AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alekhya Reddy: బాలయ్య.. మీలో దేవుణ్ని చూస్తున్నాం.. అలేఖ్యా రెడ్డి ఎమోషనల్‌ పోస్ట్‌.

నందమూరి తారకరత్న అకాఆల మరణం అభిమానులతో పాటు వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి తీరని శోకాన్ని మిగిల్చాడు...

Alekhya Reddy: బాలయ్య.. మీలో దేవుణ్ని చూస్తున్నాం.. అలేఖ్యా రెడ్డి ఎమోషనల్‌ పోస్ట్‌.
Alekhya Reddy
Narender Vaitla
|

Updated on: Mar 21, 2023 | 8:16 AM

Share

నందమూరి తారకరత్న అకాఆల మరణం అభిమానులతో పాటు వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి తీరని శోకాన్ని మిగిల్చాడు. భర్త లేడని, ఇక తిరిగి రాడని తెలిసిన అలేఖ్యా రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇప్పటికే భర్త జ్ఞాపకాలతో కుమిలిపోతోంది అలేఖ్యా రెడ్డి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తు్న్న పోస్టులే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.

ఇక తారకరత్న మరణానంతరం ఆయన కుటుంబానికి అండగా నిలిచారు నటుడు బాలకృష్ణ. తారకరత్న పిల్లలకు తాను అండగా ఉంటానంటూ మాటిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హిందూపూరంలో నిర్మించిన ఆసుపత్రిలో ఓ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా.. పేదలకు ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. దీంతో బాలయ్యపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తారకరత్న భార్య అలేఖ్యా కూడా ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది.

బాలకృష్ణ ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యా.. ‘మీపై నాకున్న కృతజ్ఞతను ఎలా చెప్పగలను. నేను ఏమి చెప్పినా అది మీ ముందు తక్కువే అవుతుంది. మీ మనసు బంగారం. ఈ మాట చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీలా మరెవరూ చేయలేరు. మిమ్మల్ని ఓ తండ్రిగా, స్నేహితునిగానే చూశాం. ఇప్పుడు మీలో దేవుడిని చూస్తున్నాం. మీ ప్రేమతో నాకు మాటలు రావడం లేదు. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం’ అంటూ పోస్ట్‌ చేసింది. అలేఖ్యా చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..