Bigg Boss 7 Telugu: తేజకు ఝలక్ ఇచ్చిన బిగ్బాస్.. ఒంటిపై శోభా పేరు టాటూ.. అమర్ వర్సెస్ సందీప్..
తాజాగా ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో ఈ రెండు టీమ్స్ మధ్య స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్విమ్మింగ్ ఫూల్ లో అండర్ వాటర్ టాస్కులో భాగంగా.. గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ కు సంబంధించిన ఫ్యూయెల్ రాడ్ ను ఫ్యూయెల్ సెల్ కు తగిలించాల్సి ఉంటుంది. అయితే ఆ ఫ్యూయెల్ రాడ్ ను భద్రంగా ఓ పెట్టేలో పెట్టి తాళాలు వేసి నీటిలో దాచారు. ఈ రెండు ఊళ్లకు సంబంధించిన ఒక్కో ప్లేయర్ ఫూల్ లో దిగి ఆ పెట్టె ఓపెన్ చేసి అందులో ఉన్న ఫ్యూయెల్ రాడ్ తీయాలని చెప్పారు బిగ్ బాస్.
ఇప్పుడు హౌస్లో గులాబీ పురం, జిలేబీ పురం మధ్య టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన టాస్కులలో జిలేబీ పురం టీమ్ గెలిచింది. ఇక నిన్నటి ఎపిసోడ్ మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్గా జరగ్గా.. తాజాగా ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో ఈ రెండు టీమ్స్ మధ్య స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్విమ్మింగ్ ఫూల్ లో అండర్ వాటర్ టాస్కులో భాగంగా.. గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ కు సంబంధించిన ఫ్యూయెల్ రాడ్ ను ఫ్యూయెల్ సెల్ కు తగిలించాల్సి ఉంటుంది. అయితే ఆ ఫ్యూయెల్ రాడ్ ను భద్రంగా ఓ పెట్టేలో పెట్టి తాళాలు వేసి నీటిలో దాచారు. ఈ రెండు ఊళ్లకు సంబంధించిన ఒక్కో ప్లేయర్ ఫూల్ లో దిగి ఆ పెట్టె ఓపెన్ చేసి అందులో ఉన్న ఫ్యూయెల్ రాడ్ తీయాలని చెప్పారు బిగ్ బాస్. ముందుగా ఎవరు ఓపెన్ చేసి ఫ్యూయోల్ సెల్ కు రాడ్ తగిలిస్తారో ఆ టీమ్ గెలిచినట్లు అని తెలిపారు.
ఇక ఈ రెండు టీమ్స్ నుంచి అమర్ దీప్, సందీప్ స్విమ్మింగ్ ఫూల్ లోకి దిగారు. అమర్ దీప్ కు బయటి నుంచి తాళాలు తేజ అందించగా.. సందీప్ కు ప్రియాంక అందించింది. ఈ టాస్కుకు శివాజీ సంచాలకుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. తేజ, ప్రియాంక ఒక్కో తాళం చెవి తీసుకువచ్చి స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్నవాళ్లకు ఇవ్వగా… వారిద్దరూ పెట్టేను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రియాంక తాళం అందించగా.. సందీప్ ముందుగా పెట్టే ఓపెన్ చేశాడు. అయితే ఫ్యూయేల్ రాడ్ చేజారిపోకుండా సందీప్ ను అడ్డుకున్నాడు అమర్ దీప్. సందీప్ ను అస్సలు వదలద్దు అంటూ శోభా శెట్టి అరుస్తూ గోల గోల చేసింది. చివరకు సందీప్ నీటిలో నుంచి ఫ్యూయేల్ రాడ్ బయటకు విసరగా.. ప్రియాంక అందుకుని ఫ్యూయేల్ సెల్ లో వేసింది. దీంతో ఈ టాస్కులో జిలేబి పురం గెలిచినట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
ఇక ఆ తర్వాత టేస్టీ తేజను ఓ ఆటాడుకున్నాడు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న అమ్మాయిలలో ఒకరి పేరు టాటూ వేయించుకోవాలని చెప్పాడు. దీంతో వెంటనే కెమెరా వద్దకు వెళ్లి.. టాటూలు, గీటులు అంటే ఎట్లా బిగ్ బాస్.. పెళ్లి కావాల్సిన కుర్రాడ్ని.. నవ యవ్వనుడ్ని. అంటూ బతిమిలాడినా బిగ్ బాస్ మాత్రం కనికరించలేదు. చివరకు శోభా శెట్టి పేరును ఏ డిజైన్ లో కావాలో చెప్పాలంటూ పోస్ట్ పంపించాడు. కానీ టాటూ వేయించుకోవడానికి మాత్రం తేజ సిద్ధంగా లేడు. కెమెరా ముందుకు వెళ్లి వద్దని బతిమిలాడాడు. మరీ తేజ శోభా పేరు టాటూ వేయించుకున్నాడో లేదో ఎపిసోడ్ లోనే తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.