ్ అండ్ ఫెదర్స్ తో పిట్‌లలోంచి పాకుతూ వెళ్లాలని చెబుతాడు. ఇది రిలే గేమ్‌ అని.. ఒక్క సారి ఒక్క టీత్ మాత్రమే తీసుకురావాలని.. టీత్‌ కంటెస్టెంట్స్ ముందు ఉన్న బోర్డ్‌లో పెట్టాక ఇంకో పెయిర్‌లో ఉన్న మరొకరు వెళ్లాలన సూచిస్తాడు. అలా ఎవరైతే ఈ గేమ్‌ ను ముందుగా ఫినిష్ చేసి బెల్ మోగిస్తాడో.. వాళ్లకు స్టార్స్ ఇస్తామని చెబుతాడు బిగ్ బాస్..

అయితే రసవత్తరంగా.. హోరా హోరీగా.. జరిగిన ఈ పోరులో.. మొదటగా శివాజీ అండ్ ప్రశాంత్ పెయిర్ తమ టీత్‌ అన్నీ తీసుకొచ్చి బెల్ కొట్టినప్పటికీ.. టీత్‌ రివర్స్‌లో పెట్టారనే కారణంతో రిమైనింగ్ కంటెస్టెంట్స్‌కు టార్గెట్ అవుతారు. దానికితోడు ఈ గేమ్‌లో శివాజీ కూడా ఇంజూరీ అవుతారు.

ఆ తరువాత స్మైల్‌ ఫినిష్ కాకుండానే.. బెల్‌ కొట్టిన సందీప్, అమర్‌.. ఆ తర్వత గేమ్ ఫినిష్‌ చేసినా.. ఈ కారణంగా టార్గెట్ అవుతారు. ఎక్స్‌స్ట్రా టీత్ తీసుకొచ్చి తమకేమీ తెలియనట్టు సుబ్బు పడేయడంతో.. సుబ్బు, గౌతమ్‌ కూడా రిమైనింగ్ కంటెస్టెంట్‌కు టార్గెట్ అవుతారు. సుబ్బు పడేసిన టీత్‌తో గేమ్‌ ఫినిష్ చేశారు కాబట్టి.. శోభ, ప్రియాంక కూడా టార్గెట్ అవుతారు. ఒక తేజ టాస్క్‌లో ఎలాగూ స్లో కాబట్టి.. ప్రిన్స్ యావర్స్ చేసేదేం లేక .. అరుస్తూ అందర్నీ గమనిస్తుంటారు. ఎలాగూ శోభతో పాటు.. ప్రిన్స్ కూడా సంచాలకే కనుక.. వీళ్లందరూ.. ఎవరికి వారు తామే విన్నర్స్.. అవతలి వాళ్లు ఫౌల్’ అంటూ.. వాదిస్తూ పట్టించుకోకుండా ఓ నిర్ణయం తీసుకుంటాడు. రెండు మూడు నిర్ణయాల తరువాత ఓ రెండు సార్ల అనౌన్స్ మెంట్ తర్వాత.. ఫైనల్‌గా.. ఫస్ట్ ప్లేస్‌ గౌతమ్‌ సుబ్బులకి ఇస్తాడు ప్రిన్స్. ఇక సెకండ్ ప్లేస్‌ అయిస్టంగానే.. అమర్ , సందీప్ పోరు బరించలేక వాళ్ల కిస్తుంది శోభ. థర్డ్ ప్లేస్ శివాజీ, ప్రశాంత్‌కి కేటాయించి.. ఫోర్త్‌ ప్లేస్ పెద్ద మనసు చేసుకుని ప్రియాంక తనే అంటూ చెబుతుంది. ఎలాగూ టాస్క్‌ ఫినిష్ చేయలే కనుక.. ప్రిన్స్ యావర్ అండ్ తేజ లాస్ట్ అంటూ.. చెబుతుంది. ఇక ఈ క్లైమాక్స్‌ సీన్‌తోనే.. మాంచి కిక్కిచ్చే టాలీవుడ్ సినిమాలా.. ఈరోజు బీబీ ఎపిసోడ్‌కి శుభం కార్డ్ పడుతుంది.

సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి