Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu Promo: మానస్ ఓటమిని తీసుకోడంటూ ఆ కంటెస్టెంట్ కామెంట్స్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతంగా దూసుకుపోతుంది. నిత్యం గొడవలు.. అరుపులు, ఏడుపులు,

Bigg Boss 5 Telugu Promo: మానస్ ఓటమిని తీసుకోడంటూ ఆ కంటెస్టెంట్  కామెంట్స్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్
Bigg Boss
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2021 | 7:23 PM

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతంగా దూసుకుపోతుంది. నిత్యం గొడవలు.. అరుపులు, ఏడుపులు, డ్రామాలతో ఇంటిని రసవత్తరంగా మారుస్తున్నారు కంటెస్టెంట్స్. మొదటి వారం చిన్న చిన్న గొడవలతో సాగిన షో.. ఇక రెండోవారం నామినేషన్స్ ప్రక్రియ నుంచి రణరంగంలా మారింది. బూతులు మాట్లాడుతూ.. శారీరక హింసను సృష్టించేవరకు వెళ్లారు కంటెస్టెంట్స్. ఇక టాస్క్‏లలో శ్రుతిమించిన ఆట తీరును కనబరిచారు. దీంతో శనివారం వచ్చిన హోస్ట్ నాగార్జున.. ఒక్కోక్కరికి క్లాస్ తీసుకున్నారు. తప్పుగా ప్రవర్తించిన వారిని నిల్చోబెట్టి.. తమకు తామే శిక్ష విధించుకోవాలని ఆదేశించారు.

ఇక సండే ఫన్ డే అంటూ బుల్లితెరపై సందడి చేయడానికి వచ్చేశాడు కింగ్ నాగార్జున. బిగ్‏బాస్ సీజన్ 5.. రెండో వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరనేదానిపై ఈరోజు క్లారిటీ రానుంది. నిన్న హౌస్‏లోని సభ్యులకు సీరియస్ వార్నింగ్ ఇస్తూ.. సరిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు నిర్వహకులు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున.. ఆచార్య సినిమా నుంచి లాహే లాహే అనే పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారు. మటన్ బిర్యానీ తినాలని ఉందని.. కాజల్ చెప్పగా.. వంటచేసుకుని తిను అంటూ నాగ్ చెప్పారు. ఇక ఆ తర్వాత ప్రియాంకతో డాన్స్ చేసే మానస్‏కు దొరికింది. ఇక ఆ తర్వాత ఇంట్లో గుంటనక్క ఎవరు అని సిరిని ప్రశ్నించగా.. రవిని చూపించిది. ఇక ఇంట్లో సభ్యులతో డ్యాన్స్‏లు చేయించిన నాగ్.. రవి పెళ్లి చేసుకున్న విషయాన్ని మర్చిపోయాడంటూ కామెడీ చేశాడు నాగార్జున. ఇక ఆ తర్వాత ఇంట్లో ఉన్న దెయ్యం ఎవరు అనేది చెప్పాలనే గేమ్ ప్లాన్ చేసారు.

అందులో లహరి.. ఉమాదేవిని ఎంచుకోగా.. శ్రీరామచంద్ర.. మానస్‏ను ఎంచుకున్నాడు. మానస్ ఓటమిని తీసుకోలేకపోతున్నాడని అనిపిస్తుందని.. శ్రీరామ చంద్ర చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత షణ్ముఖ్.. తనను తాను పనీష్ చేసుకున్నట్లుగా ప్రోమోలో చూపించారు. అయితే ఈరోజు ఉమాదేవి ఇంటి నుంచి ఎలిమినేట్ కాబోతుందని ఇప్పటికే నెట్టింట్లో వరుస కథనాలు హల్‎చల్ చేస్తున్నాయి. మరి ఎలిమినేటెకడ్ కంటెస్టెంట్ ఎవరనేది తెలుసుకోవాలంటే.. ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Also Read:

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..