Inaya Sultana: ప్రియుడిని పరిచయం చేసిన బిగ్‍బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..

ఇప్పటివరకు తెలుగులో ఏడు సీజన్స్ కంప్లీట్ కాగా.. త్వరలోనే సీజన్ 8 స్టార్ట్ కానుంది. ఈసారి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. పలువురి పేర్లు అటు సోషల్ మీడియాలోనూ వినిపిస్తున్నాయి. ఈసారి కూడా సీరియల్ నటీనటుల సంఖ్య ఎక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గతంలో బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా ఫేమస్ అయిన బ్యూటీ ఇనయా సుల్తానా.

Inaya Sultana: ప్రియుడిని పరిచయం చేసిన బిగ్‍బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..
Inaya Sultana
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 09, 2024 | 6:38 PM

బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. షార్ట్ ఫిల్మ్స్, మూవీస్, సీరియల్స్ ద్వారా నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నవారిని జనాలకు మరింత దగ్గర చేసింది బిగ్‏బాస్ రియాల్టీ షో. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ ఈషోకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటివరకు తెలుగులో ఏడు సీజన్స్ కంప్లీట్ కాగా.. త్వరలోనే సీజన్ 8 స్టార్ట్ కానుంది. ఈసారి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. పలువురి పేర్లు అటు సోషల్ మీడియాలోనూ వినిపిస్తున్నాయి. ఈసారి కూడా సీరియల్ నటీనటుల సంఖ్య ఎక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గతంలో బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా ఫేమస్ అయిన బ్యూటీ ఇనయా సుల్తానా.

బిగ్‏బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నెట్టింట యాక్టివ్ గా ఉంటుంది. అటు ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. తాజాగా తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని బయటపెట్టింది. ఈసారి ఏకంగా ప్రియుడిని కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం ఇనయ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

తాజాగా ఓ వ్యక్తితో క్లోజ్ గా ఫోటోస్ దిగిన వీడియోను వీడియోను షేర్ చేసింది. అతడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి. యోగా ట్రైనర్. జిమ్ కోచ్ అని ఇన్ స్టాలో బయో చూస్తే తెలుస్తోంది. గతంలో జిమ్ లో ఏర్పడిన వీళ్ల పరిచయం ప్రేమగా మారిందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇనయ షేర్ చేసిన వీడియో పై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.