మెగాస్టార్ చేయలేనిది.. పవర్ స్టార్ చేస్తున్నాడు!

మెగాస్టార్ చిరంజీవి చేయలేనిది.. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నాడు. అదేంటా అని అందరూ క్యూరియాసిటీగా ఉన్నారు కదూ. మెగాస్టార్ ఇప్పటికి 152 సినిమాలు చేసినా.. ఓ కోరిక మాత్రం..

మెగాస్టార్ చేయలేనిది.. పవర్ స్టార్ చేస్తున్నాడు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 03, 2020 | 7:52 PM

మెగాస్టార్ చిరంజీవి చేయలేనిది.. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నాడు. అదేంటా అని అందరూ క్యూరియాసిటీగా ఉన్నారు కదూ. మెగాస్టార్ ఇప్పటికి 152 సినిమాలు చేసినా.. ఓ కోరిక మాత్రం అలానే ఉండిపోయిందట. చిరు ప్రస్తుతం 152వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతంది. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. ‘ఆచార్య’ అనే టైటిల్‌ని పెట్టినట్టు చిరు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నోరు జారారు. ఇక అసలు విషయమేంటంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాల్లోని పాత్రలో నటించాలనే కోరికట. ఇప్పటికీ అది అలాగే మిగిలిపోయింది. గతంలో ఓ అవకాశం వచ్చినా.. ఎందుకో మిస్ అయ్యింది.

అయితే.. పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఆ ఛాన్స్ కొట్టేశారు. బాలీవుడ్ కింగ్ అమితాబ్ నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్‌ అయ్యి.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.