Bigg Boss 7 telugu: రతికను మర్చిపోలేకపోతున్న రైతు బిడ్డ.. స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన బ్యూటీ..

|

Oct 05, 2023 | 10:13 PM

బిగ్‏బాస్ గేమ్ వరకే కాకుండా ఆమెను పర్సనల్ అటాక్ చేస్తూ నెట్టింట దారుణంగా ట్రోలింగ్ చేశారంటే రతికపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉండేదో చెప్పక్కర్లేదు. మొత్తానికి నాలుగో వారం ఈ బ్యూటీని ఎలిమినేట్ అయ్యేలా చేశారు అడియన్స్. టైటిల్ ఫేవరేట్ అంటూ బిగ్‏బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది రతిక. మొదటి వారం క్యూట్ లుక్స్‏తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇక అదే వారం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‏తో క్లోజ్ గా ఉండడం.. అతడిని ప్రేమ పిచ్చోడిని చేసేసింది.

Bigg Boss 7 telugu: రతికను మర్చిపోలేకపోతున్న రైతు బిడ్డ.. స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన బ్యూటీ..
Rathika Rose
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7లో అందరి కంటే ఎక్కువ నెగిటివిటీని మూటగట్టుకుంది కేవలం రతిక మాత్రమే. ఎంతలా అంటే ఆమె ఎలిమినేట్ కావాలని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. బిగ్‏బాస్ గేమ్ వరకే కాకుండా ఆమెను పర్సనల్ అటాక్ చేస్తూ నెట్టింట దారుణంగా ట్రోలింగ్ చేశారంటే రతికపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉండేదో చెప్పక్కర్లేదు. మొత్తానికి నాలుగో వారం ఈ బ్యూటీని ఎలిమినేట్ అయ్యేలా చేశారు అడియన్స్. టైటిల్ ఫేవరేట్ అంటూ బిగ్‏బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది రతిక. మొదటి వారం క్యూట్ లుక్స్‏తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇక అదే వారం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‏తో క్లోజ్ గా ఉండడం.. అతడిని ప్రేమ పిచ్చోడిని చేసేసింది. ఇక రెండో వారంలోనే అతడిని నామినేట్ చేస్తూ షాకిచ్చింది. రతిక దెబ్బకు రైతు బిడ్డ నోరెళ్లబెట్టేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ తో ఉంటూనే టైమ్ వచ్చినప్పుడల్లా అతడిని మాటల దాడి చేసింది.

ముఖ్యంగా ప్రశాంత్ ను టార్గెట్ చేయడం.. ఆ తర్వాత వెంటనే యావర్ తో పులిహోర కలపడం.. తిరిగి అతడికే వెన్నుపోటు పొడవడం రతికకు మైనస్ అయ్యాయి. అంతేకాకుండా అనవసర విషయాల్లో తలదూర్చి రాద్ధంతం చేయడం.. ప్రతి చిన్నదానిని సాగదీస్తూ ఇంటి సభ్యులకు తలనొప్పిగా మారింది. రతిక ఆటలో మొదటి వారం పల్లవి ప్రశాంత్, రెండవ వారం యావర్, ఇక మూడవ వారం శివాజీ బలయ్యారు. ముఖ్యంగా నాలుగో వారం అమర్ దీప్ తో కలిసి పల్లవి ప్రశాంత్ మానసిక టార్చర్ చేసింది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేశారు అడియన్స్. బిగ్‏బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రతిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో పాల్గొనలేదు. తాజాగా ఆమె ఇన్ స్టా ఖాతాలో పల్లవి ప్రశాంత్, శివాజీ గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

Rathika Rose Instagram

రతిక ఇన్ స్టా స్టోరీలో…

ప్రశాంత్: అన్నా.. నీకు రతిక గుర్తుకు వస్తుందా ?.. నాకు రాత్రి తెగ గుర్తుకు వచ్చిందన్నా.. నిద్ర పట్టలేదు.

శివాజీ: నాకు గుర్తుకు వచ్చింది కానీ.. ఏం చేస్తాం రా. చిన్న పిల్ల.

ప్రశాంత్: అది చిన్న పిల్ల ఏందీ అన్నా.. బర్రె పిల్ల. మస్త్ కోపం వస్తుంది అన్నా..

శివాజీ: బయటకు వెళ్లాక కలుద్దాం లే రా. నువ్వు బాధ పడకు. నాకు అర్థం అయ్యింది నీ బాధ.

ప్రశాంత్: రెండు మేక పోతులు తినిపించి చంపేస్తా అన్న దానిని.. నా మీద ఎందుకు అన్న అంత కోపం. నేను ఏం చేసిన అన్న. నామినేషన్ చేసినా కూడా మన అమ్మాయే కదా అని మాట్లాడిన నన్ను నమ్మలేదు అన్న తను.

శివాజీ: చిన్న పిల్ల రా. వదిలేయ్.

ప్రశాంత్: నన్ను కలవదు అన్నా. బయటకు పోయాక..

ఇలా ప్రశాంత్, శివాజీ మాట్లాడుకున్నారంటూ రతిక పోస్ట్ చేస్తూ.. ‘సో స్వీట్.. నేను కూడా వాళ్లను మిస్ అవుతున్నాను’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రతిక చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్స్ తీసి నెట్టింట షేర్ చేస్తున్నారు నెటిజన్స్. హౌస్ లో ఉన్నప్పుడు వాళ్లతో గొడవలు పెట్టుకుని..బయటకు వచ్చేముందు కనీసం వాళ్లను చూడకుండా వచ్చేసి ఇప్పుడు మిస్ అవుతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.