
బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ షో ప్రారంభానికి ముహూర్తం ముంచుకొస్తోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ లాంఛింగ్ కు డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుందని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సారి షోను మరింత స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డబుల్ హౌస్ తో పాటు టాస్కులు, గేమ్స్ ల విషయంలో సరికొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ప్రోమోలో కూడా చూపించారు. ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. మరోవైపు ఈసారి హౌస్ లో అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరా? అని తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఆడియెన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి పలువురు బుల్లితెర ప్రముఖులు బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. ఇందులో ఒక ప్రముఖ హీరోయిన్, బుల్లితెర నటి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో చాలా సీజన్లలో ఈ ముద్దుగుమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. అయితే ఈసారి మాత్రం ఈ బుల్లితెర బ్యూటీ ఎంట్రీ ఫిక్స్ అంటున్నారు. ఆమె మరెవరో కాదు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై అదరగొడుతోన్న నవ్య స్వామి.
కన్నడ నాటకు చెందిన నవ్య స్వామి ‘నా పేరు మీనాక్షి’, ‘కంటే కూతురునే కనాలి’, ‘ఆమె కథ’ తదితర సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై ఇక్కడే స్థిరపడిపోయింది. పలు టీవీ షోల్లోనూ మెరుస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తోంది. బుట్ట బొమ్మ సినిమాతో మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఈ అందాల తార ఆ తర్వాత ఇంటింటి రామాయణం, రావణాసుర తదితర సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఇందులో ఇంటింటి రామాయణం సినిమాలో నవ్య స్వామి పోషించిన పాత్ర అందరినీ ఆకట్టుకుంది.
సినిమాలు, సీరియల్స్ సంగతి పక్కన పెడితే నవ్య స్వామి ప్రముఖ నటుడు రవి కృష్ణతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు టీవీ షోల్లోనూ కలిసి డ్యాన్స్ లు గట్రా చేశారీ లవ్ బర్డ్స్. ఓటీవీ షోలో అయితే ఈ ఇద్దరికి పెళ్లి కూడా చేశారు. దీంతో వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. విరూపాక్ష సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి కృష్ణ గతంలో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఇప్పుడు అతని ప్రియురాలు నవ్య స్వామి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్ట నుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.