Bigg Boss Keerthi Bhat: కష్టాలు వర్షంలా కురిస్తే.. చిరునవ్వు అనే గొడుగు అడ్డుపెట్టండి.. కీర్తి.. యూ ఆర్ ట్రూ ఫైటర్

కీర్తి.. నిజంగా నువ్వు చాలామందికి ఆదర్శం. ఓ పడి లేచిన కెరటం. విధిని ఎదిరించి నిలబడిన ధీరత్వం. శతకోటి కష్టాలకు కూడా చిరునవ్వుతో మంత్రం వేసే ఈ మనస్తత్వం.. ఎంతో ఉన్నతం.

Bigg Boss Keerthi Bhat: కష్టాలు వర్షంలా కురిస్తే.. చిరునవ్వు అనే గొడుగు అడ్డుపెట్టండి.. కీర్తి.. యూ ఆర్ ట్రూ ఫైటర్
Bigg Boss Keerthi Bhat
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 02, 2022 | 11:01 AM

బిగ్ బాస్ ఈ సీజన్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఎందుకంటే గత సీజన్లలోని సభ్యులకు కనీసం సమీపంగా కూడా ఇప్పుడు కంటెస్టెంట్స్ ఆట ఆడలేదు. అతి చేసిన గీతూ అర్థాంతరంగా వెళ్లిపోయింది. ఈ మైండ్ గేమ్ తనకొద్దంటూ చంటి నిష్క్రమించాడు. మంచితనాన్ని మోసిన.. బాలాదిత్యకు మధ్యలోనే బ్యాగ్ ఇచ్చి పంపేశారు. చాలావరకు నెట్టుకొచ్చిన రాజ్.. గత వారం బయటకొచ్చాడు. మధ్యలో వెళ్లినవారి గురించి పెద్దగా మాట్లాడాల్సింది కూడా ఏమి లేదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఓ ఫైటర్ గురించి. అవును.. ఆమే కీర్తి. షి ఈజ్ ట్రూ ఫైటర్. తన బాధలు వింటే.. లైఫ్‌లో ఎప్పుడూ ఏడవని వ్యక్తికి కూడా దు:ఖం తన్నుకువస్తుంది. తను ఫ్యామిలీతో ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. కన్ను తెరిచి చూసేవారికి.. అయినవాళ్లు(అమ్మ, నాన్న, అన్నవదిన, వారి పాప) మాంసం ముద్దలుగా మారిపోయారు. అయినవాళ్లు లేరు. పిల్లలు పుట్టే అవకాశాన్ని(గర్భసంచి) కూడా ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఆమె ఓ బిడ్డను పెంచుకుంటే.. ఆ బిడ్డ కూడా అనారోగ్య కారణాలతో పై లోకానికి వెళ్లిపోయింది.

యాక్సిడెంట్‌కు సంబంధించి… ఇప్పటికీ ఆమె ఒంట్లో ఎన్ని ప్లేట్లు, ఎన్ని స్క్రూలు ఉన్నాయో తెలియదు. బంధువులంతా సైడయ్యారు.  భగవంతుడా.. ఓ మనిషికి నిజంగా ఇన్ని కష్టాలు పెడతావా..?  రోజుకో కష్టం. నిత్యం నరకం. అయినా ముందుకు సాగింది. నిర్వేదం. నిస్తేజం. చేతిలో డబ్బుల్లేవు. తిండి లేదు. కుక్కకు వేసిన బ్రెడ్ తిని ఓ పూట ఆకలిని తీర్చుకుంది. కనీసం ఏడిస్తే ఓదార్చే మనిషి కూడా లేడు.  గుండెల నిండా ఆవేదన ఉన్నా.. కెమెరా ముందుకు వచ్చి నటించింది. నవ్వులు చిందించింది. సీరియల్ నటిగా సాగుతూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ ఫేమ్‌తోనే బిగ్ బాస్ సీజన్ 6లో ఎంటరయ్యింది.

ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. తను ఈ బిగ్ బాస్ షోలో విన్నర్ అవుతుందా లేదా పక్కనపెట్టండి. షీ ఈజ్ విన్నర్ ఇన్ లైఫ్. ఎంతో మందికి ఆదర్శం. పడి లేచిన కెరటం. ఇదేం సింపతీతో చెప్తున్న మాటేం కాదు. స్కామర్స్, గేమర్స్ మధ్యన ఇప్పటివరకు నెవర్ గివప్ అనే మోడ్‌లో ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తుంది ఆమె. ఫైనలిస్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతరులపై ఫేవరిజం చూపించేవాళ్లు, వెనక నుంచి పొడిచేవాళ్లు మధ్య తను సింగిల్‌గా చేస్తున్న ఫైట్ మాత్రం న భూతో న భవిష్యతి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఓ శాడ్ స్టోరీ ఉంటుంది. ఆ ఫేజ్‌ తర్వాత కూడా ఇంత స్ట్రాంగ్‌గా నిలబడేవాళ్లు నిజంగా గ్రేట్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..