Bigg Boss : బిగ్బాస్ హౌస్లో మొదలైన ప్రేమ.. మతం కోసం త్యాగం.. విడిపోతున్నట్లు ప్రకటించిన లవ్ బర్డ్స్..
కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగుపెట్టిన వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది. హిమాన్షి సీజన్ ప్రారంభంలోనే ఎలిమినేట్ కాగా. ఆసిమ్ రియాజ్ మాత్రం రన్నరప్ అయ్యారు. సీజన్ 13 తర్వాత వీరిద్దరూ దాదాపు 3 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే ఇప్పుడు వీరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మనస్పర్థల కారణంగా కాకుండా.. కేవలం తమ మత విశ్వాసాల కోసమే ప్రేమను త్యాగం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని హిమాన్షి తన ఇన్ స్టా వేదికగా ఓ నోట్ షేర్ చేసింది.
బిగ్బాస్ సీజన్ 13 ఎంత సూపర్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు హిందీలో జరిగిన అన్ని సీజన్లలో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ తమ ఆట తీరుతో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా హౌస్ లో ప్రేమకథలు సైతం మొదలయ్యాయి. మొదట సిద్ధార్థ్, షెహనాజ్ ప్రేమ కహానీ మొదలవ్వగా.. ఆ తర్వాత రియాజ్, హిమాన్షి ఖురానా కూడా పాపులర్ అయ్యారు. కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగుపెట్టిన వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది. హిమాన్షి సీజన్ ప్రారంభంలోనే ఎలిమినేట్ కాగా. ఆసిమ్ రియాజ్ మాత్రం రన్నరప్ అయ్యారు. సీజన్ 13 తర్వాత వీరిద్దరూ దాదాపు 3 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే ఇప్పుడు వీరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మనస్పర్థల కారణంగా కాకుండా.. కేవలం తమ మత విశ్వాసాల కోసమే ప్రేమను త్యాగం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని హిమాన్షి తన ఇన్ స్టా వేదికగా ఓ నోట్ షేర్ చేసింది.
“అవును.. మేము ఇప్పుడు కలిసి లేము. ఇకపై ఇండాలని కూడా అనుకోవడం లేదు. మేమిద్దరం కలిసి గడిపిన సమయం చాలా గొప్పది. కానీ మా కలయిక ఇప్పుడు ముగిసింది. మా రిలేషన్ షిప్ ప్రయాణం చాలా బాగుంది. ఇకపై మా జీవితంలో ముందుకు సాగుతున్నాము. అందుకు మా మతాలకు తగిన గౌరవంతో.. మా ఇద్దరి వేర్వేరు మత విశ్వాసాల కోసం మా ప్రేమను త్యాగం చేస్తున్నాము ” అంటూ రాసుకొచ్చింది హిమాన్షి. ప్రతి ఒక్కరూ తమ గోప్యతను గౌరవించాలని కోరింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన నోట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
— Himanshi khurana (@realhimanshi) December 6, 2023
అసలు విషయానికి వస్తే.. హిమాన్షి.. పంజాబీ సిక్కు కుటుంబానికి చెందిన అమ్మాయి. అసిమ్ జమ్మూ ప్రాంతానికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. వీరిద్దరి బిగ్బాస్ సీజన్ 13లో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరు తమ ప్రేమను కొనసాగించారు. ఇక తన ఇన్ స్టా స్టోరీలో మరోసారి బ్రేకప్ గురించి ప్రస్తావించింది హిమాన్షి. ‘మేము చాలా ప్రయత్నించాము. కానీ మా ప్రేమకు పరిష్కారం కనుగొనలేకపోయాము. ఇప్పటికీ ఒకరినొకరు ప్రేమిస్తున్నాం. కానీ కలిసి జీవించేందుకు అదృష్టం కలిసి రాలేదు. మా మధ్య ఎలాంటి ద్వేషం లేదు. ప్రేమ మాత్రమే ఉంది. దీనిని పరిణితి చెందిన నిర్ణయం అంటారని భావిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.