Anasuya Bharadwaj: జబర్దస్త్ మానేయడానికి కారణం వారిద్దరే.. అసలు విషయం చెప్పిన అనసూయ..

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. మధ్యలోనే ఈ షోకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పటికే జడ్జిలు.. సీనియర్ కామెడియన్స్ వెళ్లిపోగా.. ఈషో నుంచి అనసూయ సైతం బయటకు వచ్చేసింది.

Anasuya Bharadwaj: జబర్దస్త్ మానేయడానికి కారణం వారిద్దరే.. అసలు విషయం చెప్పిన అనసూయ..
Anasuya

Updated on: Jan 20, 2023 | 9:28 PM

యాంకర్ అనసూయ.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రంగస్థలం సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్న ఈ యాంకరమ్మ.. ఆ తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ మెప్పిస్తోంది. అయితే సినిమాల్లోకి రాకముందు అనసూయ.. బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు పరిచయం. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‏ను పలకరించింది. ఈ షో ద్వారా ఆమె ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తనదైన కామెడీ పంచులతో.. యాంకరింగ్‏లో బుల్లితెరపై సందడి చేసిన అనసూయ.. ఇప్పుడు వెండితెరపై తెగ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది. అయితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. మధ్యలోనే ఈ షోకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పటికే జడ్జిలు.. సీనియర్ కామెడియన్స్ వెళ్లిపోగా.. ఈషో నుంచి అనసూయ సైతం బయటకు వచ్చేసింది. దీంతో ఆమె వెళ్లిపోవడానికి గల కారణాలు ఏంటని ఆరాలు తీశారు నెటిజన్స్. అయితే తాను జబర్దస్త్ మానేయడానికి కారణం సినీ అవకాశాలు రావడమే అని గతంలో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఈ షో మానేయడానికి గల కారణాలను వెల్లడించింది.

జబర్ధస్త్ మానేయడానికి కారణం తన పిల్లలు అని ఊహించని ఆన్సర్ ఇచ్చింది. తన ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారని.. వాళ్లతో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నట్లు తెలిపింది. అంతేకాదు.. వారు పెద్దయ్యాక ఈ షోలో నన్ను కించపరిచేలా మాట్లాడిన మాటలు వింటే నొచ్చుకుంటారనే ఉద్దేశంతో బయటకు వచ్చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే మరిన్ని కారణాలున్నాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం అనసూయ.. పుష్ప 2,రంగమార్తాండ సినిమాలతోపాటు.. గురజాడ అప్పారావు నాటకం కన్యాశుల్కం నవల ఆధారంగా తెరకెక్కుతోన్న కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే సందీప్ కిషన్ నటిస్తోన్న మైఖేల్ చిత్రంలోనూ ఓ కీలకపాత్ర పోషిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us