Bigg Boss 7 Telugu: ఓటింగ్‏లో రైతు బిడ్డ సంచలనం.. సీరియల్ బ్యాచ్‏కు చుక్కలు.. డేంజర్ జోన్‏లో ఆ ముగ్గురు..

|

Sep 14, 2023 | 3:31 PM

ఒక్క ఛాన్స్ కావాలని అడిగి వచ్చాక చేస్తుందేంటీ ?.. ప్రతిసారి రైతు బిడ్డ, రైతు బిడ్డా అంటూ ట్యాగ్ వాడుతున్నావంటూ మూకుమ్మడి దాడి చేశారు. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టిలు ప్రశాంత్ పై మాటలతో విరుచుకపడగా.. మరోవైపు రతిక ప్లేట్ తిప్పేసింది. మొదటి నుంచి ప్రశాంత్‏ను పిచ్చోడిని చేసిన రతిక.. నామినేషన్స్ తన అసలు రూపం బయటపెట్టేసింది

Bigg Boss 7 Telugu: ఓటింగ్‏లో రైతు బిడ్డ సంచలనం.. సీరియల్ బ్యాచ్‏కు చుక్కలు.. డేంజర్ జోన్‏లో ఆ ముగ్గురు..
Bigg Boss 7 Telugu
Follow us on

రైతు బిడ్డను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బిగ్‏బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. కానీ వెళ్లిన మొదటి రోజు నుంచి రతిక వెంటపడి తన పరువు తీసుకున్నాడు. అది నా పిల్ల అంటూ అతిగా బిహేవ్ చేయడం.. సిగ్గు పడిపోవడం.. కిందపడ్డ అన్నం మెతుకులను తీసుకుని తినడంతో హౌస్ లో సింపథి డ్రామా ప్లే చేస్తున్నాడని ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఇదే విషయం అటూ ఇంట్లో వాళ్లు పసిగట్టేశారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్‏ను కడిగిపారేశారు. ఒక్క ఛాన్స్ కావాలని అడిగి వచ్చాక చేస్తుందేంటీ ?.. ప్రతిసారి రైతు బిడ్డ, రైతు బిడ్డా అంటూ ట్యాగ్ వాడుతున్నావంటూ మూకుమ్మడి దాడి చేశారు. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టిలు ప్రశాంత్ పై మాటలతో విరుచుకపడగా.. మరోవైపు రతిక ప్లేట్ తిప్పేసింది. మొదటి నుంచి ప్రశాంత్‏ను పిచ్చోడిని చేసిన రతిక.. నామినేషన్స్ తన అసలు రూపం బయటపెట్టేసింది.

అయితే అమర్ దీప్ హద్దు మీరి అరేయ్, రారా అంటూ పిలిచినా అన్నా అంటూ మర్యాదగా మాట్లాడాడు ప్రశాంత్. ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సీరియల్ బ్యాచ్ తీసిన పాయింట్స్ కరెక్టే… అందుకు వాళ్లు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. దీంతో ఇప్పుడు అడియన్స్ ప్రశాంత్ ను హీరోను చేసేశారు. మంగళవారం రాత్రి ఓటింగ్ లైన్స్ ప్రారంభం కాగా.. రైతు బిడ్డకు సపోర్ట్ చేశారు అడియన్స్. అలాగే ప్రశాంత్ పై వల్గర్ కూతలు కూసిన సీరియల్ నటుడు అమర్ దీప్, శోభాశెట్టి సీరియల్ బ్యాచ్ మొత్తానికి ప్రేక్షకులు చుక్కలు చూపించారు.

ఇవి కూడా చదవండి

తొలి రోజు ఓటింగ్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍కు అత్యధిక ఓట్లు వచ్చాయి. దాదాపు 42 శాతం ఓటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. నామినేషన్స్ హిట్ తర్వాత అతని గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అటు అమర్ దీప్ కు కేవలం 16 శాతం ఓట్లు పడ్డాయి. ఇందుకు కారణం లేకపోలేదు. నామినేషన్స్ చేసే సమయంలో రైతులు, బీటెక్ స్టూడెంట్స్ అంటూ అనవసరమైన వాదన తీసుకువచ్చాడు అమర్ దీప్. అలాగే ప్రశాంత్ పైకి కళ్లెర చేయడం… పళ్లు బిగపట్టి అరేయ్, రేయ్ అంటూ పిలవడం అమర్ దీప్ కు మైనస్ అయ్యాయనే చెప్పాలి. ఇక శివాజీకి 21 శాతం ఓట్లు పడ్డాయి. ఇక కార్తీకదీపం మోనిత అలియాస్ శోభాశెట్టి మాత్రం 02 శాతం ఓట్లు వచ్చాయి.

ఇక ప్రశాంత్ ను పిచ్చోడిని చేసిన రతికకు అడియన్స్ 4 శాతం ఓటింగ్ ఇవ్వగా.. గౌతమ్ కృష్ణకు 3 శాతం ఓటింగ్ వచ్చింది. ఇక ప్రిన్స్ యావర్ కు 8 శాతం.. షకీలాకు 2 శాతం.. టేస్టీ తేజాకు 2 శాతం ఓటింగ్ వచ్చింది. చివరి స్థానంలో టేస్టీ తేజా, షకీలా, శోభాశెట్టి ఉన్నారు. అయితే ఈ వారం ఎక్కువగా డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం టేస్టీ తేజ, షకీలా. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.