AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paramporul OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ‘పరంపోరుల్’ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

నిన్న వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ సైంధవ్ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఆహా ఓటీటీలో హారర్ మూవీ పిండం స్ట్రీమింగ్ అవుతుంది. అటు ఫ్యామిలీ మాస్ యాక్షన్ డ్రామా.. ఇటు భయంతో వెన్నులో వణుకు పుట్టించే హారర్ సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది.

Paramporul OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. 'పరంపోరుల్' మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
Paramporul Movie
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2024 | 3:55 PM

Share

ప్రస్తుతం థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేస్తున్నారు. గత శుక్రవారం ఎన్నో చిత్రాలు అడియన్స్ ముందుకు వచ్చి మెప్పించాయి. అటు ఓటీటీలోనూ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్టైన్మెంట్స్, హారర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నిన్న వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ సైంధవ్ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఆహా ఓటీటీలో హారర్ మూవీ పిండం స్ట్రీమింగ్ అవుతుంది. అటు ఫ్యామిలీ మాస్ యాక్షన్ డ్రామా.. ఇటు భయంతో వెన్నులో వణుకు పుట్టించే హారర్ సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై భారీ హిట్ అందుకుంది. అదే పరంపోరుల్. గతేడాది కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో సీనియర్ హీరో శరత్ కుమార్, అమితాశ్ ప్రధాన్ ప్రధాన పాత్రలలో నటించగా.. అరవింద్ రాజ్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమా కశ్మీరా పరదేశి కథానాయికగా నటించింది. బాలాజీ శక్తివేల్, టి.శివ విన్సెంట్ అశోఖన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందంచారు. గతేడాది సెప్టెంబర్ 1న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 15 కోట్లు రాబట్టింది. కథ, కథనం స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఫిబ్రవరి 1నుంచి ఈ మూవీ తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఓటీటీలో అత్యధిక రెస్పాన్స్ అందుకున్న సినిమాల్లో పరంపోరుల్ ఒకటి. పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ మూవీ కథ తిరుగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ విగ్రహం మెయిన్ స్టోరీనే ఈ పరంపోరుల్ అన్నట్లుగా తెలుస్తోంది. మరీ థియేటర్లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మిస్ అయిన వారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా