AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : యూట్యూబ్ సెన్సేషన్.. 21 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీని శాసిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ వేరెలెవల్ భయ్యా..

ప్రస్తుతం యూట్యూబ్ లో ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాల నుంచి విడుదలైన పలు పాటలు తక్కువ సమయంలోనే మిలియన్ వ్యూస్ అందుకుని సెన్సేషన్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ 21 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్ క్రియేట్ చేసిన 4 పాటలు యూట్యూబ్‌లో 800 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

Tollywood : యూట్యూబ్ సెన్సేషన్.. 21 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీని శాసిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ వేరెలెవల్ భయ్యా..
Sai Abhyankkar
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2026 | 8:26 AM

Share

ప్రస్తుతం ఇది యూట్యూబ్ యుగం. సోషల్ మీడియాలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు చాలా మంది. అలాగే ఈ మధ్య కాలంలో నెట్టింట ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. అలాగే పలు చిత్రాల నుంచి విడుదలైన సాంగ్స్ సైతం దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఒక నాలుగు పాటలు 800 మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. అయితే ఆ నాలుగు పాటలను క్రియేట్ చేసింది మాత్రం 21 ఏళ్ల యువ సంగీత దర్శకుడు. అతను వరుసగా విడుదల చేసిన ఆల్బమ్ పాటలన్నీ చార్టులలో అన్నిచోట్లా హిట్‌గా నిలిచాయి. అతను ఎవరో మీకు తెలుసా? సాయి అభ్యంకర్. ఈ పేరు వినే ఉంటారు కాదు.. ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. పాపులర్ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల కుమారుడు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..

చెన్నైలో పుట్టి పెరిగిన అతనికి, తల్లిదండ్రులిద్దరూ సంగీత రంగంలో ఉండటంతో సహజంగానే సంగీతంపై మక్కువ పెరిగింది. అతను చిన్నతనం నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆయన చెల్లెలు స్మృతి కూడా గాయని. ఇక సాయి అభయంక విషయానికొస్తే.. సింగర్స్ శ్రీరామ్ పార్థసారథి, ఎ.డి. రామమూర్తి, హెన్రీ కురువిల్లాల వద్ద శిక్షణ తీసుకున్నాడు. 13 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ క్రియేట్ చేశాడు. 2023లో శ్రీరామ్ పార్థసారథి స్వరపరిచిన ‘వలం వరవేండం’ అనే పాటను పాడారు. ఇది ఆయన తొలి పాట. ఆ తర్వాత, ఆయన సంగీతంపై మరింత దృష్టి సారించి, 2024లో తన తొలి పాట ‘కచ్చి సెరా’ను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్‌లో పెద్ద హిట్ అయింది.

ఎక్కువ మంది చదివినవి : Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..

తొలి ఆల్బమ్‌లోని ‘కడ్చి చేరా’ పాట యూట్యూబ్‌లో 265 మిలియన్ల వ్యూ్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తన తర్వాతి పాటను జూన్ 2024లో విడుదల చేశారు. ఆ ఆల్బమ్‌లోని ‘ఆస కూడా’ పాట యూట్యూబ్‌లో 385 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఆస ​​కూడా’ పాటలో నటి ప్రీతి ముకుందన్ నృత్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ స్పందన లభించింది. 2025లో, మీనాక్షి చౌదరి నటించిన ‘చిత్ర పుత్రి’ పాటకు సాయి అభయంకర్ సంగీతం అందించి, పాడారు. ఈ పాట 50 మిలియన్ల వీక్షణలను సాధించింది.

ఎక్కువ మంది చదివినవి : Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

View this post on Instagram

A post shared by Sai Abhyankkar (@abhyankkar)

ఇటీవల, నటి కయాదు లోహర్ అద్భుతంగా నటించిన ‘పవళ్ మళ్ళీ’ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ దాటింది. అతడు మొత్తం 4 పాటలతో యూట్యూబ్‌లో 800 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టాడు. గత సంవత్సరం ప్రారంభంలో, ఆయన సాన్వే మేఘన నటించిన ‘విళి వారకూరా’ పాటను విడుదల చేశారు, ఇది 30 మిలియన్ల వీక్షణలను పొందింది. ప్రస్తుతం కరుప్పు సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే అట్లీ సినిమాకు సైతం మ్యూజిక్ అందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sai Abhyankkar (@abhyankkar)

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఏం సినిమా రా బాబూ.. పేరుకే పక్కా కామెడీ మూవీ.. కానీ 15 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్.. ఇప్పుడు ఓటీటీలో రచ్చ..

Follow Us