Bigg Boss 7 Telugu: బిగ్బాస్ షోకు సెన్సార్ లేకపోతే ఎలా ?.. నాగార్జునకు హైకోర్టు కీలక ఆదేశాలు..
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ విషయంలో హైకోర్ట్ కీలక వ్యాఖయలు చేసితంది. టీవీల్లో అసభ్య, అభ్యంతరకర రీతిలో రియాల్టీ షోలు.. ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్ చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు రావడం అంటే పోస్టుమార్టం చేయడంలాంటిదని ఘాటుగా వ్యాఖ్యనించింది.
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ విషయంలో హైకోర్ట్ కీలక వ్యాఖయలు చేసితంది. టీవీల్లో అసభ్య, అభ్యంతరకర రీతిలో రియాల్టీ షోలు.. ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్ చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు రావడం అంటే పోస్టుమార్టం చేయడంలాంటిదని ఘాటుగా వ్యాఖ్యనించింది. ప్రస్తుతం ఈ షో ప్రసారం కావడం లేదనే కారణంగా ఈ విషయంపై న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండలేదని తెలిపింది. దీనిపై అటు కేంద్రానికి తగిన సూచనలు ఇచ్చే విషయాన్నీ పరిశీలిస్తామని వెల్లడించింది హైకోర్టు. పిల్లి మెడలో గంట కట్టేదేవరనేది ఇక్కడ ప్రధాన విషయమని వ్యాఖ్యనించింది. రియాల్టీ షోపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాటీవీ, ఎన్డేమోల్ ఇడియా ప్రైవేట్ లిమిటెడ్, బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్, సినీ హీరో అక్కినేని నాగార్జులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణన నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
అశ్లీలతను ప్రోత్సహించేదిగా.. యువతను పెడదోవ పట్టిస్తోన్న రియాల్టీ షోలు ఉన్నాయంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు.. నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి దాఖలు చేసిన పిల్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనల్ తరపున న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. సెన్సార్ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని.. ఇలాంటి కార్యక్రమాలను రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల లోపు ప్రసరం చేయాలని అన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ షో ప్రసారం కావడం లేదని.. ఇలాంటి పిటిషన్స్ దాఖలు చేయడం నిరార్థకరమన్నారు ఎండేమోల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ న్యాయవాది. అలాగే బిగ్ బాస్ షో ప్రసారానికి ముందు సెన్సార్ షిప్ విదానం లేదని..ప్రసారం అయ్యాక అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేయవచ్చని.. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ చట్ట ప్రకారం ఫరి్యాదులను పరిశీలించేందుకు మూండంచేల వ్యవస్థ ఉన్నారు. ప్రసారానికి ముందే సెన్సార్‌షిప్ చేయాలనుకుంటే కేంద్రం చట్టం చేయాల్సి ఉంటుందని అన్నారు స్టార్ ఇండియా సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి.
వాదనలు విన్న హైకోర్టు స్పందిస్తూ.. టీవీల్లో కార్యక్రమానికి ముందే సెన్సార్ షిప్ లేకపోతే ఎలా ?.. ఈ విషయంలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని.. ప్రసారమయ్యాక ఫిర్యాదులు రావడంపై చర్యలు తీసుకుని ఏం ప్రయోజనం ?అని ప్రశ్నించింది. అలా చేయడమంటే పోస్టుమార్టం వంటిదే అని.. ప్రతి ఛానల్ అశ్లీలతతో కూడిన కార్యక్రమాలను ప్రసారం చేస్తే దాన్ని పర్యవేక్షించకూడదా ?.. అందుకు యంత్రాంగం లేకపోతే ఎలా అని ప్రశ్నలు సంధించింది. బిగ్ బాస్ షో ప్రసారానికి సెన్సార్ చేసే వ్యవహారంపై కేంద్రానికి తగిన సూచనలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.