Bigg Boss 7 Telugu: అశ్విని ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా ..
ఇంట్లో ఉన్న సభ్యులను నామినేట్ చేసేందుకు తన దగ్గర కారణాలు ఉన్నాయని ముందే శోభాతో డిస్కస్ చేసింది అశ్విని. కానీ నామినేషన్స్ ప్రక్రియలో మాత్రం తన వద్ద రీజన్స్ లేవంటూ చేత్తులేసింది. దీంతో ఆమెను పలుమార్లు హెచ్చరించిన బిగ్‌బాస్ .. సెల్ఫ్ నామినేట్ అయిపోతారని చెప్పాడు. అయినా సరే అంటూ ఒప్పుకుంది. దీంతో ఈ వారం సెల్ఫ్ నామినేట్ అయ్యింది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో శనివారమే ఓ ఎలిమినేషన్ జరిగిపోయింది.
బిగ్‌బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది అశ్విని. దాదాపు ఐదు వారాల తర్వాత ఆమె బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లింది. అయితే వెళ్లినప్పటి నుంచి సీరియల్ బ్యాచ్‌కు ఈమెకు అస్సలు పడలేదనే చెప్పాలి. అంతేకాకుండా ప్రతివారం నామినేట్ అవుతూ ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లొచ్చింది. కానీ పన్నేండవ వారం మాత్రం సెల్ఫ్ నామినేట్ అయ్యింది. ఇంట్లో ఉన్న సభ్యులను నామినేట్ చేసేందుకు తన దగ్గర కారణాలు ఉన్నాయని ముందే శోభాతో డిస్కస్ చేసింది అశ్విని. కానీ నామినేషన్స్ ప్రక్రియలో మాత్రం తన వద్ద రీజన్స్ లేవంటూ చేత్తులేసింది. దీంతో ఆమెను పలుమార్లు హెచ్చరించిన బిగ్‌బాస్ .. సెల్ఫ్ నామినేట్ అయిపోతారని చెప్పాడు. అయినా సరే అంటూ ఒప్పుకుంది. దీంతో ఈ వారం సెల్ఫ్ నామినేట్ అయ్యింది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో శనివారమే ఓ ఎలిమినేషన్ జరిగిపోయింది. అతి తక్కువ ఓటింగ్ రావడంతో నిన్ననే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అశ్విని. అయితే ఇప్పుడు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అశ్విని.. హౌస్ లో మొత్తం ఏడు వారాలు ఉంది. వారానికి రూ.2 లక్షల చొప్పున దాదాపు రూ.14 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వచ్చిన వారిలో అశ్విని ఎక్కువ మొత్తం అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఐదురుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాగా.. అందులో అశ్విని ఒకరు. ఇప్పుడు ఇంట్లో కేవలం అర్జున్ మాత్రమే ఉన్నాడు. అయితే అశ్విని సెల్ఫ్ నామినేట్ కావడానికి కారణం ఇంట్లో ఉండడం ఇష్టం లేకే అని టాక్ నడిచింది.
View this post on Instagram
వెళ్లినప్పటి నుంచి ఇంట్లో వాళ్లతో ఎక్కువగా కలవలేకపోయింది. తనతో ఎవరు మాట్లాడట్లేదని సీరియల్ బ్యాచ్ తో గొడవ పెట్టుకుంది. ఇక రాగానే ప్రియాంకతో మొదలైన గొడవ మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చేవరకు సాగింది. ఇద్దరు ఉప్పు, నిప్పులా కనిపించారు. ఇక ఇప్పుడిప్పుడే శోభాతో తనకు స్నేహం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. అంతుకు ముందు ఎక్కువగా భోలేతో ఉండేది అశ్విని. కానీ భోలే వెళ్లిన తర్వాత అశ్విని ఒంటరి అయిపోయింది. ఆ తర్వాత మెల్లగా శివాజీ, ప్రశాంత్, గౌతమ్ తో క్లోజ్ అయ్యింది. ఇక ఈరోజు ఆదివారం అశ్వినిని స్టేజ్ పైకి పిలవనున్నారు నాగ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.