బిగ్ బాస్ ఏడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ఫినాలే వీక్ జరుగుతోంది. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలేకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శివాజి, ప్రియాంక, ప్రశాంత్, యావర్, అర్జున్, అమర్‌దీప్‌లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు ఎప్పటిలాగే టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలను గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించనున్నారు. ఈ సంగతి పక్కన పెడితే గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు కంటెస్టెంట్లే అడుగుపెడతారని తెలుస్తోంది. అంటే ఒకరు వారం మధ్యలోనే హౌజ్ నుంచి బయటకు వెళ్లనున్నారన్నమాట. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కోసం రెండు వారాల క్రితమే ఓటింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ, అలాగే కంటెస్టెంట్స్ ఫోన్ నంబర్‌కు మిస్ డ్ కాల్ ఇవ్వడం ద్వారా మనకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు ఓటు వేయవచ్చు. గ్రాండ్ ఫినాలే కావడంతో భారీగా ఓటింగ్ నమోదవుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఎప్పటిలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. గత రెండు రోజులుగా ఓట్ల తగ్గినా అతని స్థానంపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ప్రస్తుతం అతని ఖాతాలో 35 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి.
ఇక నిన్నటివరకు అట్టడుగు స్థానంలో ఉన్న ప్రిన్స్ యావర్ అనూహ్యంగా రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. ప్రిన్స్‌కు సుమారు 18 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక 15 శాతం ఓట్లతో బిగ్ బాస్ పెద్దన్న శివాజీ మూడో ప్లేస్‌కు వచ్చేశాడు. అలాగే అంబటి అర్జున్ కూడా నాలుగో స్థానానికి దూసుకొచ్చాడు. అర్జున్ ఖాతాలో 13 శాతం ఓట్లు ఉన్నాయి. నిన్నటి వరకు బిగ్ బాస్ టైటిల్ రేసులో ఉన్న అమర్ దీప్ ఇప్పుడు ఏకంగా ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ సీరియల్ బ్యాచ్ లీడర్‌కు ఇప్పటివరకు 12 శాతం ఓట్లు పడ్డాయి. ఇక కన్నడ బ్యూటీ ప్రియాంక జైన్ ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఓటింగ్‌కు ఇంకా రేపటి వరకు సమయం ఉన్నందునా ఏదైనా జరుగవచ్చని ఆడియెన్స్ అంటున్నారు. డేంజర్ జోన్‌లో ఉన్న అమర్ దీప్ సేవ్ అవ్వోచ్చని.. దీంతో ప్రియాంక, అర్జున్‌లలో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.