Bigg Boss Season 6 : బిగ్‏బాస్ ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. గీతూ.. రేవంత్ మధ్య వార్..

|

Oct 24, 2022 | 8:33 PM

ముఖ్యంగా గీతూ, రేవంత్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తోంది. గీతూ మాటలతో ఏకంగా రేవంత్ సహనం కోల్పోయాడు.

Bigg Boss Season 6 : బిగ్‏బాస్ ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. గీతూ.. రేవంత్ మధ్య వార్..
Bigg Boss
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 6 ఏడో వారం అర్జున్ కళ్యామ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక సోమవారం నామినేషన్స్ రచ్చ షురు అయ్యింది. ఈవారం హౌస్మేట్స్ మధ్య తారాస్థాయిలో మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా గీతూ, రేవంత్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తోంది. గీతూ మాటలతో ఏకంగా రేవంత్ సహనం కోల్పోయాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో..తాము నామినేట్ చేస్తున్న వ్యక్తి ఫోటో మంటలో వేయాలని సూచించాడు బిగ్‏బాస్ . ఈ క్రమంలోనే హౌస్మేట్స్ మధ్య వాగ్వదం జరిగినట్లగా తెలుస్తోంది. ముందుగా.. రేవంత్ సెకండ్ నామినేషన్ గీతూ అని చెప్పగా.. ఏం లేదు అని రేవంత్ అనగా.. ఏం లేనప్పుడు ఎందుకు నామినేట్ చేయడం గీతూ అనగా.. నా దగ్గర నీ వెటకారాలు వేరే వాళ్ల దగ్గర చూపించు అంటూ కౌంటర్ ఇచ్చాడు రేవంత్.

ఇక ఆ తర్వాత ఫైమా.. మెరీనాను నామినేట్ చేస్తూ.. గేమ్ చాలా తక్కువ ఉందని తెలిపింది. తోయడం తప్పు అంటే గేమే అది అంటూ సూర్య.. వాసంతికి క్లారిటీ ఇచ్చాడు. ఇక నీకు నామినేషన్స్ పాయింట్స్ దొరక్కా.. అందరూ రేవంత్ వేస్తున్నారు మనము వేద్దామని వేసేది మీరు అంటూ కీర్తిని నామినేయ్ చేశాడు రేవంత్. ఆ తర్వాత గీతూ.. రేవంత్ మధ్య ఎక్కువగానే గొడవ జరిగింది.

ముందు నువ్వు రూల్స్ పాటించవు.. మొదటి రోజు నుంచి నువ్వే రూల్స్ పాటించలేదు అంటూ గీతూ ఫైర్ అవ్వగా.. నీకు నువ్వ గొప్ప అనే ఫీలింగ్ తో ఉంటావు. అది తగ్గించుకో అనగా.. నాకు నేనే గొప్ప అంటూ రివర్స్ కౌంటరిచ్చింది గీతూ. దీంతో ఏం పీకలేవు అంటూ వెళ్లిపోయాడు రేవంత్. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఇంట్లో హీట్ పెంచినట్లుగా తెలుస్తోంది. ఇక ఎనిమిదవ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు.. బాలాదిత్య, ఆదిరెడ్డి, గీతూ, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, మెరీనా, రాజశేఖర్, రోహిత్, వాసంతి నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.