Bigg Boss 7 Telugu: ‘దయచేసి ఆపండి.. నా కొడుకును బ్యాడ్ చేస్తున్నారు’.. ట్రోలింగ్ పై అమర్‌దీప్ తల్లి ఆవేదన..
మాటలు, సినిమా డైలాగ్స్ తప్ప ఆట లేదంటూ ఇప్పటికే నెట్టింట అమర్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఏం చేసినా అమర్ దీప్ కు నచ్చడం లేదు. మొదటి రోజే ప్రశాంత్ కు రెండు ముఖాలు, యాక్టింగ్ అంటూ నోటికి పనిచెప్పాడు. అనవసర విషయాల్లో తలదూర్చి మరీ జోకర్ అయ్యాడు. ఇక తన సీరియల్ బ్యాచ్‌తో కలిసి ఫేక్ గేమ్స్ ఆడడం.. తమ తప్పులు ఉన్నా.. ఎదుటివాళ్లపై అరుస్తూ నానా రచ్చ చేస్తూ తన గ్రాఫ్ పూర్తిగా తగ్గించేసుకున్నాడు. అలాగే ప్రతి వారం వారం హోస్ట్ నాగార్జున అమర్ దీప్ తప్పులను ఎత్తిచూపుతూ క్లాస్ తీసుకోవడం..
‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. రామా పాత్రలో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఈ హీరో అతిపెద్ద రియాల్టీ లోకి వెళ్తున్నాడని తెలిసినప్పుడు విన్నర్ అని ఫీక్సైపోయారు అడియన్స్. ఈ సీజన్ కప్పు గెలిసేది అమర్ దీప్ అని అంతా అనుకున్నారు. కానీ హౌస్‌లోకి వెళ్లాక అతడి ఆట తీరు.. బిహేవియర్ చూసి ఆశ్చర్యపోయారు. మొదటిరోజు రైతులు, బీటేక్ బాబులు అంటూ రెచ్చిపోయిన అమర్ దీప్.. రోజు రోజుకు హీరో కాస్త కమెడియన్ అవుతున్నాడు. మాటలు, సినిమా డైలాగ్స్ తప్ప ఆట లేదంటూ ఇప్పటికే నెట్టింట అమర్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఏం చేసినా అమర్ దీప్ కు నచ్చడం లేదు. మొదటి రోజే ప్రశాంత్ కు రెండు ముఖాలు, యాక్టింగ్ అంటూ నోటికి పనిచెప్పాడు. అనవసర విషయాల్లో తలదూర్చి మరీ జోకర్ అయ్యాడు. ఇక తన సీరియల్ బ్యాచ్‌తో కలిసి ఫేక్ గేమ్స్ ఆడడం.. తమ తప్పులు ఉన్నా.. ఎదుటివాళ్లపై అరుస్తూ నానా రచ్చ చేస్తూ తన గ్రాఫ్ పూర్తిగా తగ్గించేసుకున్నాడు. అలాగే ప్రతి వారం వారం హోస్ట్ నాగార్జున అమర్ దీప్ తప్పులను ఎత్తిచూపుతూ క్లాస్ తీసుకోవడం.. మళ్లీ రిపీట్ కాదంటూనే తప్పులు చేయడంతో బిగ్ బాస్ విన్నర్ రేస్ నుంచి అమర్ దీప్ ను తప్పించేశారు అడియన్స్.
అయితే ఈ వారం తన ఆట తీరును మార్చుకునేందుకు అమర్ దీప్ ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు శివాజీతో సై అంటూ తలపడిన అమర్ దీప్.. ఇప్పుడు అతడికి దగ్గరవుతున్నాడు. ఈ క్రమంలోనే కొత్త వచ్చిన కంటెస్టెంట్స్ అమర్ దీప్ తప్పులను ఎత్తిచూపడంతో తన గురించి బయట ఏం అనుకుంటున్నారు ? అనే సందేహంలో పడిపోయాడు. దీంతో తన ఈ వారం ఎలిమినేట్ అయిపోతానేమో అని తెగ భయపడిపోతున్నాడు. ఇదే విషయాన్ని శివాజీ ముందు బయటపెట్టాడు. ఇక సోషల్ మీడియాలో మొదటి వారం నుంచి అమర్ దీప్ పై తీవ్రస్థాయిలో నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్ చేసే పోరపాట్లు.. తప్పులతో నెట్టింట నెగిటివి మరింత పెరిగిపోయింది. కొన్ని సందర్భాల్లో అమర్ దీప్ పై వ్యక్తిగత ట్రోలింగ్ జరుగుతుందంటే.. అతడిపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తన కొడుకును బ్యాడ్ చేస్తున్నారని.. ఇకనైనా అతడిపై నెగిటివ్ ట్రోలింగ్ ఆపాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు అమర్ దీప్ తల్లి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
“అమర్ దీప్ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అతడిని చాలా బ్యాడ్ చేస్తున్నారు. దయచేసి అవన్నీ ఆపండి. అమర్ దీప్ చాలా కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. మంచి నటుడు.. డ్యాన్సర్. తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు అనవసరంగా బ్యాడ్ చేస్తున్నారు. రైతుల గురించి ఎవరూ ఎప్పుడూ చెడుగా మాట్లాడరు. రైతెప్పుడూ రాజే.. నేను రైతు బిడ్డనే. అమర్ తండ్రి మెకానిక్. ఎవరూ పెద్ద స్థాయిలో లేరు. మేము మిడిల్ క్లాస్ వాళ్లమే. అమర్ కు పొగరు అంటున్నారు. లేదు తను చాలా మంచి వాడు. అనవసరంగా తన గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. నేను కోరుకునేది ఒక్కటే. అమర్ దీప్ కు సపోర్ట్ చేయండి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.