భారీగా పడిపోయిన సునీల్ రెమ్యూనరేషన్..!
కమెడియన్‌గా పీక్ స్థాయిలో ఉన్న సమయంలోనే సునీల్..హీరోగా టర్న్ అయ్యాడు. అదృష్టవశాత్తూ మొదటి రెండు, మూడు చిత్రాలు అతన్ని మంచి బ్రేకే ఇచ్చాయి. ఆ సమయంలో సునీల్ మార్కెట్ రూ. 2 , 3 కోట్ల వరకు వెళ్లింది. కానీ తర్వాత వరస డిజాస్టర్లు సునీల్ కెరీర్‌ను కృంగదీశాయి. ఒక్క సినిమా కూడా మధ్యలో యావరేజ్ అనిపించుకోలేదు. ఈ క్రమంలో సునీల్ బ్యాక్ టూ కమెడియన్ అన్నాడు. తనకు తెలుగు ప్రజల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చిన హాస్య […]
కమెడియన్‌గా పీక్ స్థాయిలో ఉన్న సమయంలోనే సునీల్..హీరోగా టర్న్ అయ్యాడు. అదృష్టవశాత్తూ మొదటి రెండు, మూడు చిత్రాలు అతన్ని మంచి బ్రేకే ఇచ్చాయి. ఆ సమయంలో సునీల్ మార్కెట్ రూ. 2 , 3 కోట్ల వరకు వెళ్లింది. కానీ తర్వాత వరస డిజాస్టర్లు సునీల్ కెరీర్‌ను కృంగదీశాయి. ఒక్క సినిమా కూడా మధ్యలో యావరేజ్ అనిపించుకోలేదు. ఈ క్రమంలో సునీల్ బ్యాక్ టూ కమెడియన్ అన్నాడు. తనకు తెలుగు ప్రజల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చిన హాస్య పాత్రలకు మరోసారి జై కొట్టాడు.
మళ్లీ కమెడియన్‌గా మారడంతో ప్రస్తుతం డే కాల్షీట్లకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. సినిమా హీరో అంటే గంపగుత్తగా ఇంత పారితోషకం అని మాట్లాడుకుంటారు. కానీ ప్రస్తుతం షూటింగ్ ఎన్ని రోజులు ఉంటే..అన్ని రోజులకు నిర్మాతలు సునీల్‌కు పేమెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అతడు రోజుకు రూ. 2 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పరిధి ఎక్కువ ఉన్న పాత్రలు మాత్రం లభించడం లేదు. సునీల్ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అతనికి లెంగ్తీ రోల్స్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఈ ఏస్ కమెడియన్ పవన్, క్రిష్ కాంబోలో రాబోతున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ‘కలర్ ఫోటో’ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు తన మార్కెట్‌ను తిరిగి తీసుకొస్తాయని మంచి నమ్మకంతో ఉన్నాడు సునీల్. మరి అతడి ఆశలు నెరవేరతాయో, లేదో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.