Bigg Boss 5 Telugu: అతి చేసిన కాజల్.. మాట మారుస్తున్నావంటూ రవి సీరియస్… ఇద్దరూ ఎక్కడ తగ్గలేదుగా..
Bigg Boss 5 Telugu Promo: సీన్ అస్సలు మారడం లేదు.. కంటెస్టెంట్స్ తీరు ఇప్పటికీ అర్థం కావడం లేదు. బిగ్‌బాస్ రియాల్టీ షో.. ప్రేక్షకులకు కావాల్సినంత
Bigg Boss 5 Telugu Promo: సీన్ అస్సలు మారడం లేదు.. కంటెస్టెంట్స్ తీరు ఇప్పటికీ అర్థం కావడం లేదు. బిగ్‌బాస్ రియాల్టీ షో.. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్ చేసేవి గత సీజన్లు ఉండేవి.. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఈసారి సీజన్ 5 నడుస్తుందనడంలో అస్సలు సందేహం లేదు.. బిగ్‌బాస్ సీజన్ 5.. నాలుగు వారాలు పూర్తిచేసుకుని ఐదో వారంలోకి ఎంటర్ అయిన.. సీన్ మాత్రం మారడం లేదు. రోజు రోజూకీ మరింత చికాకు పుట్టిస్తూ.. ప్రేక్షకులు విసుగు వచ్చేలా చేస్తున్నారు కంటెస్టెంట్స్.. మొదటి రెండు వారాలు లోబో తన కామెడీతో కాస్త నవ్వించినా.. ఇప్పుడు ఆ కామెడీ కూడా లేదు. అనవసర మాటలు.. ఆరోపణలు.. శ్రుతిమించిన గొడవలతో ఇంటి రణరంగంగా మారుస్తున్నారు సభ్యులు. ఇక నిన్న సోమవారం ప్రక్రియను బిగ్ బాస్ సరికొత్తగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరికి పిలిచి నామినేట్ ప్రక్రియ జరపడంతో.. తమ మనసులోని మాటలను బయటపెట్టారు కంటెస్టెంట్స్. ఇక ఎప్పుడు లేని విధంగా.. ఈసారి ఇంట్లోని అబ్బాయిలు పూర్తిగా నామినేట్ అవ్వగా.. ఎక్కువ మంది సభ్యులు షణ్ముఖ్ జస్వంత్‌ను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. అందులో కాజల్, రవి మధ్య మాటల యుద్ధం జరిగినట్లుగా తెలుస్తోంది. ముందుగా కాజల్.. రవి దగ్గరకు వెళ్లి తన మాటలతో చిరాకు కలిగించినట్లుగా తెలుస్తోంది. కాజల్ మాట్లాడుతూ..నిన్న గొడవ జరిగింది ఎందుకంటే.. రవి, లోబో వాష్ రూమ్‌లో నుంచి లేచి.. డిన్నర్‌లోకి రావడానికి అంటూ గంతులేసింది. అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ.. వాళ్లను ఎందుకు రెచ్చగొడుతున్నావ్ అని అడగ్గా.. అది కేవలం ఫన్నీ అని చెప్పుకొచ్చింది కాజల్..ఇక అక్కడకు వచ్చిన రవి కాజల్ పై ఫైర్ అయ్యాడు. రెచ్చగొట్టేలా ఉంటుందని తనకు తెలియదని కాజల్ చెప్పగా.. తెలుసుకోవాలని సూచించాడు రవి. నువ్వు మెచ్యూర్ అనుకుంటున్నానని.. తెలుసుకోకుండా ఎలా వస్తావని సీరియస్ అయ్యారు. ఇక దీంతో రవి, కాజల్ మధ్య మాటల యుద్ధం ఎక్కువగానే నడించింది. ఇక చివరకు ఫేమ్ మీదే మాట మారుస్తున్నావంటూ రవి సీరియస్‌గా వెళ్లిపోవడం ప్రోమోలో కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు కాజల్, రవి మధ్య పెద్దగానే వార్ జరిగినట్లుగా తెలుస్తోంది.
Also Read: Maa Elections 2021: మా ఎన్నికల్లో మరో ట్విస్ట్.. ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ..
Maha Samudram: మహాసముద్రంలో శర్వానంద్ మజిలీ ముగిసింది.. ఇక విడుదల ఎప్పుడంటే..
Akhanda : బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. అఖండ నుంచి లేటేస్ట్ అప్డేట్ మీకోసమే..