Anchor Suma: యాంకర్ సుమను ఓ ఆటాడుకున్న జాతిరత్నాలు డైరెక్టర్.. కామెడీ పంచులతో షాకులిచ్చిన అనుదీప్, శివకార్తికేయన్..
ప్రిన్స్ చిత్రయూనిట్ క్యాష్ ప్రోగ్రాంకు విచ్చేసింది. తాజాగా వీరి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. అందులో డైరెక్టర్ అనుదీప్, హీరో శివకార్తికేయన్ షోలో సందడి చేశారు.

జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు డైరెక్టర్ కెవి అనుదీప్. ఈ మూవీ ప్రమోషన్లలో.. సక్సెస్ మీట్లో అనుదీప్ చేసిన కామెడీ వేరేలెవల్. ముఖ్యంగా యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొని… తనదైన కామెడీ టైమింగ్‌తో రచ్చ చేశాడు. పంచులు.. డైలాగ్స్‌తో సందడి చేశారు. ఇక ఇప్పుడు మరోసారి క్యాష్ షోలో పాల్గొని సుమను మరోసారి ఓ ఆటాడుకున్నాడు. అనుదీప్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నేరుగా తెలుగులో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రిన్స్ టైటిల్‌తో ఈ మూవీ అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా.. ప్రిన్స్ చిత్రయూనిట్ క్యాష్ ప్రోగ్రాంకు విచ్చేసింది. తాజాగా వీరి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. అందులో డైరెక్టర్ అనుదీప్, హీరో శివకార్తికేయన్ షోలో సందడి చేశారు.
అయితే ఇక్కడ అనుదీప్ ఎంట్రీ హైలెట్ అయ్యింది. బ్యాండ్ మేళం ఊరేగింపుతో.. నలుగురు వ్యక్తులు ఆయనను ఎత్తుకొని రావడం జరిగింది. రాగానే అనుదీప్ గారు.. మన సభను ఉద్దేశించి ఏదోకటి చెప్పాలని సుమ అడగ్గా.. థాంక్యూ.. షో చూసి ఎంజాయ్ చేయండి అంటూ సెటైర్ వేశారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే.. ఎపిసోడ్ ఫుల్ ఫన్ గా సాగినట్లుగా తెలుస్తోంది. అనుదీప్, హీరో శివకార్తికేయన్ ఇద్దరూ యాంకర్ సుమను ఓ రేంజిలో ఆడుకున్నారు.
జాతిరత్నాలు సినిమా తర్వాత మీకు జరిగిన మోస్ట్ ఎమోషనల్ ఇన్సిడెంట్ ఏమిటి అని సుమ అడగ్గా.. తనదైన స్టైల్లో స్టోరీ చెప్పేశాడు. అలాగే.. ఇలాంటి షోకి మీరెప్పుడైనా వెళ్లారా ? అని శివకార్తికేయన్‌ను అడగ్గా.. చాలా అటెండ్ అయ్యాను. కానీ ఇదే మొదటి సారి అంటూ పంచ్ వేశాడు శివకార్తికేయన్. మొత్తానికి ఎప్పుడూ తన షోకు వచ్చే అతిథులను తన వాక్చాతుర్యంతో ఆటాడుకునే సుమకు.. తమ కామెడీ పంచులతో చుక్కలు చూపించారు అనుదీప్.. శివకార్తికేయన్.. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరలవుతుంది.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.